ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే ప్రతి పనీ సులువే!

మన రోజువారీ కార్యకలాపాలను ఓ క్రమపద్ధతిలో ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో ఓ లిస్ట్ అనేది మనకు అవసరమవుతుంది.

|

మన రోజువారీ కార్యకలాపాలను ఓ క్రమపద్ధతిలో ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో ఓ లిస్ట్ అనేది మనకు అవసరమవుతుంది. ఈ లిస్టును ఎప్పటికప్పడు చెక్ చేసుకోవటం ద్వారా షెడ్యూల్ ప్రకారం మన పనులను పూర్తి చేసుకునే వీలుంటుంది. లిస్ట్ ప్రిపరేషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పేపర్ ఇంకా పెన్. పేపర్ పై తయారు చేసుకన్న లిస్టును ప్రతిచోటికి క్యారీ చేయటమనేది కుదరనిపని. ఇటువంటి వారు గూగల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న పలు యాప్స్‌ను ఆశ్రయించటం ద్వారా తమ తమ పనులను మరింత సులువుగా చక్కబెట్టుకునే వీలుంటంది. లిస్ట్ ప్రిపరేషన్‌ను మరింత సులభతరం చేస్తూ అత్యాధునిక ఫీచర్లతో గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు ముఖ్యమైన యాప్‌ల వివరాలను మీకు అందిస్తున్నాం.

 

చావు బతుకుల్లో ఉన్నా సెల్ఫీ పిచ్చి వదల్లేదుచావు బతుకుల్లో ఉన్నా సెల్ఫీ పిచ్చి వదల్లేదు

Google Assistant (గూగుల్ అసిస్టెంట్)

Google Assistant (గూగుల్ అసిస్టెంట్)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగల్ అసిస్టెంట్ యాప్‌ను వినియోగించుకోటం ద్వారా తమ టాస్కులను మరింత ఎఫెక్టివ్‌గా ఆర్గనైజ్ చేసుకోవటంతో పాటు మరింత సునాయాశంగా హ్యాండిల్ చేసే వీలుంటుంది.ఈ యాప్‌లో పొందుపరిచిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను ఉపయోగించుకుంటూ ప్రతిరోజు సరికొత్త టాస్కులను అసైన్ చేసుకోవచ్చు.

టుడూయిస్ట్ (Todoist)

టుడూయిస్ట్ (Todoist)

ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్న ఈ అప్లికేషన్ ఫ్రీ వెర్షన్ ఇంకా ప్రో వెర్షన్‌లలో లభ్యమవుతోంది. ఫ్రీ వెర్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ టాస్కులను ప్రాజెక్ట్స్ రూపంలో మలచుకునే వీలుంటుంది. అంతే కాకుండా సబ్-టాస్కులను కూడా క్రియేట్ చేసుకునే వీలుంటుంది. ఇక ప్రో వెర్షన్ విషయానికి వచ్చేసరికి మీ టాస్కులకు లేబుల్స్‌ను యాడ్ చేసుకోవటం, ఫిల్టర్స్‌ను అప్లై చేయటం, ఆటోమెటిక్ బ్యాకప్స్, రిమైండర్స్, ఐకాన్ సింకింగ్, అటాచబుల్ ఫైల్స్, ప్రొడక్టివిటీ ట్రాకింగ్ టూల్స్ వంటి సర్వీసులు అందుబాటలో ఉంటాయి.

గూగల్ కీప్ (Google Keep)
 

గూగల్ కీప్ (Google Keep)

ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Google Keep యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా స్టికీ నోట్స్ ప్రాసెస్‌ను డిజిటల్‌గా ఆస్వాదించే వీలుంటుంది. ఈ యాప్ ద్వారా లిస్టును ప్రిపేర్ చేసుకోవటంతో పాటు సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుని టైమ్ ప్రకారం రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చు.

ఎవ్రీడే (EveryDay)

ఎవ్రీడే (EveryDay)

ఈ సింపుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా లిస్ట్‌లను ప్రిపేర్ చేసుకోవటంతో పాటు వాటికి సబ్-టాస్క్స్ అలానే రిమైండర్స్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో అసైన్ చేసుకున్న టాస్కులకు నోట్స్‌ను యాడ్ చేసుకుని వాటిలో ఆన్‌లైన్‌లో బ్యాకప్ చేసుకునే వెసలబాటును కూడా ఈ యాప్ కల్పిస్తోంది.

 

 

 ఇన్‌బాక్స్ బై జీమెయిల్ (Inbox by Gmail)

ఇన్‌బాక్స్ బై జీమెయిల్ (Inbox by Gmail)

ఈ యాప్ ప్రతి మెసేజ్‌ను టాస్క్ రూపంలోకి మలచి, ఆ టాస్కును మీకు రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీ వద్ద ఆ మెసేజ్‌ను చూసేంత సమయం లేకపోయినట్లయతే ఆ మెసేజ్‌లను పిన్ చేసుకుని తీరిక సమయంలో చెక్ చేసుకునే వీలుంటుంది.

టిక్‌టిక్ (TickTick)

టిక్‌టిక్ (TickTick)

ఈ ఆండ్రాయడ్ యాప్ ద్వారా లిస్టులను మరింత స్మార్ట్‌గా క్రియేట్ చేసుకునే వీలుంటుంది. సపరేట్ నోట్స్, కామెంట్స్ సెక్షన్స్, క్యాలెండర్ వ్యూ, రిపీట్ రిమైండర్స్, సపోర్ట్ అటాచ్ మెంట్స్ వంటి స్పెషల్ ఫీచర్లను ఉపయోగించుకుని టాస్కులను మీకు నచ్చిన విధంగా అసైన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌కు సంబంధించి ప్రో వెర్షన్‌ను తీసుకోవటం ద్వారా రివిజన్ హిస్టరీతో పాటు సబ్-టాస్క్ రిమైండర్స్ ఇంకా క్యాలెండర్ ఇంటిగ్రేషన్ వంటి సర్వీసులను అదనంగా పొందే వీలుంటుంది.

రిమెంబర్ ద మిల్క్ (Remember the Milk)

రిమెంబర్ ద మిల్క్ (Remember the Milk)

జీ-మెయిల్, గూగుల్ క్యాలెండర్, ట్విట్వర్, ఎవర్‌నోట్ వంటి యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయి రిమెంబర్ ద మిల్క్ పనిచేస్తుంది. మిగిలిన యాప్స్ తరహాలోనే ఇందులో కూడా లేబల్స్‌తో పాటు ఫోల్డర్ ఆధారిత అధికారక్రమాలు అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
A large amount of information can be processed and juggled by consolidating them into lists and using that as a reference to plan your activities accordingly.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X