సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరింత కొత్తదనాన్ని పంచే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ సెర్చ్ యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేసే ప్రయత్నం చేస్తోంది.

By GizBot Bureau
|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరింత కొత్తదనాన్ని పంచే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ సెర్చ్ యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. డీపర్ ఇంప్లిమెంటేషన్‌తో కనిపిస్తోన్నఈ రీడిజైన్ ప్రాసెస్ సరికొత్త మెటీరియల్ డిజైన్‌ను తెరపైకి తీసుకువచ్చేలా ఉంది. ప్రస్తుతానికి టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్న ఈ అప్‌డేట్ ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

న్యూలుక్‌లో సెర్చ్ బార్...

న్యూలుక్‌లో సెర్చ్ బార్...

9to5Mac వెబ్‌సైట్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం ఈ కొత్త డిజైన్‌లో సెర్చ్ బార్ అనేది న్యూలుక్‌లో దర్శనమిస్తోంది. దీంతో పాటు కొన్ని మైనర్ మార్పులు కూడా సెర్చ్ యాప్‌లో కనిపిస్తున్నాయి. కొత్త ఇంటర్‌ఫేస్ విషయానికి వచ్చేసరికి, సెర్చ్ బార్‌ దీర్ఘచతురస్రాకార ఆకారానికి బదులుగా బదులు గుండ్రటి పిల్ ఆకారంలో కనిపిస్తోంది.

 

 

న్యూస్ కార్డ్స్ ప్రత్యేకమైన బబ్బుల్ తరహా డిజైన్‌లో..

న్యూస్ కార్డ్స్ ప్రత్యేకమైన బబ్బుల్ తరహా డిజైన్‌లో..

ఇక మైనర్ మార్పుల విషయానికి వచ్చేసరికి సెర్చ్ బార్‌కు సంబంధించిన ఫెయింట్ బౌండరీకి షాడో అనేదే లేకుండా క్లీన్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక గూగుల్ ఫీడ్ విషయానికి వచ్చేసరికి న్యూస్ కార్డ్స్ ప్రత్యేకమైన బబ్బుల్ తరహా డిజైన్‌లో కనిపిస్తున్నాయి. న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన ఫోటో ప్రివ్యూను గుండ్రటి సర్కిల్‌లో చూపిస్తోంది.

Google Sansలోకి న్యూస్ ఫాంట్స్..
 

Google Sansలోకి న్యూస్ ఫాంట్స్..

న్యూస్ కంటెంట్‌కు సంబంధించిన ఫాంట్స్ కూడా Google Sansలోకి ఛేంజ్ చేసి ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కూడిన న్యూస్ ఫీడ్‌ను కొందరి యూజర్లకు గూగల్ ఇప్పటికే రోల్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజల క్రితమే తన గూగల్ అకౌంట్‌లకు సంబంధించిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను గూగుల్ పూర్తిగా అప్‌డేట్ చేసింది.

రిజల్ట్స్‌ను స్క్రీన్  షాట్స్ రూపంలో భద్రపరచుకోవచ్చు..

రిజల్ట్స్‌ను స్క్రీన్ షాట్స్ రూపంలో భద్రపరచుకోవచ్చు..

గూగుల్ కొన్ని నెలల క్రితం తన సెర్చ్ యాప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆ అప్‌డేట్ తరువాత నుంచి మీరు గమనించినట్లయితే, యూజర్ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన రిజల్ట్స్‌ను స్క్రీన్ షాట్స్ రూపంలో గూగల్ భద్రపరచటం మొదలుపెట్టింది. ఈ స్క్రీన్ షాట్స్‌ను మీరు చూడాలనుకుంటున్నట్లయితే గూగుల్ సెర్చ్ యాప్‌లోకి వెళ్లి, మెయిన్ స్క్రీన్ క్రింది భాగంలో కనిపించే క్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే, మీ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కనిపిస్తాయి.

స్క్రీన్ షాట్‌లను   ప్రైవసీ ముప్పుగా భావిస్తోన్నట్లయితే..

స్క్రీన్ షాట్‌లను ప్రైవసీ ముప్పుగా భావిస్తోన్నట్లయితే..

మీకు కావల్సిన తేదీకి సంబంధించిన సెర్చ్ హిస్టరీని ఇక్కడ పొందే వీలుంటుంది. గూగుల్ అందిస్తోన్న ఈ ఫీచర్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఫీచర్‌ను బేష్ అంటుంటే, మరికొందరు మాత్రం ప్రైవసీకి పెద్ద ముప్పు అని చెబుతున్నారు. గూగల్ సెర్చ్ యాప్‌లో సేవ్ కాబడుతోన్న ఈ స్క్రీన్ షాట్‌లను ప్రైవసీ ముప్పుగా భావిస్తోన్న యూజర్లు ఓ సింపుల్ హ్యాక్‌ను ప్రయోగించటం ద్వారా స్క్రీన్ షాట్‌లను డిసేబుల్ చేయటంతో పాటు డిలీట్ కూడా చేయవచ్చు. స్క్రీన్ షాట్‌లను డిలీట్ చేసే క్రమంలో ముందుగా గూగల్ సెర్చ్ యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్క్రీన్ పై కనిపించే హిస్టరీ ఐకాన్ పై టాప్ చేయండి. వెంటనే గత ఏడు రోజులకు సంబంధించిన సెర్చ్ ఫలితాలు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఒక్కో స్క్రీన్ షాట్‌ను స్వైప్ అప్ చేయటం ద్వారా అవి డిలీట్ కాబడతాయి.

Best Mobiles in India

English summary
Its looks like Google is testing yet another redesigned interface for its search app. The redesign is seen with deeper implementation of ‘Material Design’ theme.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X