ఈ యాప్‌తో 15 నిమిషాల్లో వెబ్‌సైట్ తయారు చేసుకోవచ్చు

మీకు తెలుసా, మీకు నచ్చిన వెబ్‌సైట్‌ను మీరు కోరుకున్న రీతిలో‌, మీ ఫోన్‌లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో సిద్థంగా ఉన్న Akmin Website Builder అనే యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో మీకు కావల్సిన ప్రొఫెషనల్ లుకింగ్ వెబ్‌సైట్ తయారైపోతుంది. ఫారమ్స్, ఫోటో ఆల్బమ్, షాపింగ్ కార్ట్ వంటి ఉపయుక్తమైన ఫీచర్లను వెబ్‌సైట్‌కు యాడ్ చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది.

ఈ యాప్‌తో 15 నిమిషాల్లో వెబ్‌సైట్ తయారు చేసుకోవచ్చు

మీరు వాడుతున్నది ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, యాపిల్ ఐఫోన్ అయినా ఈ యాప్ విజయవంతంగా వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Google Play Store ద్వారా యాపిల్ ఐఫోన్ యూజర్లు iTunes స్టోర్ ద్వారా ఉచితంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీసీ లేదా ల్యాప్ టాప్ లో ఈ యాప్ రన్ అవ్వాలంటే www.akmin.net నుంచి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

Akmin Website Builder యాప్ చిన్న తరహా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా వెబ్ సైట్ లను బిల్డ్ చేసుకునే వీలుంటుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం , లాగిన్ అవటం, టెంప్లెట్‌ను సెలక్ట్ చేసుకోవటం, వెబ్ పేజీని నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటం, కంటెంట్ ను పోస్ట్ చేయటం ఇలా పనులన్నీ నిమిషాల ప్రకారం జరిగిపోతాయి.

English summary
Create a website for free using your smartphone with this app. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot