Home
Apps

ఆపిల్ కొత్త ఓఎస్‌లో ఈ పదాలు స్వైప్ చేస్తే కరెక్ట్ పదాలు రావు

By Gizbot Bureau

ఆపిల్ సంస్థ ప్రతి ఏటా కొత్త ఓఎస్ ఆరేటింగ్ సిస్టంను విడుదల చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ ఏడాది కూడా ఐఓఎస్ 13 పేరుతో నూతన ఆపరేటింగ్ సిస్టంను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే తమ ఐఫోన్లలో చాలామంది యూజర్లు ఈ ఐఓఎస్ 13ని అప్ డేట్ చేసుకున్నారు. ఈ ఓఎస్ లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది.

స్వైప్ కీబోర్డు

అయితే ఇందులో అతి ముఖ్యమైన ఫీచర్ స్వైప్ కీబోర్డుగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం మీద ఉన్న కీబోర్డుకు పోటీగా ఈ ఫీచర్‌ని తీసుకువచ్చింది. ఈ ఓఎస్ లో క్విక్ టైప్ అనే ఆప్సన్ చాలా పాపులర్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ ఫీచర్ లో ఓ లోపం ఉందని తెలుస్తోంది. ఈ కీబోర్డులో యూజర్లు Hot Chocolate అని స్వైప్ చేస్తే అది స్పెల్లింగ్ తప్పుగా చూపిస్తోంది.

 

స్పెల్లింగ్ మిస్టేక్

స్పెల్లింగ్ మిస్టేక్

యూజర్లు Hot Chocolate అని స్వైప్ చేస్తే అది కొన్ని పదాలను చూపిస్తుందే కాని కరెక్ట్ స్పెల్లింగ్ చూపించడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్నిఓ యూజర్ రెడ్డిట్ లో తెలిపారు. Hot Chocolate పదాన్ని స్వైప్ చేయడం ద్వారా యూజర్ కి Hoot chocolate, horticulture, Buck it, Got chocolate, hoppy chocolate, joy chocolate ఇంకా ఇతర పదాలు కనిపిస్తున్నాయే కాని అసలైన పదం కనిపించడం లేదు.

 

ఆటో కరెక్ట్ ఫీచర్

ఆటో కరెక్ట్ ఫీచర్

యూజర్లు ఆటో కరెక్ట్ ఫీచర్ ఆపివేసినప్పటికీ కరెక్ట్ పదం రావడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా కరెక్ట్ పదం రాబట్టుకోవాలనుకున్న వారికి నిరాశే ఎదురయింది. కాగా ఓ యూజర్ దీనికి వేరే విధంగా సమాధానం చెప్పాడు. తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించారు.

 

ఈ పదాలు కూడా రావడం లేదు

ఈ పదాలు కూడా రావడం లేదు

Kill అనే పదం స్వైప్ చేసిన తరువాత ‘herself'Himself లాంటి పదాలు కూడా ఈ కీబోర్డులో స్వైప్ ద్వారా చేయలేరట. వాటితో పాటుగా murder', ‘ammo' and ‘bullets' లాంటి పదాలను కూడా మీరు స్వైప్ చేయలేరు. దీనిని బట్టి మీరు Hot Chocolate ఎందుకు స్వైప్ కావడం లేదనేది అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది.

 

 

 

 స్వైప్ వదిలేయడమే

స్వైప్ వదిలేయడమే

కాగా యూజర్లు ఈ పదాలను పొందాలంటే స్వైప్ చేయకుండా నేరుగా కీ బోర్డ్ మీద టైప్ చేస్తే సరిపోతుంది. స్వైప్ కీబోర్డు కన్నా ఇది చాలా మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే Hot ఒకసారి స్పేస్ ఇచ్చి Chocolate అని టైప్ చేస్తే పరిష్కారం దొరుకుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iphones Running This Os Can't Spell Hot Chocolate Correctly
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X