ఈ 9 యాప్స్‌తో మీ పనులు మరింత సులువు!

|

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్‌గా మారిపోవటంతో యాప్స్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్ యాప్స్‌కు రెక్కలొచ్చినట్లయ్యింది. వాస్తవానికి యాప్‌లను అవసరం మేరకే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇదే తెలియని ఆండ్రాయిడ్ యూర్లు అవసరం లేకపోయినప్పటికి ఇబ్బడి మబ్బిడి‌గా యాప్‌లను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసేసుకుంటారు. ఇలా చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ వృథా అవటం తప్ప ఏమి ఉండదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌ను మరింత సులభతరం చేసే 9 యాప్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చరిత్రపుటల్లోకి జారుకుంటున్న విషాదాలు ఇవే

ముజీ (Muzei)
 

ముజీ (Muzei)

ఈ ఉపయుక్తమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ‘లైవ్ మ్యూజియమ్'గా డెవలపర్స్ అభివర్ణిస్తున్నారు. ఈ వాల్ పేపర్ యాప్ ప్రసిద్థి చెందిన ఆర్ట్ వర్క్స్ ను డిస్ ప్లే చేస్తుందటుంది. మనం ఎంచుకునే టైమ్ ఫ్రేమ్‌ను బట్టి డిస్ ప్లే పై వాల్‌పేపర్స్ రీఫ్రెష్ అవుతుంటాయి. ఫోన్ డిస్‌ప్లేను ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉంచుకోవాలనుకునే వారికి Muzei యాప్ చక్కటి ఆప్షన్.

Contextual App Folder (కాన్‌టెక్స్ట్యుల్ యాప్ ఫోల్డర్)

Contextual App Folder (కాన్‌టెక్స్ట్యుల్ యాప్ ఫోల్డర్)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కాన్‌టెక్స్ట్యుల్ యాప్ ఫోల్డర్ యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని ఇతర అప్లికేషన్‌లకు సంబంధించి కాన్‌టెక్స్ట్యుల్ యాక్సిస్‌ను పొందే వీలుంటుంది. దీంతో యాప్స్ యూసేజ్ మరింత సులభతరంగా మారిపోతుంది.

లాంచర్స్ (Launchers)

లాంచర్స్ (Launchers)

వీటికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉద్దేశించి గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక థర్డ్ పార్టీ లాంచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బెస్ట్ లాంచర్‌ను పిక్ చేసుకోవటం ద్వారా ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింతగా ఎక్స్‌ప్లోర్ చేసుకునే వీలుంటుంది.

Icon Packs (ఐకాన్ ప్యాక్స్)

Icon Packs (ఐకాన్ ప్యాక్స్)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వైరల్, పిక్సల్ పై వంటి ఐకాన్ ప్యాక్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యాప్ ఐకాన్స్‌ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది.

జూపర్ విడ్జెట్ (Zooper widget)
 

జూపర్ విడ్జెట్ (Zooper widget)

ఈ కస్టమైజబుల్ విడ్జెట్ యాప్ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై బ్యాటరీ శాతం, వెదర్, కాల్స్, సన్‌రైజ్/సన్‌సెట్, మూన్‌రేజ్/సెట్ వంటి సమాచారాన్ని టెంప్లెట్స్ రూపంలో స్ర్కీన్ పై చూపుతుంది. ఈ బ్యాటరీ ఫ్రెండ్లీ యాప్ చాలా తక్కువ పవర్‌ను కన్స్యూమర్ చేసుకుంటుంది.

కస్టమ్ సెర్చ్ బార్ (Custom Search Bar)

కస్టమ్ సెర్చ్ బార్ (Custom Search Bar)

ఈ విడ్జెట్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే, అనేక సెర్చ్ ఇంజిన్స్‌ను కస్టమ్ సెర్చ్ బార్ ద్వారా పొందే వీలుంటుంది. ఫేస్‌బుక్, గూగుల్ డ్రైవ్, మ్యూజిక్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లను కూడా సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

స్మార్ట్ డ్రాయర్ (Smart Drawer)

స్మార్ట్ డ్రాయర్ (Smart Drawer)

ఈ యాప్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను క్యాటగిరీస్ క్రింద అరేంజ్ చేసి సులువుగా ఉపయోగించుకునేలా చూస్తుంది. ఎలాంటి లాంచర్‌తో నైనా ఈ స్మార్ట్ డ్రాయర్ యాప్ వర్క్ అవుతుంది.

వాల్ మాగ్ (WallMag)

వాల్ మాగ్ (WallMag)

మ్యాగజైన్స్ అలానే ఆర్టికల్స్ చదివే వారికి ఈ యాప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ యాప్ యూజర్ అభిరుచులకు అనుగుణంగా ఇంట్రస్ట్‌ను సెట్ చేసి ఆర్టికల్స్‌ను సజస్ట్ చేస్తుంది.

టాపెట్ (Tapet)

టాపెట్ (Tapet)

ఈ బ్యాగ్రౌండ్ జనరేటర్ యాప్ ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా వర్క్ అవుతుంది. ఫోన్ డిస్‌ప్లేను ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంచే క్రమంలో వాల్‌పేపర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది. మనం ఎంచుకునే టైమ్ ఫ్రేమ్‌ను బట్టి డిస్‌ప్లే పై వాల్ పేపర్స్ రీఫ్రెష్ అవుతుంటాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
9 useful apps to personalize your Android home screen.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X