Saavn, Gaanaలకు షాక్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వచ్చేసింది, వారికి ఉచితం

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ దిగ్గజం అమెజాన్ Saavn, Gaanaలకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ దిగ్గజం అమెజాన్ Saavn, Gaanaలకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సర్వీస్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫాంలపై అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లభిస్తున్నది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలో అమెజాన్ ప్రైమ్ యూజర్లు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. అలాగే వెబ్ ప్లాట్‌ఫాంపై music.amazon.in సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా ఈ సేవను వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీస్ అమెజాన్ ఎకో డివైస్‌లలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ యూజర్లందరికీ లభిస్తున్నది.

ఆపిల్ ఐఫోన్ Xకి జెరాక్స్ దిగింది బాసూ, బడ్జెట్ ధరకే..ఆపిల్ ఐఫోన్ Xకి జెరాక్స్ దిగింది బాసూ, బడ్జెట్ ధరకే..

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు కాని వారు రూ.999 చెల్లించి ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సేవలను పొందవచ్చు. అలాగే అమెజాన్ సైట్‌లో ప్రత్యేక సేల్‌లు నిర్వహించినప్పుడు ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగా సేల్ అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు అమెజాన్‌లో కొనే పలు వస్తువులకు ఉచిత డెలివరీని అందిస్తారు.

అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్స్ ..

అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్స్ ..

కాగా అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లో హిందీ, ఇంగ్లిష్, పంజాబీ, త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, మ‌రాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, గుజ‌రాతీ, రాజ‌స్థానీ భాష‌ల‌కు చెందిన కొన్ని ల‌క్ష‌ల పాట‌లు అందుబాటులో ఉన్నాయి. అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్స్ కూడా ల‌భిస్తున్నాయి.

త‌మ‌కిష్ట‌మైన ప్లే లిస్ట్‌ల‌ను

త‌మ‌కిష్ట‌మైన ప్లే లిస్ట్‌ల‌ను

వీటికి గాను యూజ‌ర్లు త‌మ‌కిష్ట‌మైన ప్లే లిస్ట్‌ల‌ను పాట‌ల జ‌న‌ర్‌ను బ‌ట్టి క్రియేట్ చేసుకోవ‌చ్చు. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ యాప్‌లో ల‌భించే ప‌లు పాట‌ల‌ను యూజ‌ర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో డివైస్‌లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేకపోయినా ఆ పాట‌ల‌ను వినేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో మ్యూజిక్‌ను సెర్చ్ చేసుకునేందుకు గాను అలెక్సా వాయిస్ స‌పోర్ట్‌ను కూడా అందిస్తున్నారు.

2020 నాటికి

2020 నాటికి

2020 నాటికి ఇండియా డిజిటల్ మ్యూజిక్ ఇండస్ట్రీ రూ. 3100 కోట్లను ఆర్జించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని Deloitte గతేడాది రిపోర్ట్ చేసింది. కాగా ఇండియాలో 273 మిలియన్ల మంది ఆన్ లైన్ మ్యూజిక్ యూజర్లు ఉన్నారు.

Gaana జనవరిలో ..

Gaana జనవరిలో ..

కాగా Gaana జనవరిలో 60 మిలియన్ల యూజర్లను, Saavn 22 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకున్నట్లుగా ఆ కంపెనీలు రిపోర్ట్ చేశాయి. కాగా అమెజాన్ కు ఇండియాలో 10 మిలియన్ల మంది ఉన్నారని అంచనా.

Best Mobiles in India

English summary
Amazon Music launches in India as part of Prime More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X