Amazon Great Indian Sale:డిస్కౌంట్ ధరలో మూడు నెలల ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020 పేరిట ఉత్తేజకరమైన ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు వంటి మరెన్నో ఉత్పత్తుల మీద భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సేల్స్ జనవరి 22, 2020 వరకు కొనసాగుతుంది.

అమెజాన్ తన వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తామని ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ఇ-కామర్స్ సైట్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ యొక్క ప్రీమియం సభ్యత్వాన్ని రాయితీ ధరకు అందిస్తోంది. ఆఫర్లలో భాగంగా మూడు నెలల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఇప్పుడు కేవలం రూ.329లకు అందిస్తున్నది.

అంతకుముందు కస్టమర్లు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఎంచుకోవడానికి కేవలం రెండు ప్లాన్లు మాత్రమే ఉండేవి. వాటిలో నెలవారీ ప్లాన్ మరియు వార్షిక ప్లాన్ మాత్రమే ఉండేది. నెలవారీ ప్లాన్ యొక్క ధర 129రూపాయలు కాగా ఒక సంవత్సరం ప్లాన్ యొక్క ధర రూ.999. ఈ రెండు ప్లాన్లు తప్ప వీటి మధ్య నిర్దిష్ట కాలానికి మరొక ఎటువంటి ప్లాన్ లేదు. ఇప్పుడు తన జాబితాలో మూడు నెలల ప్లాన్ ను చేర్చింది.

మూడు నెలల ప్లాన్ ను పోర్టుఫోలియోలో రూ.387 ధరతో చేర్చింది. ప్రస్తుతం అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ సేల్స్ సందర్బంగా వినియోగదారులు మూడు నెలల చందాను రూ.387 చెల్లించడానికి బదులుగా ఇప్పుడు రూ.329 తగ్గింపు ధరతో పొందవచ్చు. కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను స్పెషల్ ఆఫర్‌గా తెలిపింది మరియు ఇది త్వరలో ముగుస్తుందని పేర్కొంది.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలలో భాగంగా వినియోగదారుల యొక్క అన్ని ఆర్డర్‌లకు ఎక్స్‌ప్రెస్ డెలివరీ ఎంపికలు, అదనపు ఛార్జీలు లేకుండా, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌కు అపరిమిత యాక్సిస్ లభిస్తుంది. అంతేకాకుండా బుక్‌వార్మ్‌ల కోసం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రైమ్ రీడింగ్ సభ్యత్వం కూడా ఉంటుంది. ఇక్కడ యూజర్లు అర్హత గల వేలాది అమెజాన్ కిండ్లి శీర్షికలను ఉచితంగా చదవడానికి యాక్సిస్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








