Home
Apps

ఫ్రెష్ గా రిలీజ్ అయిన సరికొత్త యాప్స్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి .

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి . వీటిలో కొన్ని ఉపయోగరమైనవి ఉంటాయి మరి కొన్ని సమాచారాన్ని మనకు తెలియకుండా దోచేసివి ఉంటాయి. ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని బెస్ట్ యాప్స్ వివరాలను మీకు అందిస్తున్నాము . ఓ లుక్కేయండి

MUSIC PLAYER & AUDIO PLAYER

MUSIC PLAYER & AUDIO PLAYER

ఆఫ్ లైన్ లో నిరంతరం పాటలు వినాలనుకునే వారి కోసం రూపొందించినది ఈ యాప్.ఇంటర్నెట్ స్పీడ్ , బ్యాండ్ విడ్త్ ఇతర అంశాలేమి ఆలోచించకుండా పాట మీద క్లిక్ చేసి ప్లే బటన్ నొక్కితే చాలు ఆఫ్ లైన్ లో పాటలు వినొచ్చు . ఇందులో 15 ఈక్వలైజర్ కంట్రోలర్లు ఉంటాయి. వీటితో పాటు ఇతర మ్యూజిక్ ప్లేయర్ లో ఉండే ప్లే లిస్ట్స్,ఫేవరేట్స్ ,బేస్ కంట్రోలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి .

NAVBAR WEATHER

NAVBAR WEATHER

వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం ఫోన్లోని నేవిగేషన్ బార్ మీదే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రాఫ్ లు,చార్ట్ ల రూపంలో ఫోన్ అడుగు భాగంలో ఇవి కనిపిస్తుంటాయి. వీటితో పాటు మరెన్నో ఫీచర్లు ట్రాన్సపరెంట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉంది ,ఎంత వేగంతో గాలి వీస్తుంది వంటి ఆప్షన్లు ఉన్నాయి. అంతే గాక రానున్న మూడు లేదా ఐదు రోజుల్లో వాతావరణం లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

SIEMPO

SIEMPO

డిజిటల్ అడిక్షన్ ను తగ్గించే యాప్ ఇది . ఇది ఆండ్రాయిడ్ home స్క్రీన్ ను మొత్తం మార్చేస్తుంది. ప్రస్తుతం ఉండే యాప్ ఐకాన్స్ కనిపించకుండా సాధారణ ఫోన్ ల బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. ముందుగా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొనే సమయంలో ఓక గోల్ మెసేజ్ ను టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ నిరంతరం మీకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మీకు అంత్యంత ఉపయోగకరమైన మెసేజ్ ఈ మెయిల్ వంటి యాప్స్ లిస్ట్ లో పై భాగంలో కనిపిస్తాయి . ఎక్కువగా ఉపయోగించే యాప్స్ ను ఫ్లాగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

NOTES BY FIREFOX

NOTES BY FIREFOX

వెబ్ బ్రౌజర్ మొజిల్లా రూపొందించిన యాప్ ఈ NOTES BY FIREFOX. Google Keep యాప్ ఎలా పని చేస్తుందో ఈ యాప్ కూడా అలానే పని చేస్తుంది. సులువుగా నోట్స్ తయారు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది . అంతేగాక మీ ఫోన్లో ఉన్న నోట్స్ ని కూడా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ తో synchronize చేస్తుంది. యూజర్ నేమ్ ,పాస్ వర్డ్ సహాయం తో లాగ్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది . ఇందులో క్రియేట్ చేసిన నోట్స్ కంప్యూటర్ లో కూడా యాక్సిస్ చేసుకోవచ్చు.

KIWI BROWSER

KIWI BROWSER

యూసీ ,క్రోమ్ బ్రౌజర్ల బోర్ కొట్టిన వారికి ఈ బ్రౌజర్ ట్రై చేస్తే బాగుంటుంది.గూగుల్ క్రోమ్ ను పోలి ఇంటర్ పేస్ ఉంటుంది . ఇందులో యాడ్ బ్లాకర్ ,నైట్ మోడ్ ,డౌన్లోడ్ ఫోల్డర్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. తక్కువ సైజ్ కలిగి ఉండే ఈ యాప్ లో యూట్యూబ్ వీడియోలను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేసే ఆప్షన్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోలను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేసుకుంటూనే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు .ఇందులో అడ్రస్ బార్ బ్రౌజర్ అడుగున ఉంటుంది.

CX FILE EXPLORER

CX FILE EXPLORER

ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి . ఒకటి లోకల్ . ఇందులో యాప్ డౌన్లోడ్స్ తో పాటు ఇతర స్టోరేజ్ అంశాలు ఇందులో ఉంటాయి . రెండవది లైబ్రరీ. ఫోన్లో ఉన్న ఫోటోలు ,ఆడియో ఫైల్స్ ,డాక్యుమెంట్ లు తదితర వివరాలన్నీ చూపిస్తుంది . మూడోది నెట్వర్క్. మొబైల్ లో ఉన్న డేటా ను కంప్యూటర్ కి పంపించే ఫీచర్ లు ఇందులో ఉంటాయి . వీటితో పాటు ఆన్ లైన్ ఆప్షన్ మరింత సమర్ధంగా పని చేస్తుంది . మెమరీ లో ఎక్కువ స్పేస్ ఆక్రమించిన యాప్స్ తో పాటు జంక్ ,ఇతర ఫైల్స్ ను తొలగించి ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది .

AMOLED WALLPAPERS

AMOLED WALLPAPERS

AMOLED వాల్ పేపర్స్ అంటే ఇష్టపడేవారు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో HD తో పాటు 4కె రిజల్యూషన్ గల AMOLED వాల్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. అంతేగాక ఇవి బ్యాటరీ ని కూడా ఎక్కువ ఉపయోగించుకోవు చాలా సింపుల్ గా ఉంటూనే ఎంతో రిచ్ లుక్ లో కన్పిస్తాయి.

TYT PLUS

TYT PLUS

వీడియోలు ,లైవ్ షోలు వంటివన్నీ ఒకే చోట లభించే యాప్ ఈ TYT PLUS . రాజకీయాలు ,క్రీడలు ,పాప్ కల్చర్ వంటి అంశాలన్నింటి పై ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ యాప్ ను ఉపయోగించాల్సిందే .ప్లే స్టాట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెలకు రూ.300 వరకు పే చేసి ప్రీమియం ప్లస్ సర్వీసులు పొందవచ్చు .

Best Mobiles in India

English summary
8 best new Android apps.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X