గూగుల్ క్రోమ్‌కి సైలెంట్‌గా షాకిచ్చిన అమెజాన్ లైట్ బ్రౌజర్,డౌన్‌లోడ్ చేసుకోండిలా..

|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ రంగంలో దూసుకుపోతున్న గూగుల్ క్రోమ్, మొజిల్లా, యూసీ బ్రౌజర్లకు సైలెంట్ గా షాకిచ్చింది. ఈ దిగ్గజ సంస్థ సైలెంట్ గా తన ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ liteని రిలీజ్ చేసింది. ఈ బ్రౌజర్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతుందని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ బ్రౌజర్ అత్యంత తక్కువ స్పేస్ తీసుకునేలా డిజైన్ చేశారు.ఈ బ్రౌజర్ 2ఎంబి సైజు మాత్రమే తీసుకుంటుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ బ్రౌజర్ ఇతర బ్రౌజర్లు లాగా మీ నుంచి ఎటువంటి డేటాను అడగదు. అలాగే ఎటువంటి అదనపు అనుమతులు కూడా అడగదు.

 

ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయటప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయట

 గూగుల్ ప్లే స్టోర్ నుంచి..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి..

ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ బ్రౌజర్ ఆండ్రాయిడ్ 5.0 మార్ష్ మల్లో దాని పైన వెర్షన్ల మీద మాత్రమే పనిచేస్తుంది. ఇతర వెర్షన్లకు అందుబాటులో లేదు. అయితే ఆండ్రాయిడ్ డివైస్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ న్యూస్..

ట్రెండింగ్ న్యూస్..

ఇతర బ్రౌజర్లు అయిన గూగుల్ క్రోమ్, అమెజాన్ ఇంటర్నెట్ బ్రౌజర్లు హోమ్ పేజీలో ట్రెండింగ్ న్యూస్ అందిస్తున్నాయి. ఇది కూడా అలాగే ట్రెండింగ్ న్యూస్ మీకు అందిస్తుంది. మీరు పుల్ స్క్రీన్ మోడ్ లో కూడా వార్తలను వీక్షించవచ్చు.

బ్రౌజింగ్ ఇతరులకు కనపడకుండా..
 

బ్రౌజింగ్ ఇతరులకు కనపడకుండా..

దీంతో పాటు మీరు ప్రైవేట్ గా ఓపెన్ చేసుకునే సౌకర్యం ఉంది. మీ బ్రౌజింగ్ ఇతరులకు కనపడకుండా దీని ద్వారా మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ 7.0, ఆండ్రాయిడ్ 8.1 వెర్షన్లలో ఇది డౌన్లోడ్ కావడం లేదని TechCrunch రిపోర్ట్ చేసింది. దీనిపై గూగుల్ ప్లే పాయింట్స్ ని ఈమెయిల్ లో సంప్రదించగా అది అమెజాన్ ఇండియా టీమ్ డిజైన్ చేసిందని రిప్లయి ఇచ్చినట్లు TechCrunch తెలిపింది.

 అమెజాన్ తొలి బ్రౌజర్ కాదు.

అమెజాన్ తొలి బ్రౌజర్ కాదు.

కాగా లేటెస్ట్ బ్రౌజర్ యాప్ లైట్ అనేది అమెజాన్ తొలి బ్రౌజర్ కాదు. కంపెనీ ఇంతకుముందు Amazon Kindle Lite app పేరుతో ఓ బ్రౌజర్ ని రిలీజ్ చేసింది. ఇది ఇండియాలో ఇప్పటికే లభ్యమవుతోంది. కాగా ఈ బ్రౌజర్ ఈ బుక్ రీడింగ్ అనుభవాన్ని యూజర్లకు అందిస్తుంది. దీని సైజు కూడా 2 ఎంబి మాత్రమే.

లో డేటాలో కూడా..

లో డేటాలో కూడా..

లో డేటాలో కూడా ఈ బ్రౌజర్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. నెట్ వర్క్ పూర్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ బ్రౌజర్ మీవ ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేసుకోవచ్చు. అమెజాన్ ఇప్పుడు లైట్ వెయిట్ మొబైల్ యాప్స్ ని తయారు చేస్తూ ఇండియా మార్కెట్లో దూసుకుపోతోంది.

లైట్ యాప్ మీద దృష్టి

లైట్ యాప్ మీద దృష్టి

వీటితో పాటు గూగుల్ , పేస్ బుక్ లాంటి దిగ్గజాలు కూడా ఈ లైట్ యాప్ మీద దృష్టిని కేంద్రీకరించాయి. ఫేస్ బుక్ ఇప్పటికే Facebook Lite, Messenger Lite యాప్స్ తో యూజర్లకు మంచి సోషల్ మీడియా అనుభూతిని అందిస్తున్నాయి. తక్కువ డేటాను తీసుకుంటూ ఇవి ముందుకెళుతున్నాయి. గూగుల్ కూడా Gmail Go, Google Go, Google Maps Goలాంటి తక్కువ డేటాను తీసుకునే యాప్స్ ని రిలీజ్ చేసింది. ఇదే బాటలో యూట్యూబ్ కూడా YouTube Goని రిలీజ్ చేసింది. ఇవన్నీ ఆండ్రాయిడ్ ఓరియో మీద ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Releases a 'Lite' Internet Browser for India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X