వాట్సప్ అదిరే ఫీచర్, నంబర్ మారిస్తే ఇకపై అందరికీ మెసేజ్..
రోజురోజుకి కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకురాబోతోంది.
రోజురోజుకి కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకురాబోతోంది. ఇకపై మీరు మీ వాట్సప్ నంబర్ మారిందని అందరికీ చెప్పనవసరం లేదు.మీరు నంబర్ మారిస్తే అది మీ స్నేహితులందరికీ తెలిసేలా వాట్సప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

ఈ కీలక అప్‌డేట్ త్వరలో రాబోతోంది. వాట్సప్ లేటెస్ట్ బీటా వర్సన్ ఈ సరికొత్త ఫీచర్ ని పరిచయం చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఐవోఎస్ యూజర్లు మాత్రం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

మీ నంబర్ ఎవరికి ఇవ్వాలో..
ఈ ఫీచర్లో మీరు మీ నంబర్ ఎవరికి ఇవ్వాలో అలాగే ఎవరికి ఇవ్వకూడదో అనే విషయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అందులో ఉండే ఫీచర్ ద్వారా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు.

యాప్ సైజ్..
ఈ ఫీచర్ ద్వారా మరో కొత్త అప్‌డేట్ మిమ్మల్ని పలకరించనుంది. ఈ ఫీచర్ ద్వారా యాప్ సైజ్ కూడా తగ్గనుంది. మొత్తంగా 6 ఎంబి సైజ్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా మీ మొబైల్లో స్పేస్ మరింతగా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

473 మైనర్ ఎర్రర్స్
ఈ యాప్‌లో ఉన్న దాదాపు 473 మైనర్ ఎర్రర్స్ ని ఫిక్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

వాట్సప్ లైవ్ లోకేషన్ ఫీచర్
కంపెనీ లేటెస్ట్ గా వాట్సప్ లైవ్ లోకేషన్ ఫీచర్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ లొకేషన్ వివరాలను మీ స్నేహితులకు గాని అలాగే బంధువులకు గాని తెలియజేయవచ్చు.

1 గంట లేదా 8 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ..
15 నిమిషాలు, 1 గంట లేదా 8 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాట్సాప్ యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








