Apple TV appల మద్దతుతో LG టీవీలు.. వినియోగదారులకు ఇక పండగే!
ఆపిల్ టీవీ యాప్ మరియు ఆపిల్ టీవీ + సర్వీసులు అన్ని ఇప్పుడు 2019 LG టీవీల్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ యొక్క కొత్త టీవీ యాప్స్ మరియు వాటి స్ట్రీమింగ్ సర్వీస్ తోక సేవలు ఇప్పుడు 80 కి పైగా దేశాలలో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

LG - ఆపిల్ టీవీ
జనవరి CES 2020 లో కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG ఆపిల్ టీవీ యాప్‌తో తన 2020 స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది తన గత సంవత్సరంలో విడుదల అయిన దాని టీవీ మోడళ్లకు కూడా ఆపిల్ టీవీ యాప్ లను తీసుకువస్తోంది. కొత్త యాప్ LG హోమ్ లాంచర్ నుండి అన్ని టీవీ మోడళ్లలో వీటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఆపిల్ టీవీ యాప్ LG టీవీ యజమానులకు ఆపిల్ టీవీ + స్ట్రీమింగ్ సర్వీసుకు సభ్యత్వాన్ని ఇస్తుంది.

సబ్స్క్రిప్షన్ సర్వీసు
కొత్త వీడియో సబ్స్క్రిప్షన్ సర్వీసులో ది మార్నింగ్ షో, See, సర్వెంట్ మరియు లిటిల్ అమెరికా వంటి ప్రసిద్ధ ఆపిల్ ఒరిజినల్స్ షోలు ఉన్నాయి. LG టీవీ యూజర్స్ ఆపిల్ టీవీ యాప్‌తో ఆపిల్ టీవీ ఛానెల్‌లకు సబ్స్క్రిప్షన్ ను పొందగలుగుతారు. ప్రీమియం వీడియో సేవల కొరకు ప్రత్యక్ష చందాలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇవి ప్రకటన రహిత మరియు ఆన్ డిమాండ్ యాక్సెస్‌ను కూడా అందిస్థాయి. ఎల్జీ టీవీ యూజర్స్ తమ ఐట్యూన్స్ వీడియో లైబ్రరీని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా 1,00,000 సినిమాలు మరియు టీవీ షోలను కొనవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు.

LG మ్యాజిక్ రిమోట్
LG యొక్క మ్యాజిక్ రిమోట్ ద్వారా ఆపిల్ టీవీ యాప్ లను ప్రారంభించవచ్చు అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపిల్ ఎయిర్‌ప్లే 2 కి LG యొక్క మద్దతు జోడించిన తర్వాత ఆపిల్ టీవీ యాప్ లను ఈ టీవీలలో యాక్సిస్ చేయవచ్చు. ఎయిర్‌ప్లే 2 తో LG టీవీ యజమానులు తమ ఐఫోన్, ఐప్యాడ్ లేదా మాక్ నుండి నేరుగా తమ టెలివిజన్‌కు కంటెంట్‌ను షేర్ చేయవచ్చు లేదా ప్లే చేయవచ్చు.

ఆపిల్ హోమ్‌కిట్
వినియోగదారులు తమ టీవీలో సంగీతాన్ని కూడా ప్లే చేయవచ్చు మరియు వారి ఇంటిలోని ఇతర ఎయిర్‌ప్లే 2 అనుకూల స్పీకర్లతో కూడా అనుసందానించవచ్చు. LG సంస్థ ఆపిల్ హోమ్‌కిట్‌కు కూడా తన మద్దతును జోడించింది. ఇది వినియోగదారులను వారి ఆపిల్ డివైస్ లో హోమ్ యాప్ తో వారి టీవీని సులభంగా మరియు సురక్షితంగా నియంత్రించడానికి అనుమతిస్తుంది.

LG టీవీలు
కొత్త అప్ డేట్ తో LG టీవీ కస్టమర్లు ఎయిర్‌ప్లే 2, హోమ్‌కిట్‌లతో పాటు ఆపిల్ టీవీని కూడా ఉపయోగించుకోగలుగుతారు. LG యొక్క 2019 OLED TV లు, నానోసెల్ TV లు (సిరీస్ SM9X మరియు SM8X) లలో ఈ సేవలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ టీవీ యాప్ ఈ నెల చివరిలో ఎంపిక చేసిన UHD (సిరీస్ UM7X మరియు UM6X) టివిలలో అందుబాటులో ఉంటుందని LG సంస్థ వెల్లడించింది. OTA ఫర్మ్‌వేర్ అప్ డేట్ ద్వారా ఈ ఏడాది చివర్లో ఆపిల్ సేవలను 2018 సంవత్సరంలో విడుదల అయిన టీవీలకు కూడా తీసుకురావాలని LG యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








