రూ.200కే సంవత్సరమంతా Amazon Prime

అమెజాన్ ప్రైమ్ సర్వీస్ ఇండియాలో లాంచ్ అయి దాదాపుగా సంవత్సరం కావొస్తోంది. ఈ నేపథ్యంలో మరింతమంది కస్టమర్‌లను యాడ్ చేసుకునేందుకు సరికొత్త ఆఫర్లను అమెజాన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసు

అమెజాన్ ప్రైమ్ సర్వీసుల్లో ప్రైమ్ వీడియో సర్వీసును అమెజాన్ ఇండియా డిసెంబర్ 2016లో చేర్చింది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులతో కూడిన అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్‌స్ర్కిప్షన్‌ చందాను రూ.999గా అమెజాన్ ఫిక్స్ చేసింది.

రూ.500 తగ్గింపుతో రూ.499కే..

అయితే, ప్రారంభ ఆఫర్ క్రింద రూ.500 తగ్గింపుతో రూ.499కే ప్రైమ్ సర్వీసును అమెజాన్ ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా లాంచ్ చేసిన కొత్త ఆఫర్ నేపథ్యంలో రూ.200కే అమెజాన్ సబ్‌స్ర్కిప్షన్ పొందే వీలుంటుంది.

అమెజాన్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోవటం ద్వారా

అమెజాన్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోవటం ద్వారా ఆర్డర్స్‌ను వేగంగా పొందటంతో పాటు ప్రైమ్ వీడియో కంటెంట్‌ను సంవత్సరం పాటు అపరిమితగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. యాక్టివ్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను కలిగి ఉన్న యూజర్లు ప్రైమ్ యాప్ ద్వారా టీవీ షోల దగ్గర నుంచి సినిమాల వరకు ఎన్నికావాలంటే అన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 14 నుంచి జూన్ 28లోపు

రూ.200కే అమెజాన్ ప్రైమ్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలనుకునే యూజర్లు జూన్ 14 నుంచి జూన్ 28లోపు తమ అమెజాన్ పే అకౌంట్ ద్వారా రూ.499 అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత క్యాష్‌బ్యాక్ క్రింద రూ.300 వరకు యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ అమెజాన్ కొత్త యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సర్వీసు 60 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Get Amazon Prime subscription at just Rs.200 for a year. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot