సంచలనం రేపుతున్న వాట్సప్ కొత్త ఫీచర్లు

Written By:

మేసేజింగ్ యాప్ లలో అందనంత దూరంలో దూసుకుపోతున్న వాట్సప్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. 100 కోట్లకు పైగా యూజర్లతో దుమ్మురేపుతున్న వాట్సప్ అతి త్వరలో మరో 6 హాట్‌ ఫీచర్లను తర్వలోనే లాంచ్‌ చేయబోతుంది. ప్రస్తుతం వీటిని బీటీ మోడ్‌లో పరిమిత సంఖ్యలోని యూజర్లపై టెస్ట్‌ చేస్తోంది. వచ్చే కొన్ని రోజుల్లోనే ఈ 6 హాట్‌ ఫీచర్లు వాట్సాప్‌ యూజర్లందరి ముందుకు రాబోతున్నాయని టెక్‌ వర్గాలంటున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ 6 ఫీచర్లేమిటో ఓసారి చూద్దాం.

వైఫై ఇప్పుడు ఎంత డేంజరంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్‌ వీడియో ప్లే

ఐఓఎస్‌ బీటా వెర్షన్‌ వాట్సప్‌ కోసం తీసుకొస్తున్న అత్యంత ముఖ్యమైన ఫీచర్‌, యూట్యూబ్‌ ఇంటిగ్రేషన్‌. ఈ ఫీచర్‌తో ఫిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ ద్వారానే యాప్‌లో నుంచి బయటికి వచ్చేయకుండా యూట్యూబ్‌ వీడియోలను తిలకించవచ్చు.

యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు

ప్రస్తుతం యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు యాప్‌ల ద్వారా ఎక్కువగా జరుగుతుండటంతో, తన ప్లాట్‌ఫామ్‌పై కూడా ఈ ఫీచర్‌ తీసుకురావాలని వాట్సప్‌ సన్నద్దమవుతోంది. ఈ ఫీచర్‌తో ఎలాంటి అవాంతరాలు లేకుండా నగదును ట్రాన్సఫర్‌ చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ, యూపీఐ ఇంటిగ్రేషన్‌ కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

మెసేజ్‌ రీకాల్‌ ఫీచర్‌

పొరపాటున పంపిన మెసేజ్‌లను, వీడియోలను, ఇమేజ్?లను వెనక్కి తీసుకోవడానికి ఐదు నిమిషాల విండో ఉంటుంది. ప్రస్తుతం ఎవరికైనా మెసేజ్‌ను కానీ, ఇమేజ్‌లను కాని పొరపాటున పంపినట్టైతే, వాటిని రీకాల్ చేసుకోవడం కుదరదు. కానీ తాజాగా తీసుకురాబోతున్న ఫీచర్‌తో వాటిని రీకాల్ చేసుకోవచ్చు.

లైవ్‌-లొకేషన్‌ షేరింగ్‌

ఈ ఏడాది ప్రారంభంలో ఐఓఎస్‌ బీటా వెర్షన్లలోకి వచ్చిన మరో ఫీచర్‌ లైవ్‌-లొకేషన్‌ షేరింగ్‌. కానీ దీన్ని ఇప్పుడే అందరికీ ప్రారంభించకపోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు నిమిషం, రెండు నిమిషాలు, ఐదు నిమిషాలు లేదా నిరవధికంగా లైవ్‌-లొకేషన్‌ను షేర్‌ చేయవచ్చు.

నెంబర్ మారితే, కాంటాక్ట్‌లో ఉన్న అన్ని నంబర్లకు తెలిసిపోతుంది

వాట్సప్‌ యూజర్లు తమ నెంబర్‌ను మార్చినట్టైతే, తమ వాట్సప్‌లో ఉన్న అందరి కస్టమర్లకు తెలిసేలా, ఈ ఫీచర్‌ ద్వారా నోటిఫికేషన్స్‌ వెళ్తాయి. ఈ ఫీచర్‌ కూడా ప్రస్తుతం బీటా వెర్షన్‌, విండోస్‌ ఫోన్లలో ఉంది.

ఎడిట్‌ సెంట్‌ ఫీచర్‌

యూజర్లు తాము పంపిన మెసేజ్ లలలో ఎలాంటి తప్పులు దొర్లినా.. టెక్ట్స్ ను మార్చాలనుకున్నప్పుడు ఈ ఫీచర్‌తో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే తాజా మెసేజ్ లను మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని మాత్రమే వాట్సప్ కల్పిస్తోంది. పాత వాటిని మార్చుకోవడానికి వీలులేదు. ఇది కూడా త్వరలో వాట్సప్‌ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 new features coming to WhatsApp soon Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot