Just In
Don't Miss
- News
బండిసంజయ్ కుమారుడు భగీరథ్‌పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్; సోషల్ మీడియాలో ఆ వీడియోల రచ్చ!!
- Movies
RGV Hyper Aadi: ఫస్ట్ నైట్ ఓ ఉద్యమం.. రాంగోపాల్ వర్మ, ఆషురెడ్డిపై హైపర్ ఆది పంచులు
- Sports
INDvsNZ : తొలి వన్డేలో కూడా భారీ స్కోర్లు.. టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేస్తే బెటర్?
- Finance
OECD Secretary: 'ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా భారత్ సొంతం'
- Automobiles
మారుతి 5 డోర్ జిమ్నీ బుకింగ్స్ పెరిగాయి.. బుకింగ్ ప్రైస్ కూడా పెరిగింది: ఇక్కడ చూడండి
- Lifestyle
Today Rasi Palan 18 January 2023:ఓ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే,భాగస్వామితో విభేదాలు తీవ్రంగా ఉంటాయి
- Travel
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొని కాశీ అందాలను ఆస్వాదించండి!
వాతావరణ వివరాలకై 7 అద్భుతమైన అప్లికేషన్లు మీకోసం
రాబోవు రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాల ఆయా ప్రదేశాల వాతావరణ వివరాలు తెలుసుకోవడం వలన సమస్యలు లేకుండా ట్రిప్ ఎంజాయ్ చెయ్యవచ్చు. ఇప్పుడు మీడియా ద్వారానే కాకుండా మొబైల్ నుండి కూడా వాతావరణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ అప్లికేషన్లు రాబోవు రోజుల్లో వాతావరణ పరిస్త్తితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడమే కాకుండా రియల్ టైం సమాచారాన్ని సైతం ఇస్తూ వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్నాయి.ఆండ్రాయిడ్, IOS మొబైల్స్ లో ఇన్బిల్ట్ గా అప్లికేషన్లు ఉన్నా కూడా, ప్లేస్టోర్ లో దొరికే కొన్ని అప్లికేషన్లతో పోల్చినప్పుడు చాలా ఫీచర్ల లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకోసం కొన్ని అప్లికేషన్స్ పొందుపరచబడ్డాయి.

Dark Sky (Android/iOS, Free/$3.99)
ఇది ఆండ్రాయిడ్ మరియు IOS రెండింటిలో లభిస్తుంది. మీరు ఉన్న చోటుని గుర్తించి సరైన నివేదికను ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుండే అప్లికేషన్ డార్క్ స్కై. ప్రతినిమిషము వాతావరణ వివరాలను అందివ్వడంలో ఈ అప్లికేషన్ చాలాబాగా పనిచేస్తుంది. ఇది తదుపరి నిమిషాలకు, గంటలకు మాత్రమే కాకుండా రాబోవు పదిరోజుల వాతావరణ వివరాలను చూపెడుతుంది. తద్వారా మీ ప్రయాణానికి ఏ అసౌకర్యం లేకుండా ప్లాన్ చేసుకొనవచ్చు. దీని ఇంటర్ఫేస్ అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది. నోటిఫికేషన్ బార్ ద్వారా రాబోవు వర్ష సూచనలను, తుఫాను హెచ్చరికలను సైతం చూపెడుతుంది. ఈ అప్లికేషన్ లో చెప్పుకోదగ్గ మరొక విషయం విడ్జెట్లు. విడ్జెట్స్ అందంగా డిజైన్ చెయ్యబడి ఉంటాయి . ఈ విడ్జెట్స్ హోం స్క్రీన్ పై ఉంచడం ద్వారా , అప్లికేషన్ ఓపెన్ చేయకుండానే ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకునే వీలు ఉంది. అంతిమంగా ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ అనే చెప్పాలి .

carrot weather(iOS, $4.99)
ఇది కేవలం iOS డివైజుల వరకే పరిమితం. ఇది డార్క్ sky యొక్క డేటాబేస్ ని ఉపయోగించుకుని, వాతావరణ వివరాలు అందిస్తుంది. కాని డార్క్ స్కై అప్లికేషన్ తో పోలిస్తే, దీని యూజర్ ఇంటరాక్షన్ వేరుగా ఉంటుంది. ఈ అప్లికేషన్ సూర్యోదయం సూర్యాస్తమయాలను చూపించడమే కాకుండా, మంచుకాలంలో హిమఘాతాల ప్రభావ సూచనలను సైతం తెలియజేస్తుంది. ఇందులో గత 70 సంవత్సరాల నుండి పైన 10 ఏళ్ళ వరకు వాతావరణ వివరాలు ఎలా ఉండబోనున్నాయో తెలుసుకునే వీలు ఉంది. మీకు ఒక అద్బుతమైన అనుభూతిని, గేమింగ్ feel ని పొందాలి అని భావిస్తే carrot weather అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి.

weather bug (iOS,ఆండ్రాయిడ్ /free )
ఈ weather bug అప్లికేషన్ చూడడానికి స్టాక్ inbuilt అప్లికేషన్ లాగే ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఉత్తర అమెరికా Doppler Radar లేక PulseRad Radarను వీక్షించవచ్చు కూడా. ఇది మీరు ఉన్న ప్రదేశానికి అనువుగా చూడవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా తుఫాను, పిడుగుల హెచ్చరికలతో పాటు ప్రతి గంటకు వాతావరణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ అప్లికేషన్ మీకు లైఫ్ స్టైల్ వాతావరణ వివరాల ప్రకారం అలర్జీస్ సంబంధించిన వివరాలతో పాటు రియల్ టైం ట్రాఫిక్ కండిషన్స్ ను తెలపడం ద్వారా మీ మార్గాన్ని సుగమం చేస్తుంది.

my radar pro weather radar (Android/iOS, Free/$2.99)
వాతావరణ వివరాల ఖచితత్వం కోసం ఈ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. NOAA వాతావరణ రేడార్ నుండి డేటా తీసుకుని వివరాలు అందిస్తుంది. ఈ maps ద్వారా ఇతర ప్రదేశాలలోని వాతావరణ వివరాలు ఖచ్చితత్వంతో చూడవచ్చు. తద్వారా రాబోవు సమయాల్లో వాతావరణ వివరాల పై అవగాహన వచ్చేలా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్, iOS రెండింటిలో లభ్యమవుతుంది.

weather underground (Android/iOS, Free)
ప్రస్తుతం ఎడిటర్స్ చాయిస్ గా ఉన్న అప్లికేషన్ ఇది. National weather serviceRadioని అందించే అప్లికేషన్స్ లో చెప్పుకోదగినది. వాతావరణ వివరాలు అన్నిటిని ఒకే అప్లికేషన్ లో పొందాలి అనుకునేవారికి ఇది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంచుకున్న ప్రదేశాల వాతావరణ వివరాలు, weatherMaps, రియల్ టైం సమాచారంతో పాటు పదిరోజుల వాతావరణ పరిస్థితులను చూపెడుతుంది. ఈ అప్లికేషన్ ఉచితంగా ఆండ్రాయిడ్, iOS లలో లభ్యమవుతుంది

RadarScope (Android/iOS, $9.99)
వాతావరణ వివరాలకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అప్లికేషన్ ఇది. నోటిఫికేషన్ బార్ ద్వారా తుఫాను, వరదలు, పిడుగుల, సముద్ర ప్రభావాల అలర్ట్స్ ను చూపుతుంది. మరియు NEXRAD లేక tdwr రాడార్ డేటాను వీక్షించడానికి అనుమతిని కూడా ఇస్తుంది. తద్వారా ఖచ్చితమైన వివరాలను అందించగలుగుతుంది. ఇది ఆండ్రాయిడ్, iOS రెండింటిలో లభ్యమవుతుంది.

Blue (iOS,Free)
ఇది iOS వినియోగదారులకు ఉచితంగా లభించే అప్లికేషన్. ఇది చాలా తక్కువ పరిమాణం లో ఉండి, మెమొరీ తక్కువ తీసుకుంటుంది. ఈ అప్లికేషన్ తక్కువ ఫీచర్లను కలిగి ఉన్నా, వివరాలను సమయానుసారం అందించగలదు. రానున్న 7రోజుల వాతావరణ వివరాలు తెలియజేస్తుంది. తుఫాను, హిమఘాతాల అలర్ట్స్ కూడా నోటిఫికేషన్ బార్ ద్వారా తెలియజేస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470