భారతీయులు అమితంగా ఇష్టపడుతోన్న 6 మొబైల్ యాప్స్ ఇవే!

మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్ విభాగంలో రెండవ అదిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారత్, యాప్ తయారీదారులకు ఓ స్వర్గథామంలా మారిపోయింది.

|

మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్ విభాగంలో రెండవ అదిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారత్, యాప్ తయారీదారులకు ఓ స్వర్గథామంలా మారిపోయింది. ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ యాప్ తయారీ కంపెనీలు సైతం ఇండియా ఫస్ట్ ఫీచర్స్ అలానే లోకల్ కస్టమైజేషన్స్‌తో యూజర్లను ట్రీట్ చేస్తున్నాయి.

 

2017లో ప్రపంచవ్యాప్తంగా 175 బిలియన్ మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్ కాగా వాటిలో 58 బిలియన్ యాప్స్ ఇండియా నుంచి డౌన్‌లోడ్ అయ్యాయి. అత్యథికంగా 65 బిలియన్ యాప్స్ చైనా నుంచి డౌన్‌లోడ్ అవటం విశేషం. మొబైల్ యాప్స్ వినియోగం విషయంలో పరిణితి చెందిన ఇంటర్నెట్ మార్కెట్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న యూఎస్, యూకే, జపాన్, సౌత్ కొరియాలతో పాటు ఎమర్జింగ్ మార్కెట్స్‌గా అవతరించిన బ్రెజిల్, రష్యా ఇంకా ఇండోనేషియాలను భారత్ అధిగమించటం విశేషం.

ప్రముఖ అనలిటిక్స్ సంస్థ App Annie రివీల్ చేసిన వివరాల ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల కాలంగా భారత్‌లో మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్ 215 శాతానికి ఎగబాకాయి. రిలయన్స్ జియో లాంచ్ తరువాత యాప్ డౌన్‌లోడ్స్ ఉధృత రూపం దాల్చాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న ఇంటర్నెట్ ట్రెండ్స్ పై వాల్‌స్ట్రీట్ జర్నల్ మాజీ సెక్యూరిటీ అనలిస్ట్ మేరీ మీకర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ భూగ్రహం మీద ఇంటర్నెట్‌ను విస్తృంగా వినియోగించుకంటోన్న అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్ గుర్తింపుతెచ్చుకుంది.

2018లో చోటుచేసుకున్న మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్‌కు సంబంధించిన వివరాలను App Annieతో పాటు ఇతర రిసెర్చ్ సంస్థలు 2019 ఆరంభంలో విడుదల కాబోతున్నాయి.ఈ నేపథ్యంలో 2018కిగాను భారత్‌లో అత్యంత ప్రజాధరణను సొంతం చేసుకున్న 6 మొబైల్ యాప్స్ వివరాలను మతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. (పాఠకులకు ముఖ్య గమనిక : ఈ స్టోరీలో మేము సూచించబోతోన్న 6 యాప్స్ లిస్టింగ్స్ మాత్రమే. ర్యాంకింగ్స్ కాదు).

ఈ హెడ్‌ఫోన్స్ ధరలు చాలా ఖరీదు బాసూ !ఈ హెడ్‌ఫోన్స్ ధరలు చాలా ఖరీదు బాసూ !

షేరిట్ (SHAREit) యాప్..

షేరిట్ (SHAREit) యాప్..

2018కి గాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో షేరిట్ (SHAREit) ఒకటి. App Annie రివీల్ చేసిన వివరాల ప్రకారం భారతీయుల అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుని 5వ అత్యుత్తమ మొబైల్ యాప్‌గా షేరిట్ (SHAREit) గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఉచిత మైబల్ యాప్ ద్వారా ఫైల్ ట్రాన్స్‌ఫర్‌ను వేగవంతంగా నిర్వహించుకునే వీలుంటంది.

 

 

టిండర్ (Tinder) యాప్..

టిండర్ (Tinder) యాప్..

2018, సెప్టంబర్‌కి గాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో టిండర్ (Tinder) ఒకటి. ఈ డేటింగ్ యాప్‌లో కొత్తగా యాడ్ అయిన ప్రీమియమ్ వెర్షన్ టిండర్ గోల్డ్, ఇండియన్ యూజర్లను మరింతగా ఆకర్షించినట్లు తెలుస్తోంది.

 

 

ట్రుకాలర్ (Truecaller) యాప్..
 

ట్రుకాలర్ (Truecaller) యాప్..

2018కి గాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో ట్రుకాలర్ (Truecaller) ఒకటి. మేరీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయుల అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుని 4వ అత్యుత్తమ మొబైల్ యాప్‌గా ట్రుకాలర్ గుర్తింపు తెచ్చుకుంది. భారత్‌లో ఈ యాప్‌ను 150 మిలియన్లకు పైగా యూజర్లు ఉపయోగించుకుంటున్నట్లు తెలుతోంది. ఈ కాలర్ ఐడీ అప్లికేషన్ రీసెంట్‌గా యూపీఐ ఆధారిత పేమెంట్స్ సర్వీసును కూడా లాంచ్ చేయటం జరిగింది.

 

 

టిక్‌టాక్ (TikTok) యాప్..

టిక్‌టాక్ (TikTok) యాప్..

2018కిగాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో టిక్‌టాక్(TikTok) ఒకటి. Musical.lyకు చెందిన ఈ సోషల్ మీడియా యాప్‌ను ఇటీవలే చైనా యాప్ తయారీదారైన Bytedance కొనుగోలు చేసింది. సిమిలర్ వెబ్ నివేదిక ప్రకారం టిక్‌టాక్ యాప్‌కు భారత్‌లో 1.5కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

 

 

ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player) యాప్..

ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player) యాప్..

2018కిగాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player) యాప్ ఒకటి. కొరియాకు చెందిన ఈ వీడియో ప్లేబ్యాక్ యాప్‌ జూన్ 2018 వరకు గూగుల్ ప్లే స్టోర్, టాప్-10 డౌన్‌లోడెడ్ యాప్స్ జాబితాలో ఉండటం విశేషం. తాజాగా ఈ యాప్‌ను టైమ్స్ ఇంటర్నెట్ (Times Internet) వెయ్యి కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్ చెబుతోన్న దాని ప్రకారం భారత్‌లో ఈ యాప్‌ను ఉపయోగించుకునే మంత్లీ యూజర్ల సంఖ్య 1.75 కోట్లుగా ఉంది.

యూసీ బ్రౌజర్ (UC Browser) యాప్..

యూసీ బ్రౌజర్ (UC Browser) యాప్..

2018కి గాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో యూసీ బ్రౌజర్ (UC Browser) ఒకటి. అలీబాబా గ్రూప్స్‌కు చెందిన ఈ యాప్‌కు భారత్‌లో 10 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. లోకల మొబైల్ బ్రౌజర్ మార్కెట్లో ఈ యాప్ 44 శాతం వాటాను కొల్లగొట్టడం విశేషం.

Best Mobiles in India

English summary
An app a day keeps the country engaged: 6 mobile apps India loved in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X