Home
Apps

Amazon Prime Videoలో పిల్లల ప్రోగ్రామ్‌లకు ఉచిత యాక్సిస్

కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా పిల్లల టీవీ కార్యక్రమాలు, సినిమాలు మరియు నర్సరీ ప్రాసలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

అమెజాన్ ఒరిజినల్స్

అమెజాన్ ఒరిజినల్స్

అందులో పెప్పా పిగ్, ఇన్స్పెక్టర్ చింగం, కలరి కిడ్స్, చోటా భీమ్ మరియు సూపర్ భీమ్ వంటి వాటితో పాటుగా అమెజాన్ ఒరిజినల్స్ అయిన ది స్టింకీ & డర్టీ షో, జస్ట్ యాడ్ మ్యాజిక్ మరియు ది డేంజరస్ బుక్ ఫర్ బాయ్స్ వంటివి కూడా ఉన్నాయి. వీటి యొక్క లభ్యత కంటెంట్ ప్రాంతాల వారీగా మారుతుంది అని అమెజాన్ తెలిపింది. ఇందులో మరింత కంటెంట్‌కు లైసెన్స్ ఇవ్వడానికి అనేక స్టూడియోలతో కలిసి పనిచేస్తోంది.

అమెజాన్ ప్రైమ్ అకౌంట్

అమెజాన్ ప్రైమ్ అకౌంట్

అమెజాన్ అకౌంట్ ద్వారా ప్రైమ్ వీడియోలో మీరు పిల్లల కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నవారికి అమెజాన్ ప్రైమ్ యొక్క క్రియాశీల ప్రధాన సభ్యత్వం అవసరం లేకుండా అన్ని రకాల కంటెంట్ ను ప్రైమ్ వీడియో యొక్క క్రొత్త ప్రొఫైల్స్ ఫీచర్ తో యాక్సిస్ చేయవచ్చు.

అమెజాన్ ల్యాండింగ్ పేజీ

అమెజాన్ ల్యాండింగ్ పేజీ

అమెజాన్ ఇప్పుడు మీరు ఉచితంగా చూడగలిగే అన్ని అంశాలను చూపించే ల్యాండింగ్ పేజీని ఏర్పాటు చేసింది. ఆ లింక్‌లో ఇది చక్కగా అన్ని రకాల వర్గాలును విభజించబడింది: ప్రీస్కూల్, 6 - 11 సంవత్సరాల పిల్లలు, జనాదరణ పొందిన షోలు మరియు మూవీలు మరియు చివరగా భారతీయ తల్లిదండ్రుల ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రాసల కంటెంట్ క్కూడా ఇందులో ఉన్నాయి

అమెజాన్ ఒరిజినల్స్ కంటెంట్

అమెజాన్ ఒరిజినల్స్ కంటెంట్

నర్సరీ ప్రాసలలో చాలా వరకు చుచు టీవీలో ప్రసారం అవుతున్న కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సినిమా విభాగానికి వస్తే ఇందులో బియాండ్ భీమ్ ఫ్రాంచైజీ, యూర్స్ కిడ్ క్రిష్, టేల్స్ ఆఫ్ శివ, మైటీ రాజు మరియు స్నో క్వీన్ వంటి శీర్షికలు ఉన్నాయి. టీవీ షోలలో రాజు ఆటో-రిక్షా, షెరాజాడే ది అన్‌టోల్డ్ స్టోరీస్, గుడ్డూ ది గ్రేట్, క్యాట్ వర్సెస్ కీట్ మరియు అట్చూ వంటివి ఉన్నాయి. అలాగే ఒరిజినల్స్ విభాగంలో లాస్ట్ ఇన్ ఓజ్, నికో అండ్ ది స్వోర్డ్ ఆఫ్ లైట్, లిటిల్ బిగ్ ఆసమ్, డేంజర్ & ఎగ్స్, కాస్ట్యూమ్ క్వెస్ట్ మరియు నార్మల్ స్ట్రీట్ , గోర్టిమెర్ గిబ్బన్స్ లైఫ్ వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Prime Video Now Offers Free Access to the Children’s Programs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X