వీడియో కాల్స్‌కు ఏది బెస్ట్ యాప్..?

తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వీడియో కాలింగ్ సర్వీసులను అందించే లక్ష్యంతో సాప్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కొద్ది నెలల క్రితం Duo పేరుతో వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ బాటలోనే వాట్సాప్, హైక్ మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ కూడా వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేసాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫీచర్ల పరంగా గూగుల్ డ్యుయో వెనకంజలో ఉంది!

ఫీచర్ల పరంగా గూగుల్ డ్యుయో యాప్‌ను వాట్సాప్ ఇంకా హైక్ మెసెంజర్‌లతో కంపేర్‌చేసి చూసినట్లయితే గూగుల్ డ్యుయో వెనుకంజలో ఉంది. ఈ మూడు యాప్స్ మధ్య తేడాలను పరిశీలించినట్లయితే...

వాటిలో సింగిల్ క్లిక్‌తో వీడియో కాలింగ్

వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో యాప్‌ను హ్యాండిల్ చేయటం అంత సులభంగా అనిపించదు.

గూగుల్ డ్యుయోలో వీడియో కాల్స్ మాత్రమే.?

గూగుల్ డ్యుయో యాప్ కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే ఉపకరిస్తుంది. ఇదే సమయంలో వాట్సాప్, హైక్ యూజర్లు వీడియో కాల్స్‌తో పాటు వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసెజ్‌లు పంపుకోవచ్చు, ఫోటోలను కూడా ఎడిల్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఈ రెండు యాప్‌లలో కొలువుతీరి ఉండటం విశేషం.

హైక్ మెసెంజర్‌లో వేగవంతమైన వీడియో కాల్స్

గూగుల్ డ్యుయో యాప్‌తో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ను వేగవంతంగా కనెక్ట్ అవుతాయి. గూగుల్ డ్యుయో యాప్ లో వీడియో కాల్ ద్వారా ఫ్రెండ్ కు కనెక్ట్ అయ్యేందుకు చాలా సేపు వెయిట్ చేయవల్సి ఉంటుంది.

వందల కోట్ల యూజర్లు...

గూగుల్ డ్యుయోతో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల యూజర్లను కలిగి ఉన్నాయి.

2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి వీడియో కాల్స్...

మీరు 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో ద్వారా వీడియో కాల్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా 3జీ లేదా 4జీ కనెక్షన్ ఉండి తీరాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Are WhatsApp and Hike taking on Google Duo in the video calling. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting