ఎయిర్‌సెల్ యాప్‌పై బ్రౌజింగ్ ఫ్రీ !
అదనపు ఛార్జీలు లేకుండా యాప్ ను వినియోగించుకోవచ్చు
టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ సెల్ యాప్ నుంచి ఉచిత బ్రౌజింగ్ ను ప్రారంభించింది వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఎయిర్ సెల్ ఈ ఆఫర్ ను ప్రకటించింది.

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై ఎయిర్ సెల్ యాప్ ను ఉపయోగించేవారికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఎయిర్ సెల్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు, డేటా లోన్లు, మెయిన్ అకౌంట్ బ్యాలన్స్ ద్వారా పే చేయడం లాంటివి ఉచితంగానే చేయవచ్చు.
ఈ ఫీచర్ డేటా బ్యాలెన్స్ , ఈమధ్యే ఎయిర్ సెల్ ఆఫర్స్ ను చెక్ చేయడానికి క్రమం తప్పకుండా కస్టమర్లు బ్రౌజింగ్ చేసుకునేందుక ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఎయిర్ సెల్ ఎల్లప్పుడూ ప్రొడక్స్ట్ , స్పెషల్ ప్రొడక్ట్స్ ను కస్టమర్లకు అందిస్తుందని ఎయిర్ సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ అన్నారు. కస్టమర్ల అనుభవాలను అందిస్తుందని చెప్పారు.
వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని కల్పించగలమని, యాప్ నుంచి పలు ఆఫర్లను బ్రౌజ్ చేసుకుని సౌకర్యవంతంగా వారి ఫోన్లను రీఛార్జీ చేసుకోవచ్చని తాము భావిస్తున్నామన్నారు. వినియోగదారులతో ఉన్న అటాచ్ మెంట్ ను విలవైనదిగా ఈ స్వాతంత్ర్యం డే న సెలబ్రెట్ చేసుకుంటున్నామన్నారు.
ప్రత్యేకమైన ఆఫర్ వినియోగదారుల స్వేచ్చను యాప్ బ్రేజ్ చేస్తున్నప్పుడు వారి డేటా బ్యాలెన్స్ గురించి చింతించకుండా సహాయపడుతుంది. వినియోగదారులు ఆండ్రాయిడ్ , IOS App స్టోర్ల నుంచి ఎయిర్ సెల్ యాప్ ను డౌన్ లోడ్ చేయవచ్చు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ RCom మరియు ఎయిర్ సెల్ వైర్లెస్ బిజినెస్ ప్రతిపాదిత విలీనాన్ని ఆమోదించింది. RCom-ఎయిర్ సెల్ కలయిక కస్టమర్ బేస్ మరియు రెవెన్యూల ద్వారా భారతదేశం టాప్ 4 టెల్ కోస్ లో ర్యాంక్ పొందింది. 12ముఖ్యమైన సర్కిళ్లలో రాబడి ద్వారా టాప్ 3 ఆపరేటర్లలో కూడా ర్యాంక్ సంపాదించింది.


Click it and Unblock the Notifications








