రోబోలతో క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ కామర్స్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. నాణ్యమైన సేవలు అందిస్తూ ఈ దిగ్గజం వినియోగదారుల మనసును ఎప్పటికప్పుడు చూరగొంటోంది. ఈ నేపథ్యంలో వారిని మరింతగా ఆకట్టుకోవడానికి క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఏ కామర్స్ సంస్థ చేయని పని చేస్తోంది. ఈ దిగ్గజం అమెజాన్ రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది.

 

రోబోలతో క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్

వాషింగ్టన్‌లో ఉన్న స్నోహోమిష్ కౌంటీలో ప్రస్తుతం 6 రోబోట్లు అమెజాన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నాయి. ఈ రోబోట్లు 6 చక్రాలను కలిగి ఉండగా వాటిపై బ్లూ కలర్ పెయింట్‌ను వేశారు. దానిపై ప్రైమ్ అని రాశారు. ఇక వీటిని అడోరా బాట్స్ అని అమెజాన్ వ్యవహరిస్తోంది.

తోడుగా అమెజాన్ స్కౌట్ అంబాసిడర్లు

తోడుగా అమెజాన్ స్కౌట్ అంబాసిడర్లు

కాగా అడోరా బాట్స్ ప్రస్తుతం కస్టమర్లకు అమెజాన్ నుంచి ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నప్పటికీ వాటికి తోడుగా అమెజాన్ స్కౌట్ అంబాసిడర్లు వెంట వెళ్తున్నారు. వీరు ఆ రోబోట్లను పర్యవేక్షించడంతోపాటు వాటి పనితీరుపై కస్టమర్లకు వచ్చే సందేహాలను తీరుస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.

రాత్రి పూట కూడా డెలివరీ:

రాత్రి పూట కూడా డెలివరీ:

ఇక ఈ రోబోట్లతో కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి పూట, భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ప్యాకేజీలను డెలివరీ చేయిస్తున్నారు. వాటి పనితీరును అమెజాన్ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ త్వరలోనే పెద్ద ఎత్తున రోబోట్ల ద్వారా కస్టమర్లకు ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయాలని చూస్తోంది.

రోబోట్ల మీద అనేక ప్రయోగాలు:
 

రోబోట్ల మీద అనేక ప్రయోగాలు:

కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఈ రోబోట్లను ల్యాబ్‌లలో పరీక్షించిన అమెజాన్ స్కౌట్స్ ఇప్పుడు వాటిని వీధుల్లో నడిపిస్తూ వాటితో ప్యాకేజీలను డెలివరీ చేయిస్తున్నారు. ఈ రోబోట్లను Amazon's Seattle labs డెవలప్ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ రోబోట్ల మీద అనేక ప్రయోగాలు జరుగుతన్నాయి. ఈ రోబోట్లు అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమయితే అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.

రోబోకు 6 చక్రాలు:

రోబోకు 6 చక్రాలు:

స్కౌట్స్ రోబోను వాషింగ్టన్ లోని స్నోహోమిష్‌ కంట్రీలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లేత నీలం రంగులో బాక్సు పరిమాణంలో ఉన్న ఈ రోబోకు 6 చక్రాలు అమర్చారు. ఇరుకువీధుల్లో, కాలిబాటలో సులభంగా తిరగగలిగేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ రోబో వెంట ఓ ఉద్యోగిని పంపుతూ దాని పనితీరును విశ్లేషిస్తున్నామని అమెజాన్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. తమ చుట్టుపక్కల ఉండే మనుషులు, జంతువులను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగేలా ఈ యంత్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Officially Rolled Out Delivery Robots in US

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X