వాట్సాప్ కు పోటీగా ఏమేం యాప్స్ ఉన్నాయో తెలుసా?
వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు వాడుతున్న instant మెసేజింగ్ యాప్ .
వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు వాడుతున్న instant మెసేజింగ్ యాప్ . పేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసాక ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే మరి గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని వందల కోట్ల యాప్స్ ఉన్న అసలు వాట్సాప్ కు పోటీ వచ్చే యాప్స్ ఏవి లెవా అందులో ఉన్న ఫీచర్లను పోలిన ఇతర యాప్స్ మారేవి లెవా అంటే అది పొరబాటే ఎందుకంటే వాట్సాప్ కు మించిన ఫీచర్లను అందిస్తున్న యాప్స్ కూడా అందుబాటు లో ఉన్నాయి. ఈ శీర్షిక లో భాగంగా వాట్సాప్ కు పోటీ వచ్చే యాప్స్ ఏవో మీకు తెలుపుతున్నాం.

HIKE Messenger
HIKE Messenger యాప్ ఇండియాకు చెందినదే .వాట్సాప్ లో ఉన్న ఫీచర్లు ఇందులో కూడ ఉన్నాయి . ఆండ్రాయిడ్, iOS మరియు విండోస్ మొబైల్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది.స్టోరేజ్,కెమెరా, లైవ్ ఫిల్టర్స్ అనే కొత్త ఫీచర్లు ఇందులో యాడ్ చేసారు.

FACEBOOK Messenger
FACEBOOK Messenger మరియు వాట్సాప్ రెండు FACEBOOK వే అయినప్పటికీ ఈ రెండు యాప్ లను యూజర్లు వాడుతున్నారు.వాట్సాప్ లో ఉన్న ఫీచర్లన్నీ FACEBOOK Messenger లో కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్,iOS ప్లాట్ ఫార్మ్స్ పై FACEBOOK Messenger లభిస్తుంది.

LINE
ఈ LINE యాప్ కూడా వాట్సాప్ అందిస్తున్న ఫీచర్లనే యూజర్లకు అందిస్తుంది. టైమ్ లైన్ కూపన్స్ ,వీడియో స్నాపింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దాదాపుగా 1జీబీ సైజు ఉన్న ఫైల్స్ ను ఇందులో షేర్ చేసుకోవచ్చు.అదే వాట్సాప్ లో అయితే ఇంత సైజు ఉన్న ఫైల్స్ ను షేర్ చేయలేరు. ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది.

BLACKBERRY Messenger
BLACKBERRY కు చెందిన BLACKBERRY Messenger (BBM) యాప్ ఆండ్రాయిడ్,iOS యూజర్లకు లభిస్తుంది. ఈ యాప్ ఒకప్పుడు BLACKBERRY ఫోన్లలో మాత్రమే ఉండేది అయితే ఆ కంపెనీ వారు ఆండ్రాయిడ్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తుండడంతో ఈ యప్ ను కూడా ఇతర ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేసారు.ఇందులో కూడా వాట్సాప్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

TELEGRAM
వాట్సాప్ కు గట్టి పోటిస్తున్న యాప్ TELEGRAM అని చెప్పవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్,iOS యూజర్లకు లభిస్తుంది. ఈ యాప్ లో దాదాపుగా 1.5 జీబీ సైజు ఉన్న ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో లేని చాల వరకు ఫీచర్లు ఈ యాప్ లో ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులలో కేవలం 250 మందినే యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ TELEGRAM యాప్ లో ఒక్కో గ్రూప్ కు 1000 మంది వరకు యాడ్ చేసుకోవచ్చు.

VIBER
ఈ VIBER యాప్ జపాన్ కు చెందినది .వాట్సాప్ లో ఉన్న ఫీచర్లు ఇందులో కూడ ఉన్నాయి . ఈ యాప్ ఆండ్రాయిడ్,iOS యూజర్లకు లభిస్తుంది.ఈ VIBER యాప్ కూడా వాట్సాప్ కు గట్టి పోటీ ఇస్తుంది.

ఈ WECHAT యాప్ చైనా కు చెందినది . వాట్సాప్ కు గట్టి పోటీ ఇస్తున్న యాప్ లో ఇది కూడా ఒకటి. వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ ఫీచర్లు వాట్సాప్ కు పోటీగా ఇందులో క్లారిటీ గా లభిస్తుండడం విశేషం.

SKYPE
సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రో సాఫ్ట్ కు చెందినదే ఈ SKYPE యాప్.ఈ యాప్ లో కూడా వాట్సాప్ అందిస్తున్న ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ కాలింగ్ ఇందులో చాల క్లియర్ గా ఉంటుంది

ALLO
సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఈ Allo యాప్ ను విడుదల చేసింది. వాట్సాప్ కు గట్టి పోటీ ఇస్తున్న యాప్ లో ఇది కూడా ఒకటి. ఈ యాప్ లో కూడా వాట్సాప్ అందిస్తున్న ఫీచర్లు ఉన్నాయి.

KAKAO TALK
ఈ KAKAO TALK యాప్ సౌత్ కొరియా కు చెందినది. ఈ యాప్ ఆండ్రాయిడ్,iOS యూజర్లకు లభిస్తుంది.వాయిస్ కాలింగ్ ఈ యాప్ లో ప్రధానమైన ఫీచర్. వాట్సాప్ లాగే ఇతర అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








