Home
Apps

అరట్టై యాప్‌లో ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు వచ్చేసింది.. పూర్తి వివరాలు..!

Arattai App : వాట్సాప్‌నకు పోటీగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జోహో కార్పొరేషన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా అరట్టై యాప్‌ ను తీసుకొచ్చింది. అయితే కేంద్ర మంత్రుల ప్రొత్సాహంతో ఒక్కసారిగా పాపులర్‌ అయింది. ఫలితంగా సైన్‌ ఇన్‌ల సంఖ్య ఉహించని విధంగా రెట్టింపు అయింది. అరట్టై అంటే మాట్లాడుకోవడం అని అర్థం. వాట్సాప్‌ తరహానే ఆ యాప్‌లోనూ అనేక ఫీచర్లు ఉన్నాయి.

అరట్టైలో ప్రత్యేకంగా పాకెట్‌ ఆప్షన్‌ కూడా ఉంది. అంటే ప్రైవేట్‌ ఫోల్డర్‌ మాదిరిగా పనిచేస్తుంది. వాట్సాప్‌ ప్రస్తుతం వాయిస్‌, వీడియో కాల్‌, చాట్‌ కు ఫుల్‌ ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును కలిగి ఉంది. అయితే అరట్టై యాప్‌లో కేవలం వాయిస్, వీడియో కాల్స్‌కు మాత్రమే ఎండ్ టు ఎండ్ (E2E) సపోర్టును కలిగి ఉండేది. అయితే తాము ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ పైన పనిచేస్తున్నామని త్వరలోనే విడుదల చేస్తామని గతంలోనే జోహో కార్పొరేషన్‌ తెలిపింది.

Arattai app end to end encryption

వ్యక్తిగత చాట్‌కు ఎండ్ టు ఎన్‌క్రిప్షన్‌ :
ఇందుకు అనుకులంగా అరట్టై యాప్‌లో వ్యక్తిగత చాట్‌కు ఎండ్ టు ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆండ్రాయిడ్‌, iOS, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లకు ఈ అప్‌డేట్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. యూజర్లు వెంటనే యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.

ఐకాన్‌ కనిపిస్తుంది :
ఆండ్రాయిడ్ యూజర్లు v1.33.6, iOS లో V1.17.23, డెస్క్‌టాప్‌లో V1.0.7 వెర్షన్‌లో వ్యక్తిగత చాట్‌కు E2E సపోర్టు ఉంటుందని తెలిపింది. అరట్టై చాట్‌ విండోలో.. మీ చాట్‌ E2E సపోర్టుతో సురక్షితంగా ఉందని చెప్పేలా ఐకాన్‌ కనిపిస్తుందని తెలిపింది.

త్వరలో గ్రూప్‌ చాట్‌ :
తాజా అప్‌డేట్‌తో అరట్టై యాప్‌లో వ్యక్తిగత చాట్‌కు ప్రస్తుతం E2E సపోర్టు అందుబాటులోకి వచ్చింది. త్వరలో గ్రూప్‌ చాట్‌ కు ఈ సపోర్టు రానుందని తెలిపింది. అయితే ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని అప్‌డేట్స్‌ తీసుకొస్తామని జోహో కార్పొరేషన్‌ చెబుతోంది.

* అరట్టై యాప్‌లో వాట్సాప్‌ తరహాలోనే చాట్‌, కాలింగ్‌, వీడియో కాలింగ్‌, స్టేటస్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు అరట్టైలో ప్రత్యేకంగా మీటింగ్స్‌ ఫీచర్‌ కూడా ఉంది. మరియు పాకెట్‌ పేరుతో ప్రైవసీ ఫోల్డర్‌ తరహా ప్రత్యేక ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

దీంతోపాటు యూజర్‌ నేమ్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తరహా ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే మీ ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేయాల్సిన అవసరం లేకుండానే యూజర్‌ నేమ్‌తో ఇతరులతో చాట్‌ చేసేందుకు అవకాశం ఉంది. వాట్సాప్‌ కూడా ఇదే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

* గత నెలలో ఒక్కసారిగా పాపులర్ అయిన అరట్టై యాప్‌, ఇటీవల భారీగా పడిపోయింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ స్టోర్‌లో 105 స్థానానికి పడిపోయింది. అదే ఆపిల్ యాప్‌ స్టోర్‌లో ఏకంగా 123 వ స్థానానికి పడిపోయింది. దీనిపై జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు స్పందించారు.

అరట్టై యాప్‌ విషయంలో తప్పు ఏమీ జరగలేదని.. ఇదో సాధారణ అంశమన్నారు. యాప్‌ స్థిరత్వంపైనే తమ దూరదృష్టి ఉందని చెప్పారు. నంబర్ వన్ గా నిలవడం పెద్ద విషయమని తాము అనుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ఉద్యోగులకు వివరించినట్లు చెప్పారు. ఇదో ప్రత్యేకమైన సందర్భమని, ఎక్కువ కాలం ఉండదని ఉద్యోగులతో చెప్పినట్లు చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Arattai app rolls out end to end encryption support for individual chat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X