గూగుల్ మ్యాప్స్‌లో ఈ 9 ట్రిక్స్ గురించి తెలుసుకోండి

కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా గుర్తుచేది గూగుల్ మ్యాప్స్ ఎందుకంటే ఒక్కసారి గూగుల్ లో ఆ ప్రదేశాన్ని చూడాలి అనుకోగానే షార్ట్ కట్స్ తో సహా మీకు సమస్తం తెలియజేస్తుంది

By Anil
|

కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా గుర్తుచేది గూగుల్ మ్యాప్స్ ఎందుకంటే ఒక్కసారి గూగుల్ లో ఆ ప్రదేశాన్ని చూడాలి అనుకోగానే షార్ట్ కట్స్ తో సహా మీకు సమస్తం తెలియజేస్తుంది. దీనితో పాటు ఏ రూట్లో ఎంత ట్రాఫిక్ ఉందో కూడా తెలియజేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ మ్యాప్స్ గురించి అన్ని పాజిటివ్ విషయాలే కాని నెగిటివ్ విషయాలు ఏవి ఉండవు. నావిగేషన్ సర్వీసెస్ అందించడం లో గూగుల్ కు మించిన సర్వీస్ ఇప్పటివరకు ఏది లేదు.అయితే మనలో చాలా మందికి గూగుల్ మ్యాప్స్ అందించే కొన్ని అద్భుతమైన ఫీచర్స్ గురించి తెలియకపోవచ్చు . ఈ శీర్షిక ద్వారా గూగుల్ మ్యాప్స్ ద్వారా లాభ పడే కొన్ని ఫీచర్స్ ను మీకు తెలుపుతున్నాము.

Save your parking location :

Save your parking location :

రోజు పార్కింగ్ చేసే లొకేషన్ ను మరిచిపోయే అలవాటు ఉంటే పార్కింగ్ లొకేషన్ ను గూగుల్ మ్యాప్స్ లో మ్యానువల్ గా పిన్ చేసి ఉంచుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ కూడా దానిని డిటెక్ట్ చేసి లొకేషన్ సెట్టింగ్స్ ద్వారా సేవ్ చేస్తుంది. మీరు వెహికల్ పార్క్ చేసే ముందు గూగుల్ మప్స్ లో బ్లూ డాట్ ను క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది .

Get direction for multiple locations :

Get direction for multiple locations :

ఈ ఫీచర్ ను వాడుకోవాలంటే పాయింట్ A నుంచి పాయింట్ B వరకు డైరెక్షన్ ను సెట్ చేసుకోండి.పైన టాప్ కార్నెర్ లో ఉన్న మూడు హారిజాంటల్ డాట్స్ ను ట్యాప్ చేసి స్టాప్ ఆప్షన్ ను యాడ్ చేయండి. మీరు ప్రయాణించేటప్పుడు ఎన్ని స్టాప్స్ కావాలి అంటే అన్ని స్టాప్స్ ను యాడ్ చేసుకునే వీలు ఉంటుంది.

Make your own Google Map :
 

Make your own Google Map :

మీ ట్రిప్ యొక్క ప్లాన్ ను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయాలనుకున్నప్పుడు లేదా మీ పిల్లలు లేదా తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మీరు My Maps ను ఉపయోగించి దిశలు, మార్గాలు మరియు మరెన్నో వంటి సమాచారాన్ని అవసరమైన రీతిలో అనుకూల మ్యాప్లను సెట్ చేసుకోవచ్చు. ఈ సొంత మ్యాప్ ను క్రియాట్ చేసుకోవడనికి బ్రౌజర్ లో గూగుల్ అకౌంట్స్ లో సైన్ ఇన్ అవ్వండి . చిన్న ట్యూటోరియాల్ ద్వారా మీ సొంత మ్యాప్స్ ను మీరు క్రియాట్ చేసుకోండి.

Offline maps :

Offline maps :

Google మ్యాప్స్ కలిగి ఉన్న మరో ప్రయోజనం మీరు ఒక సెక్షన్ అఫ్ మ్యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వద్ద ఉన్న పథ స్మార్ట్ ఫోన్ ను కారు లేదా బైక్ కో GPS గా ఉపయోగించవచ్చు.ఈ Offline maps సెక్షన్ లో హారిజాంటల్ సెలక్షన్ టూల్ ను మీకు అందిస్తుంది మరియు
ఉపయోగించబడుతున్న స్థలం మొత్తం మీకు తెలియజేస్తుంది. ఏదైనా డౌన్లోడ్ చేసిన మ్యాప్ Wi-Fi కి కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అప్ డేట్ అయిపోతుంది.

Set your default address :

Set your default address :

Offline map ను డౌన్లోడ్ చేసుకున్నాక అందులో మీ ఇంటి మరియు ఆఫీస్ అడ్రస్ ను యాడ్ చేసుకోవచ్చు.ఇది మీకు నావిగేషన్ త్వరగా స్టార్ట్ అవ్వడానికి సహాయపడ్తుని అలాగే, మీరు పనిలో ఉన్నప్పుడు, ఇంటికి మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితుల యొక్క హెచ్చరికలు మీకు ఇవ్వబడుతుంటాయి.

 

 

Sharing your location :

Sharing your location :

గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా మీరు ఉన్న కచ్చితమైన లొకేషన్ ను మీ ఫ్రెండ్స్ కో లేదా మీకు తెలిసిన వాళ్ళకో షేర్ చేసుకోవచ్చు.

 

 

 Train and bus schedules :

Train and bus schedules :

భారతదేశంలో గూగుల్ మ్యాప్స్ మీ నగరంలో తిరిగే రైళ్లు మరియు బస్సు సేవలకు సమయాలను కలిగి ఉంటుంది. మీ గమ్యానికి మార్గాలను సెర్చ్ చేసేటప్పుడు . మీరు ప్రజా రవాణా యొక్క వివిధ మోడ్లను చేర్చడానికి రిజల్ట్స్ ను ఫిల్టర్ చేయవచ్చు . బస్సు మార్గాలు, తదుపరి ప్రయాణాలను మరియు మీ ప్రయాణ వ్యవధి మీ మార్గాల ప్రకారం అప్ డేట్ చేయబడి ఉంటుంది.

 Track your own movements :

Track your own movements :

మీరు సందర్శించిన ప్రదేశాలు మరియు మీరు తీసుకున్న మార్గాలు మొత్తం Google Maps మీకు చూపిస్తుంది. మ్యాప్ తప్పుగా క్యాప్చర్ చేసిన డేటాను మీరు అప్డేట్ చేయవచ్చు లేదా తొలిగించవచ్చు.

Earn by becoming a Local Guide :

Earn by becoming a Local Guide :

ఇది 'Local Guides ' రూపంలో Google Maps లో అందుబాటులో ఉంది.ఇందులో మీరు తప్పిపోయిన దుకాణాలు మీ ప్రాంతంకు సంబంధించిన వివరాలు, వ్యాపారాల గురించి సమాచారాన్ని అప్ డేట్ చేయడం,అదే విధంగా మీరు వెళ్లిన హోటల్స్ గురించి రివ్యూస్ గూగుల్ మ్యాప్స్ యాప్ లో అప్ డేట్ చేయాలి.ఇలా చేస్తే మీరు కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
9 Google Maps tricks you should know.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X