Home
Apps

ఆండ్రాయిడ్‌ యూజర్‌లకు గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఆపిల్‌ టీవీ యాప్‌..!

ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపిల్‌ టీవీ యాప్‌ను (Apple TV App) ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 10 లేదా తర్వాత వెర్షన్‌ లపై పనిచేసే డివైజ్‌లకు ఈ యాప్‌ సపోర్టు చేస్తుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. మరియు గూగుల్‌ ప్లే అకౌంట్ ద్వారా ఆపిల్‌ TV+, MLS సీజన్‌ పాస్‌లను యూజర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది.

న్యూస్‌రూం పోస్ట్‌లో కీలక వివరాలు :
యాప్‌ విడుదల చేసిన ఐదు సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. యూజర్లు ఇప్పటికే ఉన్న అకౌంట్ లేదా కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని వినియోగించుకోవచ్చని టెక్‌ దిగ్గజం వెల్లడించింది. గూగుల్‌ ప్లేలో ఆపిల్‌ టీవీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని న్యూస్‌రూం పోస్ట్‌లో రాసుకొచ్చింది.

apple rolling out apple TV app for android users

పూర్తిస్థాయిలో వచ్చేందుకు మరికొంత సమయం :
ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో ఆపిల్ డివైజ్‌ లేదా స్మార్ట్‌ టీవీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. తాజా నిర్ణయంతో ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

అనేక ఫీచర్‌లు :
స్ట్రీమింగ్‌ కోసం నెలకు రూ.99 చెల్లించాలి. MLS సీజన్ పాస్‌ల కోసం నెలకు రూ.1299 లేదా పూర్తి సీజన్ కోసం రూ.7000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్‌ యూజర్‌ల కోసం అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. కంటిన్యూ వాచింగ్‌. వాచ్‌లిస్ట్‌ లాంటి ఫీచర్‌లు ఆపిల్‌ టీవీ యాప్‌లో ఉన్నాయి.

ఆఫ్‌లైన్‌ వాచింగ్ కోసం :
ఈ యాప్‌ నుంచి ఆఫ్‌లైన్‌ వాచింగ్ కోసం కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ఏడు రోజుల ఉచిత ట్రయల్‌తో ఆపిల్‌ TV+ ను ఉపయోగించుకోవచ్చు. ఐక్లౌడ్‌ అకౌంట్‌తో ఆండ్రాయిడ్‌ యూజర్లు లాగిన్‌ కావచ్చు. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలో స్లో హార్సెస్‌, ది ‌మార్నింగ్‌ షో, ష్రింకింగ్‌, హైజాక్, సెవెరెన్స్‌, లూట్‌, పామ్ రాయల్‌, మాస్టర్స్ ఆఫ్‌ ది ఎయిర్‌ వంటి అనేక షోలు అందుబాటులో ఉన్నాయి.

యాప్‌ స్టోర్ యాక్సెస్‌ :
ఆపిల్‌ టీవీ యాప్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్రైడే నైట్‌ బేస్‌బాల్‌ ను లైవ్‌ చూడవచ్చు. అయితే సినిమాలు, ఇతర షోలు అద్దె లేదా కొనుగోలు చేయడానికి యాప్‌ స్టోర్‌ యాక్సెస్‌ ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఆపిల్‌ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తున్నా.. ఇతర మార్కెట్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుందని తెలుస్తోంది.

స్ట్రీమింగ్ మార్కెట్‌ విస్తరణ :
ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్ట్రీమింగ్ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త డివైజ్‌ల అవసరం లేకుండా ఆపిల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది. ఆపిల్‌ కంటెంట్‌పై ఆసక్తి ఉన్న ప్రేక్షకులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత నెలలో యాపిల్‌ స్టోర్‌ యాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. యూజర్ల సౌలభ్యం కోసమే యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ యాప్‌ ద్వారా హోం డెలివరీతోపాటు మరెన్నో ఫీచర్‌లు, సర్వీసులు పొందవచ్చని విడుదల సమయంలో ఆపిల్‌ తెలిపింది. సేల్స్‌ను పెంచుకొనేందుకు, తమ ప్రొడక్ట్స్‌ను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఆ యాప్‌ను తీసుకొచ్చింది.

ఆపిల్‌ స్టోర్‌ యాప్ ద్వారా.. ఆపిల్‌ ట్రేడ్ ఇన్‌, ఫైనాన్సింగ్ ఆప్షన్‌ వంటి కీలకమైన రిటైల్‌ ప్రోగ్రామ్‌ల వివరాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొత్త ఉత్పత్తులు, రిటైల్‌ ప్రోగ్రాంల అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఈ యాప్‌లో కస్టమైజ్‌ డివైజ్‌లను ఆర్డర్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
apple rolling out apple TV app for android users here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X