వృద్ధులకు ఉపయోగపడే కొన్ని అద్భుతమైన యాప్స్

ఈ తరం టెక్నాలజీని ఏ రేంజ్‌లో వాడుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వయసైపోయి ఒంట్లో ఓపిక తగ్గి ఇంట్లోనే ఉండే వృద్ధులకు టెక్నాలజీ వల్ల ఏం ఉపయోగం.

|

ఈ తరం టెక్నాలజీని ఏ రేంజ్‌లో వాడుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వయసైపోయి ఒంట్లో ఓపిక తగ్గి ఇంట్లోనే ఉండే వృద్ధులకు టెక్నాలజీ వల్ల ఏం ఉపయోగం. పెద్దవారికి కూడా ఉపయోగపడే ఎన్నో యాప్స్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. అందుకోసం ఒక్కసారి సమయం వెచ్చించి వారికి ఉపయోగపడే యాప్స్ ను డౌన్‌లోడ్ చేస్తే,మీరు లేని సమయంలో ఆ యాప్స్ వారికి ఎంతో సహాయంగా ఉంటాయి.

Voucher cloud

Voucher cloud

ఐఫోన్‌లో తప్ప మిగతా అన్ని ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. ముదిమి వయసులో బయటకు వెళ్లాలని ఆశపడే పెద్దవారు ఒక్కసారి ఈ యాప్‌లో చెక్ చేసుకుంటే చాలు.. ఎక్కడెక్కడ ఏయే ఆఫర్లున్నాయో సులభంగా తెలిసిపోతుంది. రెస్టారెంట్లు, సినిమాలు, గార్డెన్‌సెంటర్లు, ఇతర ఔట్‌లెట్లలో ఆఫర్లు, వోచర్లు, డిస్కౌంట్ల అందుబాటు గురించి చెప్పే యాప్ ఇది.

Fall detector

Fall detector

వయసైపోయాక ఒంట్లో పట్టు సడలిపోతుంది. కొన్నిసార్లు కిందపడిపోతుంటారు. వారిని ఇంట్లో వదిలేసి అందరూ ఉద్యోగాలు, కాలేజీలకి వెళ్లిపోతే వారి గురించి ఎవరు పట్టించుకుంటారు? వారికి ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది? అనే ఆందోళనకు ఈ యాప్‌తో చెక్ చెప్పొచ్చు. ఇంట్లోని పెద్దవారు రోజూవారీ ప్రవర్తనకు భిన్నంగా, తేడాగా ప్రవర్తించినా, వారి ఆరోగ్యం, కదలికల విషయాలలో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే పసిగట్టి యాప్‌లో కనెక్ట్ అయి ఉన్న మీకు అలర్ట్ పంపిస్తుంది. వెంటనే స్పందించి వారిని కాపాడుకోవచ్చు.

PILLBOX

PILLBOX

కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకోవాల్సిన సమయాన్ని మనమే మరిచిపోతుంటాం. అలాంటి వయసు మీద పడి జ్ఞాపకశక్తి తగ్గిపోతున్న పెద్దవారు మరిచిపోవడంలో తప్పేమీ లేదు. అయితే.. పిల్‌బాక్స్ యాప్ ఆ సమస్యను అధిగమించేందుకు సహాయపడుతుంది. కాకపోతే ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో ముందే ఇందులో సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆ సమయానికి గుర్తు చేస్తుంది.

HighBP

HighBP

వయసు మీద పడిన తర్వాత ఒంట్లో బీపీ, షుగర్ లెవల్స్ మారుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే మందులేసుకోవాలి. లేదంటే.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీ మొబైల్‌లో ఐబీపీ యాప్ ఉంటే చాలు.. ప్రతీసారి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.

Motion Doctor

Motion Doctor

ప్రమాదవశాత్తో, ఇతర కారణాల వల్లనో గాయాలైనప్పుడు ఏం చేయాలో తోచదు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే యాప్ ఇది. కిందపడినప్పుడు ఎముకలు కాస్త అటు, ఇటు జరిగి, లేదంటే విరిగి చెప్పలేనంతగా బాధపెడుతుంటాయి. అలాంటి సందర్భంలో చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి ఈ యాప్ చెప్తుంది. వయసు మీద పడినవారికి అయితే ఇది మరింత ఉపయోగకరం.

Dragon Dictation

Dragon Dictation

ఆఫీసులో ఉన్న కొడుకుకో, కూతురుకో, లేదంటే ఇంకెవరికైనా ఏదైనా మెసేజ్ పంపాలనుకునే పెద్దవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరం. టైప్ చేయలేక పడే ఇబ్బందుల్ని దీని ద్వారా అధిగమించవచ్చు. మీరు టైప్ చేయాలనుకున్న సమాచారాన్ని ఈ యాప్ ఓపెన్ చేసి నిర్ణీత స్పీడులో చెప్తే చాలు.. మీ మాటలు అక్షరాలుగా ప్రత్యక్షమవుతాయి. ఎంచక్కా ఆ మెసేజ్‌ని మీ వారికి పంపవచ్చు.

Wiz

Wiz

పెద్దవారికి స్మార్ట్‌ఫోన్ల వాడకం అంతో ఇంతో తెలిసినా.. దాని గురించి పూర్తిగా తెలిసే అవకాశం చాలా తక్కువ. ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా.. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్నా.. ఇబ్బందే. అయితే.. ఈ యాప్ అలా కాదు. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి మనకేం కావాలో ఆడియో రూపంలో అడిగితే.. వీడియో రూపంలో సమాధానం, సమాచారం రెండూ ఒకేసారి ఇస్తుంది.

WebMD

WebMD

ఇది ఒక వెబ్‌సైట్‌కి సంబంధించిన యాప్. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహమైనా, సమాచారమైనా ఈ యాప్ అందిస్తుంది. హెల్త్‌టిప్స్, సలహాలు అన్నీ ఈ యాప్ ద్వారా పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఈ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సింది సెలక్ట్ చేసుకోవడమే.

Best Mobiles in India

English summary
8 Unexpectedly Innovative Apps for Seniors.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X