మీకు తెలియకుండానే మీ ఫోన్‌ని నాశనం చేసే యాప్స్‌, వ్యక్తిగత వివరాలు కూడా !

|

గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి. కొత్త యాప్ రాగానే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయం తెలియకుండానే వాటిని మనం ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తుంటాం. అయితే వీటితో చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ కూడా ఈ యాప్స్ ద్వారా ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు. మన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వంటివీ ఈ యాప్స్ ద్వారా సమస్యల్లోకి వెళ్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ సంస్థ అన్నింటినీ ట్రాక్ చేయలేదు కాబట్టి మనమే రక్షణపరంగా ఉత్తమమైనవిగా రేటింగ్ ఉన్న వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్. రక్షణ లేని వాటికి వీలయినంతవరకు దూరంగా ఉండటం మంచిది. సో అలాంటి యాప్స్ ఏంటనేది ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

ఫేస్‌బుక్ లేకుండా మెసెంజర్‌ను ఉపయోగించుకోవచ్చా..?ఫేస్‌బుక్ లేకుండా మెసెంజర్‌ను ఉపయోగించుకోవచ్చా..?

Weather apps

Weather apps

ఉష్ణోగ్రతలు, వర్షం పడే అవకాశాలు, గాలిలో తేమ వంటి వివరాలు కచ్చితంగా అందిస్తామంటూ చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసేటప్పుడే లొకేషన్, మెస్సెజెస్, కాల్ లాగ్ డేటా వంటి చాలా రకాల పర్మిషన్లు అడుగుతుంటాయి. వాటిని మనం ఎంటర్ చేయగానే అవి డేటాను సేకరిస్తూ, హ్యాకర్లకు చేరవేస్తుంటాయి. సో వీటికి దూరంగా ఉండాలి.

Social media

Social media

ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్వీటర్ వంటి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను చాలామంది వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్స్ ఎక్కువ మొత్తంలో బ్యాటరీని, మెమొరీని వినియోగించుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఇంటర్నెట్ కు కనెక్ట్ అవ్వడం వల్ల ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంది. తక్కువ ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యమున్న ఫోన్లు హ్యంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఇంటర్నెట్ బ్రౌజర్లో చూడటం మంచిది

Optimizers
 

Optimizers

జంక్ ఫైల్స్‌ను, అనవసరపు డేటాను, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను తొలగించి.. ఫోన్ లో మెమరీని ఫ్రీ చేస్తామని, వేగంగా పనిచేసేలా చేస్తామని పేర్కొంటూ ఎన్నో రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల కూడా ఫోన్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేగాకుండా వాటి వల్ల అనవసరపు యాడ్స్ ను భరించాల్సి ఉంటుంది.

 Built-in browsers

Built-in browsers

మనం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు ఇన్ బిల్ట్ గా ఇంటర్నెట్ బ్రౌజర్లు వస్తుంటాయి. అవి చాలా వరకు పాపులర్ కాకపోవడంతోపాటు చాలా స్లోగా పనిచేస్తుంటాయి. ఫోన్ లో ఏదైనా ఇంటర్నెట్ లింక్ ను క్లిక్ చేయగానే దాదాపుగా ఇన్ బిల్ట్ గా వచ్చిన బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేలా సెట్టింగ్ ఉంటుంది. అయితే ఏ బ్రౌజర్ తో ఓపెన్ చేయాలనే ఆప్షన్ కూడా వస్తుంటుంది. అందువల్ల సెట్టింగ్స్ లో డీఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్ ను మార్చుకుంటే బెటర్.

Antivirus programs from unknown developers

Antivirus programs from unknown developers

గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని వందల రకాల యాంటీ వైరస్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన లోగోలు, పేర్లతో ఉండే ఈ యాంటీ వైరస్ యాప్ లతో ప్రమాదం చాలా ఎక్కువ. కొందరు హ్యాకర్లు ఆకర్షణీయమైన పేర్లతో, లోగోలతో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను తయారు చేసి గూగుల్ ప్లేస్టోర్ లో పెడుతున్నారు. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారో అంతే సంగతి.

Browsers with additional features

Browsers with additional features

ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేయడంతోపాటు వీడియోలు, ఆడియోను నేరుగా స్ట్రీమ్ చేయడం వంటి అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి యాప్ లకు మన ఫోన్ కు సంబంధించిన చాలా పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఈ యాప్ ల ద్వారా కీలకమైన వ్యక్తిగత డేటా, కాల్ డేటా, ఎస్సెమ్మెస్ లు వంటి సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువ. దీనితోపాటు ఇలాంటి యాప్ లలో విపరీతంగా యాడ్స్ వస్తుంటాయి. దాని వల్ల మన డేటా వేస్ట్ కావడమే కాకుండా.. ఫోన్ చాలా స్లో అవుతూ ఉంటుంది.

Apps for increasing the amount of RAM

Apps for increasing the amount of RAM

ర్యామ్ పెంచుతామంటూ వచ్చే యాప్స్ ని అసలు నమ్మవద్దు. వీటిల్లో నిజమెంత ఉందో తెలియదు కాని వాటి ద్వారా మీ ఫోన్ చిక్కుల్లో పడటం ఖాయం. అదీగాక యాడ్స్ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. కేవలం యాడ్స్ ద్వారా ఈ యాప్స్ రన్ అవుతుంటాయి. ఒక్కోసారి మీ డేటాకు ఎసరు పెట్టవచ్చు.

 Lie detectors

Lie detectors

సరదా కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేవారికి ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ యాప్స్ జోలికి వెళ్లకండి. వీటి ద్వారా మీరు మీ డేటాను హ్యాకర్ల చేతికి అందించినట్లే అవుతుంది. అలాగే బ్యాటరీ లైప్ ని తినేస్తాయి.

Defragmentation apps

Defragmentation apps

ఈ యాప్స్ కూడా చాలా ప్రమావదకరంతో కూడుకున్నవి. మీ వ్యక్తి గత సమాచారాన్ని సేకరించేందుకు ఈ రకమైన యాప్స్ లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఫోన్ రక్షణ మీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఈ యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
9 Dangerous Android Apps It’s Better to Delete Immediately More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X