Just In
- 4 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 6 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 9 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 12 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Sports
IND vs NZ: సతీమణి సాక్షి సింగ్‌తో ధోనీ సందడి! వీడియో
- News
ఏపీ రాజకీయాలపై కీలక ప్రకటన విడుదల చేసిన `ఐప్యాక్`..!!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Movies
Jamuna Death: జమునకు మూడేళ్లు శిక్ష.. బాయ్ కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్? ఇవే కారణాలు!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ట్రూ కాలర్‌లో దాగిన ఆసక్తికర ఫీచర్లు ఇవే, ఓసారి చెక్ చేసుకోండి !
రోజూ మనకు ఏవేవో కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. అవి ఎవరివో ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియకుండా తికమక పెట్టేస్తుంటాయి. ఒక్కోసారి విసిగిస్తుంటాయి. బిజీగా ఉన్న టైంలో తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే చిరాకు పుడుతుంటుంది. అయితే వీటి నుంచి రక్షణ పొందలేమా అంటే ట్రూకాలర్ ద్వారా రక్షణ పొందవచ్చు. ట్రూకాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని ఇట్టే కనిపెట్టేయవచ్చు. అందులో ఇంకా ఎన్నో రకాలైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా మీరు మిస్టరీ కాల్స్ ని ఈజీగా పట్టేసి వాటిని బ్లాక్ చేయవచ్చు. మరి ట్రూ కాలర్ లో దాగిన ఫీచర్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దామా ?

Block calls
మీరు మీ ట్రూ కాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ని అలాగే ఆ నంబర్లని బ్లాక్ చేయవచ్చు. కొన్ని తెలియని నంబర్లు కొన్ని 8051 నుంచి స్టార్ట్ అవుతాయి. వాటిని పసిగట్టి బ్లాక్ చేయవచ్చు. కాల్ కట్ కాగానే మీకు బ్లాక్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వెంటనే ఆ నంబర్ బ్లాక్ అవుతుంది.

ఇంటర్నెట్ లేకుండా కాల్ చూడటం
మీరు ఇంటర్నట్ ఆన్ చేయకుండానే మీకు కాల్ ఎవరు చేస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆ నంబర్ ని ట్రూకాలర్ గుర్తించగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఆ నంబర్ స్పామ్ అని చెబుతుంది. దాన్ని బట్టి మీరు ఆ కాల్ కట్ చేసుకోవచ్చు.

స్పామ్
మీరు మీ మొబైల్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు స్పామ్ ప్రొటెక్షన్ ఆటోమేటిగ్గా లభిస్తుంది. దాని ద్వారా మీరు స్పామ్ కాల్స్ వచ్చిన వెంటనే వాటిని రిజెక్ట్ చేయవచ్చు. లేకుంటే బ్లాక్ లిస్టులో పెట్టవచ్చు.

Truedialer as default dialer
బ్లాక్ చేయడం మాత్రమే కాదు. డిఫాల్ట్ డయలర్ కూడా ట్రూకాలర్ ఆఫర్ చేస్తోంది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా యూజర్స్ ని వెతికేందుకు ఈ యాప్ సహయపడుతుంది. లోకేషన్, మీ పాత కాంటాక్ట్స్ లిస్ట్ మీద కూడా పనిచేస్తుంది. ఎవరికైనా కామన్ స్నేహితులు ఉన్నా కూడా ట్రూ కాలర్ పసిగడుతుంది.

Identify numbers with Search bar
మీకు ఎవరైనా కొత్త నంబర్ నుంచి మిస్ డ్ కాల్ చేస్తే దాన్ని వెంటనే ట్రూ కాలర్ సెర్చ్ ద్వారా కనుక్కోవచ్చు. ట్రూకాలర్ సెర్చ్ లో ఆ నంబర్ ని టైప్ చేయడం ద్వారా ఆ అపరిచిత వ్యక్తుల వివరాలు మీకు కనిపిస్తాయి. అయితే అతను ట్రూకాలర్ లో ఉంటేనే వివరాలు కనిపించే అవకాశం ఉంది.

Set up your own profile
మీ పర్సనల్ ప్రొఫైల్ ఇందులో సెట్ చేసుకోవచ్చు. మీరు వివరాలను అందులో ఏం ఉంచాలనుకున్నారో అవి అవతలి వారికి మీరు కాల్ చేసినప్పుడు కనిపిస్తాయి. మీ పేరు అలాగే ఇతర వివరాలు అందులో ఎంటర్ చేస్తే ఆ వివరాలు మీరు ఎదుటివారికి కాల్ చేసినప్పుడు కనిపిస్తాయి.

Remove your number from its database
మీరు మీ నంబర్ ని రిమూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. http://www.truecaller.com/unlist ఈలింక్ లో కెళ్లి మీరు మీ నంబర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ లింక్ లో కెళ్లి అక్కడ మీ నంబర్ అలాగే కంట్రీ కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత నంబర్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారో రాసి కాప్చా కోడ్ ఎంటర్ చేసి అన్ లిస్ట్ బటన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది.

కంప్యూటర్‌లో True Caller ఉపయోగించుకోవటం ఎలా..?
స్టెప్ 1
ముందుగా మీ కంప్యూటర్‌లోకి వెళ్లి True Caller అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2
True Caller ప్రధాన పేజీలో కనిపించే డ్రాప్ డౌన్ మెనూలో India (+91) కోడ్‌ను సెలక్ట్ చేసుకుని మీరు అడ్రస్ ట్రేస్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్‌ను సెర్చ్ బాక్సులో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3
ఇప్పుడు స్ర్కీన్ పై ఓ పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు sign in అవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి జీమెయిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లేదా యాహూ అకౌంట్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వొచ్చు.
స్టెప్ 4
sign in ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు సంబంధించి 90% ఖచ్చితమైన సమాచారం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్లు True Caller యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Truecaller యాప్‌ను, మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ లాంచ్ చేసిన వెంటనే యాప్‌కు సంబంధించిన కాలర్ ఐడీ డీఫాల్ట్‌గా ఎనేబుల్ కాబడుతుంది.

"Got it" ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా..
దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ పాపప్ మెసేజ్ రూపంలో ఫోన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. ఈ పాపప్ మెసేజ్ పై కనిపించే "Got it" ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా యాప్ విజయవంతంగా మీ ఫోన్‌లో లాంచ్ కాబడుతుంది. ఇక, ఏ విధమైన signup ప్రాసెస్ ఉండదు. యాప్ హోమ్ పేజీలో కనిపించే సెర్చ్ ఆప్షన్‌లో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఆ నెంబర్ తాలుకా హిస్టరీని తెలుసుకోచర్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు కూడా ఇదే ప్రొసీజర్‌ను ఫాలో అయి Truecaller యాప్‌ను విజయవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే..
ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470