Home
Apps

వాట్సాప్‌లో ఈ పనులు చేస్తున్నారా? ఇక జైలుకు వెళ్ళాక తప్పదు...

ఇండియాలో చాటింగ్ యాప్ లలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో వాట్సాప్ కూడా ఒకటి. రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు సైబర్ నేరస్థులతో సహా అన్ని వర్గాల ప్రజలు దీనిని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు భారతదేశంలోని చట్టాల అమలుకు ప్రధాన ఆందోళనగా మారాయి.

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్

ఎందుకంటే ఈ ప్లాట్ ఫార్మ్ జన సమూహాన్ని ప్రేరేపించడానికి మరియు దాడులను జరపడానికి కూడా ఉపయోగించబడుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వినియోగదారులను రక్షించగలిగినప్పటికీ మెసేజ్ లను ట్రాక్ చేయడం పోలీసులకు మరింత కష్టమవుతుంది.

 

 

వాట్సాప్

వాట్సాప్ ప్రతి యూజర్ గురించి మెటాడేటాను సేకరిస్తుంది. దాని పేరెంట్ సంస్థ ఫేస్బుక్ డిమాండ్ చేసినప్పుడు చట్ట అమలు సంస్థలతో యూజర్ మెటాడేటాను పంచుకోగలదు. పోలీసులు మెసేజ్ లను ఎన్క్రిప్ట్ చేయాలి అని కోరుకుంటే మీ పేరు, ఐపి చిరునామా, మొబైల్ నంబర్, లొకేషన్, మొబైల్ నెట్‌వర్క్ మరియు మీ మొబైల్ హ్యాండ్‌సెట్ రకం వంటి వివరాలను వారు పొందవచ్చు.

 

 

చాట్

మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో, ఎంతసేపు, ఏ సమయంలో చాట్ చేసారో వంటి వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవచ్చు. అలాగే పోలీసులు మీ వద్ద ఉన్న కాంటాక్ట్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. భారతదేశంలో వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రత్యేక చట్టాలు లేనప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం మీరు ఈ క్రింది పనులలో ఏదైనా చేస్తే పోలీసులు మిమ్మల్ని వాట్సాప్ మద్దతుతో అరెస్ట్ చేయవచ్చు.

 

 

చట్టవిరుద్ధమైన

***** చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే ఏదైనా గ్రూప్ సభ్యుడు దొరికితే వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అందరి నిర్వాహకులను ట్రాక్ చేయవచ్చు మరియు వారిలో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.

***** వాట్సాప్‌లో పోర్న్ క్లిప్‌లను ముఖ్యంగా చైల్డ్ పోర్న్, ఇమేజెస్ లేదా అశ్లీల విషయాలను మరొకరికి షేర్ చేయడం ద్వారా మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు.

 

 

వాట్సాప్ గ్రూపు

***** వాట్సాప్ గ్రూపులో ముఖ్యమైన వ్యక్తుల మార్ఫింగ్ ఫోటోలను మరియు వారికి సంబందించిన వీడియోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తే కనుక మిమ్మలిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

***** ఒక మహిళను వాట్సాప్ ద్వారా వేధింపులకు గురిచేస్తే కనుక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మిమ్మల్ని నిసంకోచంగా అరెస్ట్ చేయవచ్చు.

 

 

 

వాట్సాప్  మెసేజ్

***** వేరొకరి పేరుతో వాట్సాప్ అకౌంట్ ను సృష్టించడం మరియు వారి వలె నటించి మరొకరిని మోసం చేయడం వంటివి చేస్తే కనుక మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు.

***** ఏదైనా మతానికి లేదా ప్రార్థనా స్థలానికి హాని కలిగించేలా ద్వేషపూరిత మెసేజ్ లను అందరితో పంచుకోవడం వంటివి చేయడం వలన కూడా మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు.

 

హింస వార్తలు

***** ఏదైనా హింసను ప్రేరేపించడానికి నకిలీ వార్తలు లేదా మల్టీమీడియా ఫైల్స్ లేదా సున్నితమైన అంశాల మీద గల పుకార్లను అందరితో పంచుకోవడం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.

***** జనాలకు డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత వస్తువులను విక్రయించడానికి వాట్సాప్ ఉపయోగించడం వంటివి చేస్తే మీరు నేరుగా మీ యొక్క ఇంటికి పోలీసులను ఆహ్వానించినట్లు అవుతుంది.

***** ఎక్కడైనా సరే దాచిఉంచిన కెమెరాల ద్వారా చట్టవిరుద్ధంగా చిత్రీకరించబడిన వ్యక్తుల వీడియో క్లిప్‌లను మరియు సెక్స్ క్లిప్‌లను మరొకరికి పంపడానికి వాట్సాప్‌ను ఉపయోగించడం వంటివి చేస్తే కనుక వాయ్యూరిజం మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
Are You Doing These Things on WhatsApp No More Going to Prison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X