WhatsApp లో ఎవరైనా వేధిస్తున్నారా?? అయితే ఈ టిప్స్ పాటించండి....

|

శీఘ్రముగా ఏదైనా మెసేజ్ లను చేయడానికి ప్రపంచం మొత్తం మీద ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఒకటి. దీని ద్వారా మెసేజ్ లను పంపడంతో పాటుగా వీడియో కాల్స్ లేదా వాయిస్ కాల్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకొని చాలా మంది దుర్మార్గులు వేధించడానికి వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు.

వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్ టిప్స్

వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్ టిప్స్

వాట్సాప్ ద్వారా అపరిచితుల నుండి యాదృచ్ఛిక వీడియో కాల్స్ లేదా వాయిస్ కాల్స్ పొందే అవకాశం చాలా వరకు ఉంది. అంతేకాకుండా గోప్యతా సెట్టింగులను జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక ఏదైనా యాదృచ్ఛిక వాట్సాప్ గ్రూపులకు కూడా మిమ్మలిని చేర్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను సవరించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వక్రబుద్ధిని నివారించడానికి మరియు ఇతర వేధింపులను నివారించడానికి వాట్సాప్‌లో మార్చవలసిన ఆరు సెట్టింగ్‌ల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: IPL 2020 లైవ్ మ్యాచ్‌ల కోసం టెల్కోల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!Also Read: IPL 2020 లైవ్ మ్యాచ్‌ల కోసం టెల్కోల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!

వాట్సాప్‌లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్‌లు

వాట్సాప్‌లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్‌లు

వాట్సాప్‌లో మీకు తెలియని ఏదైనా నెంబర్ అపరిచితుల నుండి ఎటువంటి వాయిస్ కాల్‌లు లేదా వీడియో కాల్‌లను స్వీకరించకపోవడం చాలా మంచిది. వాటిని డిస్‌కనెక్ట్ చేసి మీ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసా లేదా అని తనిఖీ చేయండి.

వాట్సాప్‌లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్‌ను తీసుకునే విధానం

వాట్సాప్‌లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్‌ను తీసుకునే విధానం

వాట్సాప్‌లో వచ్చే అన్ని రకాల ఫోన్ కాల్‌లకు మీరు సమాధానం ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉంటే కనుక అపరిచితుల నుండి వచ్చే వాట్సాప్ వీడియో కాల్‌ను స్వీకరించేటప్పుడు సెల్ఫీ కెమెరాను ఎల్లప్పుడూ మీ యొక్క చేతి వేలితో బ్లాక్ చేయడం మంచిది. కాలర్ యొక్క గుర్తింపు గురించి మీకు ఖచ్చితంగా తెలిసిన తర్వాత మాత్రమే మీ ముఖాన్ని చూపించడం ఉత్తమమైన లక్షణం.

‘+91’ తో ప్రారంభం కాని నెంబర్ నుండి కాల్‌లను స్వీకరించడం మానుకోండి

‘+91’ తో ప్రారంభం కాని నెంబర్ నుండి కాల్‌లను స్వీకరించడం మానుకోండి

స్కామర్లు సాధారణంగా వారి నెంబర్లను కనపడకుండా చేస్తూ ఉంటారు. ఇండియా యొక్క (+91) కోడ్ కాకుండా మరొక దేశం యొక్క కోడ్ ఉన్న సంఖ్యను ఉపయోగించి మీరు కాలర్‌ను కనుగొంటే కనుక వెంటనే డిస్‌కనెక్ట్ చేయండి. మీకు విదేశాలలో నివసించే బంధువులు లేదా స్నేహితులు లేకుంటే కనుక ఇండియా యొక్క బయటివారు ఎవరైనా మీకు ఫోన్ చేసే అవకాశమే లేదు.

ప్రొఫైల్ ఫోటో లేదా స్టేటస్ లను చూడటానికి పరిమితులు

ప్రొఫైల్ ఫోటో లేదా స్టేటస్ లను చూడటానికి పరిమితులు

వాట్సాప్‌లో మీ యొక్క ప్రొఫైల్ ఫోటోను మరియు మీరు పంపే స్టేటస్ లను ఎవరు చూడవచ్చో అనే దానిని సెట్ చేసుకోవచ్చు. దీని కోసం వాట్సాప్‌లోని సెట్టింగులలో ప్రైవసీ అకౌంట్ లో సెట్ చెయవచ్చు. మీ యొక్క ప్రొఫైల్ ను మీ ఫోన్ లో గల కాంటాక్ట్ నెంబర్లు మాత్రమే చూడడానికి లేదా అందరు లేదా ఎవరికి చూడడానికి అనుమతి లేదు అని మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో దేనినో ఒకదానిని ఎంచుకోవచ్చు.

ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేయడం

ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేయడం

ప్రస్తుతం ప్రతిఒక్కరు వాట్సాప్ వాడుతున్నారు. కాబట్టి మీరు వాట్సాప్‌లో ఎప్పుడూ చాట్ చేయని వ్యక్తుల నుంచి మీ యొక్క వివరాలను దాచడం లేదా నిరోధించడం చాలా మంచిది. అవసరమైన సేవల కోసం మీకు అవసరమైన కొంత మంది వ్యక్తులు పాలవాడు, ఆటో డ్రైవర్ వంటి అవసమైన వ్యక్తుల నెంబర్ లను సేవ్ చేసుకోవలసి ఉంటుంది కాని వారిని వాట్సాప్‌లో చేర్చాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
6 Things you Have to Avoid Harassment in WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X