Home
Apps

చైనా కుర్రాళ్ల షాక్, ఫేక్ ఐఫోన్లతో ఆపిల్ కంపెనీకి రూ. 6 కోట్లు టోకరా

ప్రపంచ టెక్ రంగంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీకే విద్యార్థులు మస్కా కొట్టారు. ఫేక్ ఐఫోన్లను రియల్ ఐఫోన్లుగా నమ్మించి కంపెనీ నుంచి దాదాపు 6.2 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ పనిచేసింది ఎవ

ప్రపంచ టెక్ రంగంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీకే విద్యార్థులు మస్కా కొట్టారు. ఫేక్ ఐఫోన్లను రియల్ ఐఫోన్లుగా నమ్మించి కంపెనీ నుంచి దాదాపు 6.2 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ పనిచేసింది ఎవరో కాదు. అమెరికాకు వాణిజ్య రంగంలో శత్రు దేశంగా మారిన చైనా దేశానికి చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు. రెండేళ్లుగా ఫేక్ ఐఫోన్లను రీప్లేస్ మెంట్ పేరుతో అమెరికాలోని ఆపిల్ కంపెనీకి పంపిస్తున్నారు.

చైనా కుర్రాళ్ల షాక్, ఫేక్ ఐఫోన్లతో ఆపిల్ కంపెనీకి రూ. 6 కోట్లు టోకరా

అచ్చం ఐఫోన్ల మాదిరిగానే ఉన్న ఈ ఫేక్ ఐఫోన్లను డివైజ్ వారెంటీ కింద రీప్లేస్ మెంట్ కోసం పంపిస్తున్నట్టు ఆపిల్ గుర్తించింది. ఇలా మొత్తం రూ. 6 కోట్ల ఫేక్ ఐఫోన్లను ఆపిల్ కంపెనీకి అందించి మస్కా కొట్టారు.

ఆపిల్ కేర్ సెంటర్లకు

ఆపిల్ కేర్ సెంటర్లకు

ఐఫోన్లు టర్న్ ఆన్ కావడం లేదని, వారెంటీ కింద రీప్లెస్ చేయాల్సిందిగా కోరుతూ వేలాది ఫేక్ ఐఫోన్లను ఆపిల్ కేర్ సెంటర్లకు పంపించినట్టు ఆపిల్ టెక్ కంపెనీ గుర్తించింది. ఈ స్కాంపై స్పందించిన ఆపిల్..15వందల వరకు ఫేక్ ఐఫోన్లు వారు పంపినట్టు తెలిపింది. అందులో ఒక్కో ఐఫోన్ రీసేల్ విలువ (600 డాలర్లు) అంటే.. రూ.42వేలు వరకు ఉంటుందని సమాచారం.

 ఫేక్ డివైజ్ లు

ఫేక్ డివైజ్ లు

చైనీస్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్వాన్ జియాంగ్ (30) ఆపిల్ కు పంపిన ఐఫోన్లన్నీ ఫేక్ డివైజ్ లుగా కంపెనీ గుర్తించింది. యాంగ్ యాంగ్ జోహు అనే విద్యార్థి ఒరిగన్ స్టేట్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అమెరికాలో ఫేక్ ఐఫోన్లను స్మగ్లింగ్ చేస్తుండేవాడు. తన అనుచరుడు క్వాన్ జియాంగ్ తో కలిసి ఫేక్ ఐఫోన్లను రీప్లేస్ చేసి చైనాకు పంపిస్తున్నట్టు గుర్తించారు.

విలువ 6.2 కోట్లకు పైనే :

విలువ 6.2 కోట్లకు పైనే :

పోర్టులాండ్ లోని ఒరిగన్, అల్బానీలో కమ్యూనిటీ కాలేజీలో జియాంగ్ ఇంజినీరింగ్ చదివాడు. ఫేక్ ఐఫోన్లను రీప్లేస్ చేసి తర్వాత ఆ ఫోన్లను జోహుకు పంపేవాడు. దొంగలించిన డివైజ్ లను జోహు.. తిరిగి చైనాకు పంపుతున్నట్టు ఆపిల్ గుర్తించింది. మాల్ ఫంక్షనింగ్ డివైజ్ లను రియల్ ఐఫోన్లతో రీప్లేస్ చేసి కంపెనీని చీటింగ్ చేసినట్టు గుర్తించింది.

కంపెనీ పాలసీలో లూప్ హోల్ కారణంగా ఫోన్ కొన్నట్టుగా ప్రూఫ్ అవసరం లేదు. దీంతో కంపెనీని చీటింగ్ చేసేందుకు వీరికి ఎంతో ఈజీ అయింది. కొన్నినెలల పాటు రీప్లేస్ చేసిన డివైజ్ ల విలువ (895వేల 8వందల డాలర్లు) రూ.6.2 కోట్లుకు పైగా ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. రీప్లేస్ మెంట్ కు పంపిన ఫోన్ డివైజ్ ల్లో పవర్ ఆన్ కాకపోవడంతో.. ఆ ఫోన్లు ఫేక్ అని కంపెనీ సిబ్బంది గుర్తించలేకపోయింది.

 

స్కాం జూన్ 30, 2017లో వెలుగులోకి

స్కాం జూన్ 30, 2017లో వెలుగులోకి

జియాంగ్ వారెంటీ క్లైమ్స్ కింద 3వేల 069 యూనిట్ల డివైజ్ లను ఆపిల్ కు పంపాడు. ఇందులో ఆపిల్ రీప్లేస్ మెంట్ కింద 1,493 కు పైగా ఐఫోన్లను రీప్లేస్ చేసింది. మరో 1,576 వారెంటీ క్లైమ్స్ ను ఆపిల్ తిరస్కరించింది. ఈ స్కాం జూన్ 30, 2017లో ఆపిల్ గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఆపిల్ కంపెనీని చీటింగ్ చేసిన చైనీస్ విద్యార్థులను అరెస్ట్ చేశారు.ఫేక్ ఫోన్ల స్మగ్లింగ్ పై యూఎస్ అధికారులు విచారించారు.

విచారణలో భాగంగా రీప్లేస్ మెంట్ కోసం ఆపిల్ కు పంపిస్తున్న డివైజ్ లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిందితులను ప్రశ్నించగా.. తమకు తెలియదని జోహు, జియాంగ్ చెప్పారు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. హంగ్ కాంగ్ లో తన అనుచరుల నుంచి జియాంగ్.. జనవరి 1, 2016, ఫిబ్రవరి 1, 2018 మధ్యకాలంలో 20 నుంచి 30 వరకు నకలీ ఐఫోన్లు ప్యాకేజీలుగా జియాంగ్ అందుకున్నట్టు ఉంది.

 

 జియాంగ్ చేసిన నేరం రుజువు కావడంతో

జియాంగ్ చేసిన నేరం రుజువు కావడంతో

చీటింగ్, ఫోన్ల స్మగ్లింగ్ కేసులో జియాంగ్ చేసిన నేరం రుజువు కావడంతో అతడికి ఫెడరల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 మిలియన్ల డాలర్లు (రూ.20లక్షలు) జరిమానా విధించింది. నష్టపరిహారం కింద ఆపిల్ కు 200వేల డాలర్లు (రూ.20వేల కోట్లు) అదనంగా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
A Student Scammed Apple Of Rs 6.2 Crore With 1493 Fake iPhones, He Now Faces 10 Years In Jail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X