Home
Apps

మీకు ఉపయోగపడే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి .

By Anil

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి . అయితే అందులో అందరికి పనికి వచ్చే యాప్స్ ఉన్నాయి అలాగే పనికిరాని యాప్స్ కూడా ఉన్నాయి . ఈ శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఉన్న బెస్ట్ 8 ఫ్రీ యాప్స్ వివరాలను మీకు తెలుపుతున్నాము ఓ సారి చెక్ చేసుకోండి .

1Weather యాప్

1Weather యాప్

అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ 1Weather ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు ఇవ్వడంతో పాటు 12 వారాల వాతావరణ వివరాలను చూపెడుతుంది. 1weather ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Google Drive Suit యాప్

Google Drive Suit యాప్

ఈ యాప్ ద్వారా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయి ఉన్న ఫైల్స్‌ను చాలా సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ ద్వారా మీ గూగుల్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను వేగంగా మీ కంప్యూటర్ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకు ఎటుంటి హార్డ్‌డిస్క్ స్పేస్ ఖర్చు అవ్వదు .

Google Maps యాప్

Google Maps యాప్

గూగుల్ మ్యాప్స్ గురించి తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది.

Google Assistant యాప్

Google Assistant యాప్

గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో అదరగొడుతున్న యాప్ . ముఖ్యంగా ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. మీ అభిరుచుల్ని ఇట్టే పసిగట్టి మీతో కలిసి పనిచేసేందుకు గూగుల్ అసిస్టెంట్ యాప్ ముందుకు వచ్చింది.

Nova Launcher యాప్

Nova Launcher యాప్

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒకరికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది . ఈ యాప్ ద్వారా మీ మొబైల్ యొక్క లుక్ నే మార్చేయవచు . ఈ యాప్ లో చాల బెటర్ ఫీచర్స్ మరియు బెటర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

LastPass Password Manager యాప్

LastPass Password Manager యాప్

మీ పాస్ వర్డ్ మరింత సెక్యూరిటీగా ఉంచుకునేందుకు మరో ఆప్సన్ కూడా ఉంది.అదే LastPass Password Manager యాప్ . ఈ యాప్ ద్వారా మీరు మీ సెక్యూరిటీని మరింతగా పెంచుకోవచ్చు.

Wallpapers HD ,4K Backgrounds యాప్

Wallpapers HD ,4K Backgrounds యాప్

ఈ Wallpapers HD ,4K Backgrounds యాప్ ద్వారా మీ మొబైల్ బ్యాక్ గ్రౌండ్ ను మరింత అందంగా మార్చుకోవచ్చు.

Zedge యాప్

Zedge యాప్

ఈ Zedge యాప్ ద్వారా వాల్ పేపర్స్ ,రింగ్ టోన్స్ ,నోటిఫికేషన్ టోన్స్,అలారమ్ టోన్స్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .

Best Mobiles in India

English summary
8 best Android apps of 2018!.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X