ఒక్క యాప్‌లో 9 బ్యాటరీ సేవింగ్ ఫీచర్లు

తైవాన్ బ్రాండ్ Asus తన జెన్‌ఫోన్ మాక్స్ సిరీస్ ఫోన్‌ల కోసం సరికొత్త యాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. పవర్ మాస్టర్ పేరుతో యాప్ అందుబాటులో ఉంటుంది. జెన్‌ఫోన్ మాక్స్ సిరీస్ యూజర్లకు FOTA అప్‌డేట్ ద్వారా ఈ అప్‌గ్రేడ్ అందుతుంది. ఈ యాప్‌ను పాత వర్షన్ జెన్‌ఫోన్ మాక్స్ సిరీస్ యూజర్లు కూడా పొందవచ్చు.

ఒక్క యాప్‌లో 9 బ్యాటరీ సేవింగ్ ఫీచర్లు

ఈ యాప్‌లోని 2X Lifespan ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ జీవితకాలన్ని మరింత పెంచుకోవచ్చని Asus చెబుతోంది. బ్యాటరీ ఛార్జ్ సైకిల్స్‌ను పెంచటం, ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో హీటింగ్‌ను నివారించటం, అనవసరమైన యాప్స్‌కు బ్యాటరీ వినియోగాన్ని తగ్గించటం వంటి ఫీచర్లను ఈ యాప్ ద్వారా ఆసుస్ అందిస్తోంది. 9 బ్యాటరీ ఎక్స్‌టెండింగ్ టెక్నాలజీలతో ఈ యాప్‌లోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు Asus వెల్లడిచింది.

ఒక్క యాప్‌లో 9 బ్యాటరీ సేవింగ్ ఫీచర్లు

ఆసుస్ పవర్ మాస్టర్ యాప్‌లో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్, స్కాన్ మోడ్, ఆటో-స్టార్ మేనేజర్, బ్యాటరీ మోడ్స్, క్లియర్ బ్యాక్ గ్రౌండ్ యాప్స్, డిస్‌ప్లే ఆప్షన్స్ ఫర్ బ్యాటరీ సేవింగ్స్, బ్యాటరీ యూసేజ్ స్టాటిస్టిక్స్ వంటి ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటంతో పాటు మన్నికైన బ్యాకప్‌కు దోహదపడతాయి.

 

English summary
Asus ZenFone Max Series Gets PowerMaster App for Battery Savings. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting