ఆండ్రాయిడ్ నుండి PCకి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్
కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన స్మార్ట్‌ఫోన్ రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటోంది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న ఈ పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ కంప్యూటర్ తరహాలో అన్ని రకాల సర్వ
కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన స్మార్ట్‌ఫోన్ రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటోంది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న ఈ పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ కంప్యూటర్ తరహాలో అన్ని రకాల సర్వీసులను ఆఫర్ చేస్తోంది. కంప్యూటర్ స్క్రీన్ తో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉండటంతో వీడియోలను చూసే విషయంలో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఫోన్‌లలోని మీడియా ఫైళ్లను కంప్యూటర్‌లోకి షేర్ చేసుకోవాలనిపిస్తోంది.గతంలో ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫైళ్లను మరో కంప్యూటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే యూఎస్బీ కేబుల్ ఒక్కట దిక్కయ్యేది. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ రెండు డివైస్‌ల మధ్య ఫొటోలు ఇంకా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి...

AirDroid
ఈ AirDroid యాప్ ద్వారా ఈ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అనేది మరింత సులువుగా పూర్తవుతోంది.ఈ యాప్ లో స్పెషల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇందులో మీ PC నుండి SMS / MMS ను పంపడం మరియు స్వీకరించడం వంటివి కూడా చేయవచ్చు. అలాగే మీ డివైస్ యొక్క నోటిఫికేషన్లు కూడా చూడవచ్చు.

Cloud Storage
Cloud Storage యాప్ ద్వారా ఫైల్స్ ను చాలా సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. Dropbox, Google Drive, OneDrive, Box.com వంటి సర్వీసెస్ ఏ యాప్ లో చాలా ఉన్నాయి.

Feem
ఈ Feem యాప్ ద్వారా ఆండ్రాయిడ్ నుండి PC కి ఫైల్స్ ను చాలా సింపుల్ గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయబడిన డివైజ్స్ ద్వారా ఫైల్స్ ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది .

Pushbullet
ఈ Pushbullet యాప్ ద్వారా ఈ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అనేది మరింత సులువుగా పూర్తవుతోంది.ఈ యాప్ లో స్పెషల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇందులో మీ PC నుండి SMS / MMS ను పంపడం మరియు స్వీకరించడం వంటివి కూడా చేయవచ్చు.

Resilio Sync
ఈ Resilio Sync (formerly BitTorrent Sync)యాప్ ఒక వైల్డ్ కార్డ్ లాంటిది. ఇది క్లౌడ్ స్టోరేజ్ లాగా పని చేస్తుంది. ఇందులో మీకు ఎంత డేటా కావాలంటే అంత డేటా ను సింక్ చేసి ఫైల్స్ ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది Mac, Linux మరియు Windows కు కూడా సపోర్ట్ చేయాలి.


Click it and Unblock the Notifications








