ఈ యాప్ లతో జాగ్రత్త!! వెంటనే డెలిట్ చేయండి....

|

గూగుల్ తన ప్లే స్టోర్‌ను శుభ్రం చేయడానికి హానికరమైన యాప్ లను తొలగించడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా 15 యాప్ లు హానికరమైనవిగా గుర్తించబడ్డాయి. బ్రిటిష్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ యొక్క సోఫోస్‌లోని ఒక ప్రత్యేక బృందం ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చింది. ఈ సంస్థ గూగుల్‌కు మొత్తం సమాచారం అందించింది గూగుల్ ప్లే స్టోర్ నుండి హానికరమైన యాప్ లను తొలగించింది.

ఆండ్రాయిడ్ మొబైల్

అయితే మీరు వీటిలో దేనినైనా పొరపాటున డౌన్‌లోడ్ చేసి ఉంటే కనుక వాటిని వెంటనే మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయండి. బ్రిటిష్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించిన 15 హానికరమైన యాప్ వివరాలు తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

 

వాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడంవాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడం

15యాప్

హానికరమైన ఈ 15యాప్ లలో ఎక్కువ భాగం ‘ఇమేజ్ ఎడిటర్', ‘బ్యాక్‌గ్రౌండ్ కటౌట్', ‘ఆటోకట్ ఫోటో' మరియు ‘ఆటోకట్ పిక్చర్' వంటి పేర్లతో గల ఫోటో ఎడిటింగ్ యాప్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని మొబైల్‌లో స్కానింగ్ ఫంక్షన్‌ను అందిస్తున్నాయి. మీకు సంబంధించినంతవరకు ఈ పనికిరాని రోగ్ యాప్ లు ఏమైనా ఉన్నాయా అని మీ మొబైల్‌లో ఒకసారి తనిఖీ చేయండి. ఒక వేళ మీరు వీటిని పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే కనుక వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 15 యాప్ లు 2019 జనవరి మరియు జూలై మధ్య కనిపించాయి. మొత్తం మీద వీటిని ఇప్పటికే 1.3 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు..

 

ఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదుఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదు

తొలగించిన15 యాప్ లు

తొలగించిన15 యాప్ లు

ఇమేజ్ మ్యాజిక్,జనరేట్ Elves, సేవ్‌ఎక్సపెన్స్, క్యూఆర్ ఆర్టిఫ్యాక్ట్, ఫైండ్ యువర్ ఫోన్‌, స్కావెంజర్ స్పీడ్, ఆటో కటౌట్ ప్రో, రీడ్ క్యూఆర్ కోడ్, ఫ్లాష్ ఆన్ కాల్స్ & మెసేజ్, ఫోటో బ్యాక్ గ్రౌండ్, ఇమేజ్‌ప్రాసెసింగ్, బ్యాక్ గ్రౌండ్ కటౌట్, బ్యాక్ గ్రౌండ్ కటౌట్ (హాల్టర్‌మోర్ అభివృద్ధి చేసింది), ఆటో కట్ అవుట్ మరియు ఆటో కట్ అవుట్ 2019 మొదలైనవి ఉన్నాయి.

 

ఒపెరా మినీ ద్వారా మొబైల్ డేటా లేకున్న ఫైల్స్ షేర్ చేయవచ్చుఒపెరా మినీ ద్వారా మొబైల్ డేటా లేకున్న ఫైల్స్ షేర్ చేయవచ్చు

యాప్ లు & నోటిఫికేషన్

పరిశోధనా బృందం గుర్తించినట్లు ఈ యాప్ ల నుండి వచ్చే ప్రమాదం అవి అంత తేలికగా చూపించవు. సాధారణంగా గేర్ ఆకారంలో ఉన్న సెట్టింగుల చిహ్నాన్ని నొక్కండి. తరువాత యాప్ లు & నోటిఫికేషన్ల పేజీకి వెళ్లడం మీకు ఉత్తమ మార్గం. మీ ఫోన్‌లో ఇటీవల ఉపయోగించిన యాప్ ల విభాగంలో పైన పేర్కొన్న 15 యాప్ లలో దేనినైనా మీరు కనుగొంటే కనుక వెంటనే దానిని క్లోజ్ చేసి ఆపై వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఈ హానికరమైన యాప్ లలో కొన్ని మీ ప్రైవేట్ డేటాను నేరుగా దొంగలించగలవు.

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీసెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఆండ్రాయిడ్ ఫోన్

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఏవైనా యాప్ లు ఉచితంగా లభిస్తున్నాయని వాటిని డౌన్‌లోడ్ చేయకూడదు. యాప్ ను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఖర్చు చేసి ఉంటారు అది మీకు ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వరు. యాప్ లలో ప్రకటనలు ఉంటాయి ఈ ప్రకటనలు చాలా
ఖరీదైనవి మరియు ప్రమాదకరమైనవి. కొంతమంది ప్రకటనదారులు వారి ప్రకటనలలో హానికరమైన కంటెంట్‌ను ప్రయోగిస్తారు. ఇది మీ మొబైల్‌ను త్వరగా యాక్సిస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు మీ మొబైల్‌లో పొరపాటున బ్యాంకింగ్ కు సంబందించిన సమాచారం వంటి వ్యక్తిగత డేటాను ఉంచినట్లయితే ఇటువంటి యాప్ లను డౌన్‌లోడ్ చేసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Best Mobiles in India

English summary
Android Alert: Uninstall These 15 Dangerous Apps on Your Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X