Home
Apps

వాట్సప్ గ్రూపులకు ఇది నిజంగా చేదులాంటి వార్తే

ఈ వీడియో చూస్తే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేస్తారువాట్సప్..ఈ పదం ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.

ఈ వీడియో చూస్తే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేస్తారువాట్సప్..ఈ పదం ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. వాట్సప్ గ్రూపులు వచ్చిన తరువాత యూజర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. తమ పర్మిషన్ లేకుండానే ఏ గ్రూపులో పడితే ఆ గ్రూపులో యాడ్ చేస్తున్నారు. దీంతో వారు ఏం చేయలేక సైలెంటుగా బయటకు వస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా పోర్న్ గ్రూపుల్లో యాడ్ చేయడం కూడా కలవరపరుస్తోంది. దీనికి ఇప్పుడు ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ఇకపై గ్రూపుల్లో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే వారి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. పూర్తి వివరాల్లోకెళితే..

కేంద్ర ప్రభుత్వ విభాగం

కేంద్ర ప్రభుత్వ విభాగం

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని శాఖలకు చాలామంది వాట్సప్ వినియోగదారులు గ్రూపుల్లో తమ పర్మిషన్ లేకుండా యాడ్ చేయంపై మండిపడుతూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ విభాగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

వాట్సప్ కి ఆదేశాలు జారీ

వాట్సప్ కి ఆదేశాలు జారీ

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాట్సప్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల అనుమతి లేకుండా గ్రూపుల్లో యాడ్ చేయకూడదని, వారి పర్మిషన్ తోనే గ్రూపుల్లో యాడ్ చేసేలా కొత్త ఫీచర్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

 

 

కట్టడి చేసేలా చర్యలు

కట్టడి చేసేలా చర్యలు

ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే పోర్న్ గ్రూపుల్లో తమ నెంబరును యాడ్ చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ మధ్య ఈ విషయం మీద పోలీసులకు కంప్లయిట్లు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది.

 

 

వాట్సప్ ఏం చెబుతోంది

వాట్సప్ ఏం చెబుతోంది

అయితే ఈ విషయంపై వాట్సప్ కూడా సమాధానం ఇచ్చింది. ఎవరైతే గ్రూపులో వేరేవారిని యాడ్ చేస్తారో వారు యాడ్ చేసే వ్యక్తి స్నేహితుల లిస్టులో తప్పక ఉంటారని, వారి నంబరు ఆ స్నేహితుని ఫోన్ బుక్ లో సేవ్ అయి ఉంటుందని ఇది తమ పాలసీ అని చెబుతోంది. గ్రూప నుంచి ఓ వ్యక్తి రెండు సార్లు బయటకు వచ్చిన తరువాత మళ్లీ యాడ్ చేయలేరని తెలిపింది.

2019 ఎన్నికల నేపథ్యంలో...

2019 ఎన్నికల నేపథ్యంలో...

కాగా వచ్చే ఏడాది ఎన్నికల సార్వత్రిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాట్సప్ ద్వారా జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను వినియోగించుకునేందుకు రెడీ అయింది.

Best Mobiles in India

English summary
Annoyed of WhatsApp groups? Govt might have a plan to rescue you More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X