జూన్ 30 తరువాత వాట్సాప్ ఈ ఫోన్‌లలో పనిచేయదు

వాట్సాప్ యూజర్లకు మరో రిమైండర్. జూన్ 30, 2017 తరువాత నుంచి వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్‌లలో నిలిచి పోబోతున్నాయి. ఈ మేరకు వాట్సాప్ ఓ ప్రకటనలను విడుదల చేసింది. బహుశా మీరు వాడుతోన్ నఫోన్ కూడా ఈ లిస్టులో   ఉన్నట్లయితే వెంటనే కొత్త వర్షన్‌కు మీ మొబైల్‌ను అప్‌డేట్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సపోర్ట్ నిలిచిపోనున్న మొబైల్ ప్లాట్‌ఫామ్స్ వివరాలు..

వాట్సాప్ తన అఫీషియల్ బ్లాగ్ ద్వారా చేసిన ప్రకటన ప్రకారం.. బ్లాక్‌బెర్రీ 10, నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ ఫోన్ 7.1 మొబైల్ ఫ్లాట్‌ఫామ్‌లకు జూన్ 30 నుంచి వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోబోతంది.

ఆ ఫోన్ ధర రూ.3000కు తగ్గింది, ఇప్పుడు రూ.10,999 మాత్రమే

95 శాతం యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు..

భారత్‌లో 95 శాతం కంటే ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కొత్త సదుపాయాలను యాప్‌లో చేర్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.

బూతు వీడియోలకు భారీ షాకిచ్చిన యూట్యూబ్

వాట్సాప్‌లోకి గేమ్ ఛేంజింగ్ ఫీచర్స్...

ఆండ్రాయిడ్ కోసం రూపొందించబడిన వాట్సాప్ మెసెంజర్ యాప్‌లోకి రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకురాబోతోన్నట్లు సమాచారం. ఈ ఫీచర్లతో కూడిన బేటా వర్షన్ 2.27.213ను, వాట్సాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌కు సబ్మిట్ చేసిందట.

అమెజాన్ సొంత ఫోన్ వచ్చేస్తోంది, రూ.6,000కే?

లైవ్ లొకేషన్ ఫీచర్..

కొత్త ఫీచర్లలో ఒకటైన లైవ్ లొకేషన్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ కాంటాక్ట్లతో పాటుగా లోకేషన్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే మన వాట్సాప్ కాంటాక్ట్‌లను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే వీలుంటుంది. యాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుందట.

25 కోట్ల కంప్యూటర్లను ముంచేసిన మరో వైరస్

టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్‌...

ఈ బేటా వర్షన్‌లో యాడ్ అయిన మరో ఫీచర్‌లో భాగంగా యూజర్లు తమ టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్‌లను కాంటాక్ట్ లిస్ట్‌లోని యూజర్లకు సెండ్ చేసే వీలుంటుంది. యూజర్లు తమ టెక్స్ట్ స్టేటస్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది.

ఇక ఆఫ్‌లైన్ స్టోర్‌లలో Moto G5, Moto G5 plus

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Attention! WhatsApp Will No Longer Work On These Phones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting