వాట్సాప్ బిజినెస్‌కు పోటీగా యాపిల్ చాట్

Posted By: BOMMU SIVANJANEYULU

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్, చిన్నా మధ్యతరహా వ్యాపారస్థుల కోసం తన సరికొత్త బిజినెస్ వర్షన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే. వాట్సాన్ బిజినెస్ పేరుతో లభ్యమవుతోన్న లభ్యమవుతోన్న ఈ అప్లికేషన్ ప్రస్తుతానికైతే సెలక్టెడ్ మార్కట్లలో మాత్రమే లభ్యమవుతోంది.

వాట్సాప్ బిజినెస్‌కు పోటీగా యాపిల్ చాట్

ఈ నేపథ్యంలో వాట్సాప్ బిజినెస్ అలానే ఫేస్‌బుక్ మెసెంజర్‌లకు పోటీగా సరికొత్త 'బిజినెస్ చాట్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఐమెసేజ్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీసులో పొందుపరచబడే ఈ ఫీచర్ ద్వారా బిజినెస్ పీపుల్‌తో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసేందుకు వీలుంటుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iOS 11.3 బేటా వర్షన్ అప్‌డేట్ ద్వారా పబ్లిక్‌కు..

‘బిజినెస్ చాట్'ను iOS 11.3 బేటా వర్షన్ అప్‌డేట్ ద్వారా పబ్లిక్‌కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు యాపిల్ తెలిపింది. తొలత ఈ ఫీచర్‌ను 2017 వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా యాపిల్ అనౌన్స్ చేసింది. డిస్కవర్, హిల్టన్‌లవ్, వెల్స్‌ఫార్గో వంటి సెలెక్టెడ్ బిజినెస్‌లకు ఈ సర్వీస్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

యాపిల్ పే ద్వారా చెల్లింపులు..

బిజినెస్ చాట్ ద్వారా యాపిల్ యూజర్లు బిజినెస్ పీపుల్‌ను సులువుగా రీచ్ అవటంతో పాటు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి యాపిల్ పే ద్వారా చెల్లింపులు చేపట్టే వీలుంటుంది. బిజినెస్ చాట్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి ఇక్కడ పూర్తి భద్రత ఉంటుందని, ఇదే సమయంలో చాట్‌ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలిగవచ్చని యాపిల్ తెలిపింది.

నిల్సన్ సర్వేలో ఆసక్తికర విషయాలు..

ఇటీవల ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిల్సన్ సర్వేలో భాగంగా 63శాతం యూజర్లు మెసేజింగ్ ద్వారా తమ వ్యాపారాలను అభవృద్ధి చేసుకున్నట్లు తేలింది. ఒక్క 2017లోనే 330 మిలియన్ల యూజర్లు మెసెంజర్ ద్వారా చిన్న బిజినెస్‌లకు కనెక్ట్ అయినట్లు వెల్లడైంది. మరో దేశంలో ఏకంగా 120 కోట్ల మంది యూజర్లు ఫేస్‌బుక్ ద్వారా చిన్న బిజినెస్‌లకు కనెక్ట్ అయినట్లు నెల్సన్ సర్వే తెలిపింది.

ఆపిల్ నుంచి ఒకేసారి మూడు ఐఫోన్లు, భారీ డిస్‌ప్లే, బడ్జెట్ ధర..

వ్యాపారాభివృద్ధికి వాట్సాప్ తోడ్పాటు..

ఇక ఇండియా విషయానికి వచ్చేసరికి 250 మిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్ ద్వారా స్మాల్ ఇంకా మీడియమ్ బిజినెస్‌లతో కనెక్ట్ అయినట్లు సర్వే తెలిపింది. భారత్‌లో ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేస్తోన్న 84శాతం చిన్నా ఇంకా మధ్యతరహా వ్యాపార సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికి వాట్సాప్ కూడా తొడ్పడగలదని భావిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైండి.

ప్రస్తుతానికి ఆ దేశాల్లో మాత్రమే..

వాట్సాప్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన "WhatsApp Business" ప్రస్తుతానికి మిక్సికో, ఇండోనేషియా, ఇటలీ, యూకే ఇంకా యూఎస్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. అక్కడి వ్యాపారులు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. భారత్‌లో ఈ సర్వీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య 200 మిలియన్లుగా ఉంది. వాట్సాప్ యూజర్లు అత్యధికంగా ఉన్న భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో వాట్సాప్ బిజినెస్ మరింత ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

వెరిఫైడ్ ప్రొఫైల్‌ అకౌంట్స్..

అంతేకాకుండా, కస్టమర్‌లు కూడా వాట్సాప్ ద్వారా తమకు కావల్సిన వస్తువు లేదా సర్వీసుకు సంబంధించి ఆయా వ్యాపార సంస్థలతో సంప్రదింపులు జరిపే వీలుటుంది. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్‌లకు గ్రీన్ టిక్‌తో కూడిన వెరిఫైడ్ ప్రొఫైల్‌ కేటాయించబడుతుంది. ఈ ప్రొఫైల్‌లో కస్టమర్ సర్వీస్ నెంబర్‌తో పాటు కంపెనీ అడ్రస్ ఇంకా వెబ్‌సైట్ లింక్స్ కనిపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In a bid to take on WhatsApp Business and Facebook Messenger, Apple is set to introduce "Business Chat" for its users to communicate directly with businesses right within its iMessage instant messaging service.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot