వాట్సప్ నుంచి మీ డేటాను కాపాడుకోండి, సింపుల్ ట్రిక్స్ !

Written By:

మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది వాట్సప్ వైపే.అయితే ఈ వాట్సప్ వల్ల ఉపయోగం సంగతి అటుంచితే డేటా మొత్తాన్ని తినేస్తూ ఉంటుంది. చాట్‌ చేసేటప్పడు ఆడియో, వీడియో, ఫోటో ఫైల్స్‌ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అవుతూ డేటా మొత్తాన్ని లాగేస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం ఓ లుక్కేయండి.

రూ. 1249కే 4జీ స్మార్ట్‌ఫోన్, కండీషన్లు చూస్తే బేజారే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫైళ్లు డౌన్‌లోడ్

మీ మొబైల్‌లో ఫైళ్లు ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్‌ కాకుండా ఉండాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి, డాటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌, మీడియా ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్లపైన క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే వాటిని మనకనుగుణంగా సెలక్ట్ చేసుకుంటే ఫైళ్లు డౌన్‌లోడ్‌ అవ్వవు. ఐఫోన్‌ యూజర్లు వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డాటా అండ్‌ స్టోరేజ్‌ యూజర్స్‌లో ‘నెవర్‌' ఆప్సన్‌ను ఓకే చేస్తే సరిపోతుంది.

పెద్ద ఫైళ్లు డౌన్‌లోడ్

దీని కోసం మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, డాటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు when connected on Wi-Fi కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అన్నీ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వాయిస్‌ కాల్స్‌కు లోడాటా యూసేజ్‌

వాయిస్‌ కాల్స్‌ మాట్లాడేటప్పుడు డాటా వినియోగాన్ని తగ్గించే ఆప్షన్‌ కోసం వాట్సప్‌ సెట్టింగ్స్‌లో కెళ్లి అక్కడ డాటా అండ్‌ స్టోరేజి యూసేజ్‌లో డాటా యూసేజ్‌లోకి వెళ్లి ఫోన్‌ స్టోరేజీ, మొబైల్‌ డాటాను సేవ్‌ చేసే ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి.

చాట్‌ బ్యాకప్‌

వాట్సప్‌లోని టెక్ట్స్‌ చాట్స్‌, ఇమేజిలు ఫోన్‌ డాటా ద్వారా బ్యాకప్‌ తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి దీన్ని వైఫైతో కనెక్టయినప్పుడు మాత్రమే చాట్‌ బ్యాకప్‌ తీసుకోవాలి. అప్పుడే డేటా సేవ్ అవుతుంది.

కాంటాక్ట్స్‌ స్పేస్‌:

మీ వాట్సప్‌ కాంటాక్ట్స్‌లో ఒక్కోటి ఎంత స్పేస్‌ ఆక్రమించాయో తెలుసుకోవాలంటే స్టోరేజీ అండ్‌ డాటా యూసేజ్‌ ఆప్సన్ లో కెళ్లి స్టోరేజీ యూసేజ్‌ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు అన్ని వివరాలు కనిపిస్తాయి.

చాట్స్‌ స్పేస్‌

ఇది మరో ఆప్సన్ చాట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి ‘మేనేజ్‌ మెసేజెస్‌' ‘క్లియర్‌ మెసేజెస్‌' లోకి వెళ్లి మీరు చేసిన చాట్స్‌ ఫోన్‌లో ఎంత డాటాను వినియోగించుకున్నది తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Ways to Save Mobile Data When Using WhatsApp Read more News at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot