Home
Apps

Adobe సరికొత్త యాప్‌తో స్కానింగ్ మరింత సులువు

మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతర మొబైల్ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లతో పోలిస్తే అడోబ్ స్కాన్ యాప్ ప్రొఫెషనల్ స్థాయి పనితీరును కనబరుస్తుంది.

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందటంతో స్కానింగ్ అనేది ఇప్పుడు ఫోన్‌లతోనూ సాధ్యమవుతోంది. ఫోన్ కెమెరాను స్కానర్‌గా మార్చగలిగే అనే యాప్స్ మార్కెట్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అడోబ్ సంస్థ Adobe Scan పేరుతో సూపర్ ఫాస్ట్ స్కానింగ్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఫిజికల్ డాక్యుమెంట్లను మరింత క్వాలిటీతో స్కాన్ చేసుకోవచ్చు..

ఫిజికల్ డాక్యుమెంట్లను మరింత క్వాలిటీతో స్కాన్ చేసుకోవచ్చు..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ ఫిజికల్ డాక్యుమెంట్లను మరింత క్వాలిటీతో డిజిటల్ ఫైల్స్‌గా మార్చుకుని అడోబ్ క్లౌడ్ అకౌంట్‌లో భద్రపరచుకోవచ్చ. అడోబ్ స్కాన్ యాప్ ఆండ్రాయిడ్ అలనా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ప్రొఫెషనల్ స్థాయి పనితీరు..

ప్రొఫెషనల్ స్థాయి పనితీరు..

మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతర మొబైల్ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లతో పోలిస్తే అడోబ్ స్కాన్ యాప్ ప్రొఫెషనల్ స్థాయి పనితీరును కనబరుస్తుంది.

Adobe Sensei అడ్వాన్సుడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టక్నాలజీ

Adobe Sensei అడ్వాన్సుడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టక్నాలజీ

యాప్‌లో నిక్షిప్తం చేసిన Adobe Sensei అనే అడ్వాన్సుడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టక్నాలజీ మనం స్కానం చేసే డాక్యుమెంట్‌లకు సంబంధించిన అంచులను ఆటోమెటిక్‌గా గుర్తిస్తుంది. అంతేకాకండా ఫోటోలను ఆటో క్రాప్ చేయటం, ఫోటోలోని నీడను తొలగించటం, టెక్స్ట్‌‌ను మరింత షార్ప్‌గా చూపించటం వంటి జాగ్రత్తలను ఈ యాప్ తీసుకుంటుంది.

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఒక్క మాటలో చెప్పాలంటే Adobe Scan యాప్‌తో స్కాన్ చేసే డాక్యుమెంట్స్ మరింత క్లియర్‌గా ఉంటాయి. గూగుల్ ప్లే అలానే యాపిల్ ఐఓఎస్ స్టోర్ లలో అందుబాటులో ఉన్న ఆ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Adobe ఐడీని క్రియేట్ చేసుకోవటం ద్వారా యాప్ వర్క్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Adobe Scan is a fast scanning app for your phone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X