మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

Written By:

ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించాలంటే కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. మార్కుల కంటే ముఖ్యమైన లక్షణాలు నేటి యువతకు అవసరం. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. మౌఖిక పరీక్షల్లో.. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. మిమ్మల్ని పర్‌ఫెక్ట్ జాబర్‌గా తీర్చిదిద్దే బెస్ట్ స్కిల్ ఫుల్ యాప్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఎగబడి కొంటున్న 10 ఫోన్‌లు (లేటెస్ట్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Creddle

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ ప్రీ రెస్యూమ్ బిల్డర్ యాప్ ద్వారా మీ రెస్యూమ్‌ను పర్‌ఫెక్ట్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చు. లింకిడిన్ వంటి సైట్‌ల నుంచి కంటెంట్‌ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తయారు చేసిన రెస్యూమ్ లను పీడీఎఫ్ లేదా డాక్ ఫార్మాట్ లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.

 

Wordzen app

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ యాప్‌లో పొందుపరిచిన ప్రత్యేకమైన స్మార్ట్ సెండ్ బటన్ మీరు మీ ఈమెయిల్ ద్వారా పంపే రెస్యూమ్ ప్రత్యేకమైన డ్రాఫ్ట్‌ను తయారు చేస్తుంది. ఈ డ్రాఫ్ మీ ఎంప్లాయిర్‌కు మరింత నచ్చే విధంగా ప్రొఫెషనల్‌గా ఉంటుంది.

Visualize.me

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

మీ రెస్యూమ్‌ను విజువల్ కౌంటర్ పీస్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే Visualize.me టూల్‌ను ట్రై చేయండి. ఈ టూల్ మీ రెస్యూమ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దటంతో పాటు ఆకర్షణీయమైన ఇన్ఫోగ్రాఫిక్ వండర్‌గా మార్చేస్తుంది. ఈ టూల్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.

 

Pramp

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ టూల్ మీ స్కిల్స్‌కు సంబంధించిన క్వచ్చిన్స్ అలానే ఆన్సర్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ప్రాక్టీస్ ఇంటర్వ్యూ ఆప్షన్ మరింత ఉపయోగపడుతుంది. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఈ టూల్ ఓ ఉపయుక్తమైన సాధనం.

 

Trunk Club

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఫ్యాషన్ అంటే మీకు ఆసక్తా..? అయితే ఈ Trunk Club యాప్‌ను ట్రై చేయండి. వ్యక్తిగత స్టైలిస్ట్‌తో మిమ్మల్ని కనెక్ట్ చేసే ఈ యాప్ కచ్చితమైన కొలతలతో దుస్తులను ప్రిపేర్ చేసి మీ ఇంటి అడ్రస్‌కు షిప్ చేసేస్తుంది. క్లాతింగ్‌కు మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కు మరింతగా ఉపయోగపడొచ్చు.

 

Stitch Fix

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఫ్యాషన్ అంటే ఇష్టపడే మహిళల కోసం ఈ యాప్‌ను ప్రత్యేకించి డిజైన్ చేసారు. ఈ యాప్ ఏర్పాటు చేసే పర్సనల్ స్టైలిస్ట్ ద్వారా ఫ్యాషన్‌కు సంబంధించి వివిధ రకలు ప్రాధాన్యతలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కు మరింతగా ఉపయోగపడొచ్చు.

 

How to Tie a Tie

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ యాప్ మీరు టై ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది. 20 రకాల పద్దతులను ఈ యాప్‌లో పొందుపరిచారు.

 

Job Interview Question-Answer

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ యాప్ మీకు మాక్ ఇంటర్వూలను ఏర్పాటు చేస్తుంది. ఈ జాబ్ ప్రిపరేషన్‌కు ఈ యాప్ మంచి సాధనం.

 

 

Monster

మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

ఈ జాబ్ సెర్చింగ్ ఉచిత మొబైల్ యాప్ మీ ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. యాప్ లో పొందుపరిచిన ప్రీ - ఇంటర్వ్యూ రిసోర్స్ సెక్షన్ తరువాతి ఇంటర్వ్యుకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apps that perfect to your job interview skills. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot