Home
Apps

విదేశీ యాత్రలో మీకు ఉపయోగపడే యాప్ లు ఇవే....

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మినీ కంప్యూటర్ల లాగా పనిచేస్తున్నాయి. వీటితో ఇంటర్నెట్‌ ద్వారా చేసే అన్ని రకాల పనులను కొన్ని క్షణాలలో చేతి వేళ్ళతో ముగిస్తున్నారు. ఫోన్ లేకుండా టికెట్ బుకింగ్ల నుండి కరెన్సీ ఎక్స్చేంజ్ మరియు అన్ని రకాల పేమెంట్స్ వరకు కూడా ఉహించలేము. స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని రకాల యాప్ లతో చాలా రకాల పనులను అతి తక్కువ సమయంలో చేయవచ్చు.

ఐదు ముఖ్యమైన యాప్ లు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని కుతూహలత ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు మొదటి సారిగా వెళ్లే వారు అక్కడి పరిస్థితుల మీద కాస్త అవగాహన పొందిన తరువాత వెళ్లడం మంచిది.

 

 

విదేశీ యాత్ర

విదేశీ యాత్రలో ఉండే సమస్యలను అధిగమించడానికి మీకు మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లోని ఈ ఐదు ముఖ్యమైన యాప్ లు ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి తమ దేశం వెలుపల ప్రయాణించేటప్పుడు తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో తప్పనిసరిగా ఉంచుకోవలసిన యాప్ ల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

 

XE

XE

కరెన్సీ కన్వర్టర్ యాప్ XE ను ఉపయోగించి అతను లేదా ఆమె వారి స్వంత కరెన్సీలో ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఒకేసారి 10 రకాల కరెన్సీలను చూడవచ్చు. ఇది అంతర్జాతీయంగా డబ్బు బదిలీలను చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. XE యాప్ iOS మరియు ఆండ్రాయిడ్ రెండు ఫోన్లకు కూడా మద్దతును ఇస్తుంది.

 

 

PayPal

PayPal

మీరు మీ బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డుతో పేపాల్‌ను కనెక్ట్ చేయవచ్చు. అవసరమైనప్పుడు డబ్బును తిరిగి పొందగలిగే, బదిలీ చేయగల మరియు సురక్షితమైన ప్రదేశంగా కూడా ఈ యాప్ పని చేస్తుంది. పేపాల్ యాప్ iOS మరియు ఆండ్రాయిడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

 

 

Trail Wallet

Trail Wallet

ఈ యాప్ తో ప్రతి ట్రిప్‌కు లేదా ఒక నెలకు అయ్యే ఖర్చును ట్రాక్ చేయవచ్చు. ఇందులో ఆహారం, వసతి మరియు రవాణాలో ఖర్చును పర్యవేక్షించడమే కాకుండా మీ యొక్క రోజువారీ బడ్జెట్‌ను కూడా పరిష్కరించవచ్చు. ట్రైల్ వాలెట్ యూజర్ ఫ్రెండ్లీ మరియు ఒక బటన్ నొక్కడంతో మీ అకౌంట్ లో మిగిలి ఉన్న డబ్బును తనిఖీ చేయవచ్చు. స్థానిక కరెన్సీలో మీరు ఖర్చు చేసిన మొత్తాన్ని మీ యొక్క దేశం కరెన్సీ విలువలతో మీరు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది iOS లో మాత్రమే అందుబాటులో ఉంది.

 

 

Google Maps

Google Maps

మీరు విదేశాలలో లేదా స్థానికంగా ప్రయాణిస్తున్నా కూడా మీకు ఎక్కువగా ఉపయోగపడే యాప్ గూగుల్ మ్యాప్స్. ఇది 100 శాతం ఖచ్చితమైనది కానప్పటికీ ఇది నావిగేషన్ కోసం గొప్ప సాధనం. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ఉపయోగించబడుతుంది.

 

 

Mobile Passport

Mobile Passport

మొబైల్ పాస్‌పోర్ట్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. మొబైల్ పాస్‌పోర్ట్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ మరియు కస్టమ్స్ డిక్లరేషన్ సమాచారాన్ని ఫోన్ ద్వారా సమర్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని అర్థం మీరు కస్టమ్స్ కౌంటర్ వద్ద ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

Best Mobiles in India

English summary
5 Useful Apps for Traveling Abroad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X