Just In
- 2 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 3 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 20 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 22 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
Don't Miss
- Lifestyle
అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే
- Movies
Pawan Kalyan: కొండగట్టులో 'వారాహి'కి ప్రత్యేక పూజలు.. అంజన్న సేవలో అంజనీ పుత్రుడు అంటూ!
- News
కొత్త సచివాలయాన్ని 17న ప్రారంభించనున్న కేసీఆర్: ఇద్దరు సీఎంలు, అంబేద్కర్ మనవడు
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
ట్రూకాలర్‌లో ఈ ఫీచర్లు ఎప్పుడైనా గమనించారా...?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్... ఇప్పుడు కొత్త హంగులు అద్దుకొని వచ్చింది. బ్యాంకింగ్ సేవలు, మొబైల్ రీఛార్జ్, వీడియో కాల్స్... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో ట్రూకాలర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా ఏం ఫీచర్లు లభిస్తున్నాయో ఓ సారి చెక్ చేసి చూడండి. ఈ కింది ఫీచర్లు ఉన్నాయో లేవో ఓసారి చూసేయండి.

ట్రూకాలర్ పే
ట్రూకాలర్ ఆప్ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, అందుకోవచ్చు. ట్రూకాలర్ పే పేరుతో ఓ సర్వీసును ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఆప్‌లోని ఈ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఓ యూపీఐ ఐడీ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ, భీమ్ ఆప్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబరుకు డబ్బులు పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ ఆప్ ద్వారా మొబైల్ రీఛార్జిలూ చేసుకోవచ్చు.

వీడియో కాల్స్
ట్రూకాలర్‌తో ఇకపై వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ వీడియో కాలింగ్ ఆప్ డ్యుయోతో కలసి ట్రూకాలర్ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. త్వరలో ఈ ఆప్ నుంచి నేరుగా వీడియో కాల్స్ సౌకర్యం పొందొచ్చు.

ట్రూకాలర్ ఎస్‌ఎంఎస్
మీ మొబైల్‌లోని మెసేజ్ ఇన్‌బాక్స్‌ను పూర్తిగా యాక్సెస్ చేయగలిగేలా ట్రూకాలర్ ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల మెసేజ్‌లు పంపించే విధానం, స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు గుర్తించే విధానం మరింత సులభతరమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మెసేజ్‌లు (ప్రీ డిఫైన్డ్ మెసేజ్‌లు) పంపించుకునే సౌలభ్యమూ అందుబాటులోకి వచ్చింది.

ఎయిర్‌టెల్ ట్రూకాలర్ ఐడీ
ఎవరు కాల్ చేస్తున్నారో ట్రూకాలర్ ద్వారా తెలుసుకోవాలంటే కచ్చితంగా నెట్ ఉండాల్సిందే. అంతర్జాలం లేనివాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా ఎయిర్‌టెల్‌తో కలసి ట్రూకాలర్ కొత్తగా ‘ఎయిర్‌టెల్ ట్రూకాలర్ ఐడీ' ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మీకు ఎయిర్‌టెల్ నెంబరు నుంచి కాల్ వస్తే అప్పుడు నెట్ వినియోగించకపోయినా ఆ వ్యక్తి వివరాలు ట్రూకాలర్ ఆప్‌లో కనిపిస్తాయి. త్వరలో వచ్చే అవకాశం ఉంది.

చెక్ లాస్ట్ సీన్
కాంటాక్ట్ పక్కన ఉండే సమాచారం ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అక్కడే ఉండే కాంటాక్ట్స్ పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం అంతా అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి ఆన్ లైన్లో ఉన్నాడా.. లాస్ట్ సీన్ స్టేటస్ లను కూడా చెక్ చేయవచ్చు.

మీ అనంబర్ అన్ లిస్ట్
మీ నంబర్ ట్రూ కాలర్లో కనిపించడం ఇష్టం లేదా...అయితే మీరు https://www.truecaller.com/unilistingను విజిట్ చేసి మీ ఫోన్ నంబర్ ను కంట్రీ కోడ్ తో సహా టైపు చేసి అన్ లిస్ట్షోన్ నంబరును సెలక్ట్ చేసుకుంటే చాలు. అయితే ఇకపై మీ ఫోన్లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసి ఉండకూడదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470