ప్రతి భారతీయుడికి ఉపయోగపడే 7 ప్రభుత్వ యాప్‌లు !

By Anil
|

కేంద్ర ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ ఇండియా' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో వెనక పడిన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల, mPassport సేవా యాప్ ను ప్రారంభించింది దీని ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గవర్నమెంట్ యాప్స్ ని కేంద్రప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శీర్షిక లో భాగంగా ప్రభుత్వ సేవల కోసం ఉపయోగపడే కొన్ని యాప్స్ లిస్ట్ ను మీకు అందిస్తున్నాం. చెక్ చేసుకోండి

BHIM :
 

BHIM :

Bharat Interface for Money (BHIM) డిజిటల్ లావాదేవీలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు UPI చెల్లింపు అడ్రస్, ఫోన్ నంబర్లు లేదా QR కోడ్ ను ఉపయోగించి డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

Swachh Bharat Abhiyaan :

Swachh Bharat Abhiyaan :

మీ నగరం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా, వారి సమస్యలకు సంబంధించిన చిత్రాలను క్లిక్ చేసి ఇందులో పోస్ట్ చేయవచ్చు లేదా మునిసిపల్ అధికారులకు పంపవచ్చు . అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఈ యాప్ ను లింక్ చేయబడింది.

GST Rate Finder :

GST Rate Finder :

GST గురించి తెలియని వారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది .పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్‌ యాప్‌ ఉపయోగపడుతుంది.

UMANG :
 

UMANG :

UMANG (Unified Mobile Application for New-age Governance) ఈ యాప్ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది . ఆధార్‌, డిజిలాకర్‌, పే గవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.

mPassport Seva :

mPassport Seva :

ఈ యాప్ ద్వారా పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ ను ట్రక్క్ చేయవచ్చు అలాగే దగ్గర లో ఉన్న పాస్ పోర్ట్ సేవ కేంద్రాలను తెలుసుకోవడానికి యాప్ చాలా ఉపయోగపడుతుంది.

Online RTI :

Online RTI :

ఒక సమాచార హక్కును ఫైల్ చేయడానికి చూస్తున్న వ్యక్తులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి, ఉపయోగించగలరు. ఇక్కడ, ఆర్టీఐ విభాగానికి మీ కోసం ఒక దరఖాస్తును రూపొందిస్తారు మరియు దానిని పంపే నిపుణులైన న్యాయవాదుల మరియు నిపుణుల సహాయంతో RTI ను ఫైల్ చేయవచ్చు.అలాగే దరఖాస్తు సమర్పించే ముందు డ్రాఫ్ట్ లో మార్పులను చేయవచ్చు.

My Gov :

My Gov :

ఈ యాప్ భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది. కేంద్ర మంత్రివర్గాలు మరియు సంబంధిత ప్రభుత్వ సంస్థలతో ప్రజలను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసి వారి ఆలోచనలు ,సలహాలను మార్గదర్శకత్వం చేయడానికి కృషి చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
7 Useful Apps by Government of India to Download Right Now.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X