సింగిల్ లెన్స్ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా bokeh ఎఫెక్ట్‌ను పొందటం ఎలా..?

|

డ్యుయల్ కెమెరా సపోర్ట్‌తో వస్తోన్న ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు ఆదరణ పెరగుతోన్న విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ కెమెరాల విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన డ్యుయల్ రేర్ కెమెరా అరేంజ్‌మెంట్స్ మొబైల్ ఫోటోగ్రఫీని కొత్త లెవల్‌కు తీసుకువెళుతున్నాయి. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో ఒక కెమెరా లెన్స్ ఉండాల్సిన స్థానంలో రెండు కెమెరా లెన్సులు ఉంటాయి. వీటిలో ఒకటి ప్రైమరీ లెన్స్ కాకా, మరొకటి సెకండరీ లెన్స్. ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో ప్రైమరీ లెన్స్ మేజర్ లిఫ్టింగ్ పై దృష్టిసారిస్తే, సెకండరీ లెన్స్ అదనపు లైట్ ఇంకా ఫీల్డ్ డెప్త్ పై పనిచేస్తుంది.

 

మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఇరగదీయాలంటే..? సింపుల్ ట్రిక్స్మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఇరగదీయాలంటే..? సింపుల్ ట్రిక్స్

డ్యుయల్ కెమెరా ద్వారా..

డ్యుయల్ కెమెరా ద్వారా..

డ్యుయల్ కెమెరా ద్వారా చిత్రీకరించుకునే ఫోటోల్లో ఫీల్డ్ డెప్త్ అనేది ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఫోటోలు చాలా క్లారిటీగా అనిపిస్తాయి. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో సెన్సార్ సైజ్, పిక్సల్ సైజ్, అపెర్చుర్లు కీలక పాత్ర పోషిస్తాయి. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా తరహాలో Bokeh effectsను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి.

 

 

Bokeh effect అంటే ఏంటి..?

Bokeh effect అంటే ఏంటి..?

మొబైల్ ఫోటోగ్రఫీలో మీరు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నట్లయితే "bokeh" కాన్సెప్ట్ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవల్సిందే. జపనీస్ భాషలో బోకెహ్ అంటే బ్లర్ లేదా బ్లర్ క్వాలిటీ అని అర్థం. బోకెహ్ ఎఫెక్ట్ అనేది ఫోటోగ్రఫీలో గుర్తించదగ్గ ఫీచర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.బోకెహ్ గురించి తెలుసుకునే ముందుకు సాఫ్ట్ ఫోకస్ అలానే బోకెహ్ ఎఫెక్ట్స్ మధ్య ప్రాథమిక వ్యత్యాసాలను కూడా మీరు తెలుసుకోవల్సి ఉంది. సాఫ్ట్ ఫోకస్ ఫోటోగ్రఫీలో సబ్జెక్ట్‌కు ఉద్దేశపూర్వక అస్పష్టత అనేది యాడ్ అవుతుంది. ఇదే సమయంలో సబ్జెక్ట్‌కు సంబంధించిన వాస్తవ ఎడ్జ్‌లు షార్ప్ ఫోకస్‌ను రిటైన్ చేసుకోబడతాయి. ఇక బోకెహ్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి సబ్జెక్ట్‌లోని ఓ ఎలిమెంట్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా బ్లర్ కాబడుతుంది. బోకెహ్ ఎఫెక్ట్ అనేది ఫోటోగ్రాఫ్‌లకు అప్పీలింగ్ లుక్‌ను తీసుకువస్తుంది. బోకెహ్ ఫోటోగ్రఫీలో ఫోకస్ అనేది ఇమేజ్‌లోని నిర్దిష్టమైన ప్రాంతం పైనే కేంద్రీకృతమై ఉంటుంది. మీగిలిని ప్రదేశం మొత్తం బ్లర్ అయి ఉంటుంది.

 

 

ఆఫ్టర్ ఫోకస్ (AfterFocus)
 

ఆఫ్టర్ ఫోకస్ (AfterFocus)

సింగిల్ లెన్స్ స్మార్ట్‌ఫోన్ కెమెరాలతోనూ bokeh ఎఫెక్ట్స్ సాధ్యం..
చాలా మంది బోకెహ్ ఎఫెక్ట్స్ అనేవి డ్యుయల్ కెమెరా ఫోన్ లతోనే సాధ్యమవుతాయని అనుకుంటారు. ఇది పూర్తి అవాస్తవం సింగిల్ లెన్స్ స్మార్ట్‌ఫోన్ కెమెరాల ద్వారా కూడా బోకెహ్ ఎఫెక్ట్స్‌ను ఆస్వాదించవచ్చు. ఇందుకు కొన్ని యాప్స్ సహాయాన్ని తీసుకోవల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆఫ్టర్ ఫోకస్ (AfterFocus)
ఈ యాప్ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు క్యాప్చుర్ చేసిన ఫోటోలను కావల్సిన విధంగా shallow depth-of-field ఎఫెక్ట్‌ను అప్లై చేసుకోవచ్చు. ఇదే సమయంలో బోకెహ్ షేపును కూడా ఎంపిక చేసుకునే వీలుంటుంది.

 

 

బోకెహ్ లెన్స్ (Bokeh Lens)

బోకెహ్ లెన్స్ (Bokeh Lens)

ఐఓఎస్ ఆధారిత డివైస్‌లను మాత్రమే సపోర్ట్ చేయగలిగే ఈ అప్లికేషన్ ద్వారా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్రీగా మార్చేసుకోవచ్చు. ఈ యాప్‌ను వినియోగించుకోవాలంటే 99 సెంట్లను చెల్లించాల్సి ఉంటుంది.

రియల్ బోకెహ్ లైట్ ఎఫెక్ట్స్ (Real Bokeh Light Effects)
ఈ ఉచిత యాప్‌లో వివిధ రకాల బోకెహ్ ఎఫెక్ట్స్ ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి. వీటిని మీరు క్యాప్చుర్ చేసిన ఇమేజ్ పై ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు.

పోర్ట్రెయిట్ బ్లర్ (Portrait Blur)
ఐఓఎస్ ఆధారిత డివైస్‌లను మాత్రమే సపోర్ట్ చేయగలిగే ఈ ఉచిత యాప్‌కు పోర్ట్రెయిట్ బ్లర్రింగ్ ఫీచర్ ప్రధానమైన హైలైట్ గా నిలుస్తుంది. స్లైట్ బ్లర్స్, మేజర్ బ్లర్స్, అప్లై బోకెహ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను ఈ యాప్ కలిగి ఉంది.

బోకెహ్ సిమ్యులేటర్ (Bokeh Simulator)
ఈ ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్‌లో 10 రకాల బోకెహ్ ఎఫెక్ట్స్ ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి. వీటిలో కొన్ని అల్ట్రా - హై రిసల్యూషన్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బోకెహ్ షాట్‌కు అవసరమైన డెప్త్ ఆఫ్‌ ఫీల్డ్‌ను ఈ యాప్ అంచనా వేస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
The next big thing in the world of smartphones are dual rear camera arrangements, one where a high-resolution camera is joined by a second typically low-resolution camera.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X