ఇండియన్ ఆర్మీ అప్రమత్తం, వాట్సాప్‌లో ఏం జరుగుతోంది?

Posted By: BOMMU SIVANJANEYULU

చైనా హ్యాకర్లు హట్సాప్ ద్వారా సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ద ఎడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్‌కు చెందిన @adgpi అనే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తులు తమ వ్యక్తిగత వాట్సాప్ గ్రూప్ లలో చాట్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ ఆర్మీ పలు సూచనలు చేసింది. అవేంటో ఈ క్రింది స్లైడర్ లో చూద్దాం..

రూ.10కే జియో డీటీహెచ్, జీవితాంతం ఆ ఛానల్స్ ఉచితం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

+86తో మొదలయ్యే నెంబర్లతో జాగ్రత్త...

+86తో మొదలయ్యే చైనీస్ నెంబర్లు ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ లోకి చేరి డేటాను దొంగిలిస్తున్నాయి. కాబట్టి ఈ నెంబర్ల పై ఓ కన్నేసి ఉంచండంటూ ఇండియన్ ఆర్మీ, సైన్యాన్ని హెచ్చరించింది.

మా దృష్టికి తీసుకురండి...

మీమీ గ్రూపులను తరచూ చెక్ చేస్తుండటంతో పాటు ఆడిట్లు నిర్వహిస్తుండండి. గుర్తుతెలియని నెంబర్ ఏదైనా యాడ్ అయినట్లయితే వెంటనే దానిని తొలగించండి లేదా మా దృష్టికి తీసుకురండి.

కాంటాక్ట్స్ అన్ని పేర్లతో సేవ్ అయి ఉండాలి...

కాంటాక్ట్స్ అన్ని పేర్లతో సేవ్ అయి ఉండాలి...
గ్రూప్స్‌లోని అన్ని కాంటాక్ట్స్ పేర్లతో సేవ్ అయి ఉండేలా చూసుకోండి. మీ గ్రూప్స్‌లో యాడ్ అయ్యే కొత్త నెంబర్లను రెగ్యులర్‌గా పరిశీలిస్తుండండి.
నెంబర్ ఛేంజ్ చేస్తే అడ్మిన్‌కు తెలపండి..
ఒక వేళ మీరు మొబైల్ నెంబర్ ఛేంజ్ చేసినట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని గ్రూప్ అడ్మిన్‌కు తెలియజేయండి.

 

 

సిమ్ కార్డును ధ్వంసం ..

మొబైల్ నెంబర్‌ను మార్చినపుడు సిమ్ కార్డును ధ్వంసం చేయటంతో పాటుగా వాట్సాప్ నెంబర్‌ను డిలీట్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 WhatsApp security tips issued by Indian Army More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot