Home
Apps

వాట్సప్‌లో లేటెస్ట్‌గా వచ్చిన 6 ఫీచర్లు ఇవే

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం ఈ మధ్య ఆరు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫేక్ న్యూస్ కట్టడి చేసేందుకు అలాగే ఫార్వర్డ్ ఆప్సన్ లో కొన్ని మార్పులు లాంటి ఫీచర్లతో అత్యంత పకడ్బందీ జాగ్రత్తలను తీసుకుంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చిన ఆరు ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

WhatsApp Forwarded Label

WhatsApp Forwarded Label

భారత్‌లో వాట్సప్ ద్వారా ఫార్వర్డ్ చేసే మెసేజీల సంఖ్యపై పరిమితి విధిస్తామని వాట్సప్ ప్రకటించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి కావడాన్ని నిరోధించేందుకు ఈ చర్య చేపడుతోంది.

Mute, Mark as Read options

Mute, Mark as Read options

నోటీపికేషన్ బార్ లో రెండు షార్ట్ కట్స్ రాబోతున్నాయి. ఒకటి మెసేజ్ ఓపెన్ చేసి చదివేందుకు మరొకటి దాన్ని మ్యూట్ లో పెట్టుకునేందుకు అవకాశం కల్పించబోతోంది. వీటిని 50 మెసేజ్ ల పైన వస్తే ఉపయోగించవచ్చు.

WhatsApp Stickers

WhatsApp Stickers

WhatsApp Android beta version 2.18.218లో ఈ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరికీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని WABetaInfo రిపోర్ట్ చేసింది.

WhatsApp ‘Suspicious Links Detection

WhatsApp ‘Suspicious Links Detection

WABetaInfo రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ ఫేక్ న్యూస్ అన్ లైజ్ చేసి వాటిని అరికడుతుందని తెలిపింది. దీని ద్వారా మీకు వచ్చిన లింక్ ఫేక్ అని తెలిస్తే అది రెడ్ సిగ్నల్ రూపంలో ఎర్రర్ చూపిస్తుంది.

WhatsApp ‘Send Message’ for Group admins

WhatsApp ‘Send Message’ for Group admins

ఈ ఫీచర్ ద్వారా ఎవరు పడితే వాళ్లు గ్రూపుల్లో పోస్టులు చేయలేరు. అడ్మిన్ అప్రూవ్ చేస్తేనే ఆ పోస్ట్  వాట్సప్ లో పబ్లిష్ అవుతుంది. 

WhatsApp Media visibility

WhatsApp Media visibility

ఈ వర్సన్ Android version 2.18.194లో అందుబాటులో ఉంది. దీని ద్వారా యూజర్లు గ్యాలరీలో ఫోటోలు కనపడకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించే మూడు ఆప్సన్లు Default,' ‘Yes' and ‘Noను సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫీచర్ పొందవచ్చు. 

Best Mobiles in India

English summary
WhatsApp has announced many new features this year, and here are 6 you should know about more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X