Home
Apps

వాట్సాప్‌ యూజర్లు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు..!

వాట్సాప్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెసేజింగ్‌ యాప్స్‌ లో పాపులర్‌ గా ఉంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత సంభాషణలతోపాటు ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం వాట్సాప్‌ ను వినియోగిస్తున్నారు. అయితే తెలిసో, తెలియకో చేసిన కొన్ని తప్పుల వల్ల మీ వాట్సాప్‌ అకౌంట్ పూర్తిగా నిషేధించబడే అవకాశం ఉంది.

లక్షల ఖాతాలు బ్లాక్‌ :
వాట్సాప్‌ (Whatsapp) నిబంధనల ఉల్లంఘన సహా ఇతర కారణాలతో ప్రతి నెల వాట్సాప్‌ అనేక లక్షల అకౌంట్లను బ్లాక్‌ చేస్తోంది. మీరు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించినా లేదా తెలియక చేసిన తప్పుల కారణంగా అయినా మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది.

avoid these mistakes to prevent whatsapp account blocked permanently telugu news

శాశ్వతంగా బ్లాక్‌ అవుతాయి :
మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్‌ అయితే, మీకు వ్యక్తిగతంగా లేదా ఉద్యోగ, వ్యాపార పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే వాట్సాప్‌ ను యూజర్లు ఎలాంటి తప్పులు చేస్తే.. వాట్సాప్‌ అకౌంట్‌ శాశ్వతంగా బ్లాక్‌ చేసే ప్రమాదం ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్పామ్‌ నిబంధనలు ఉల్లంఘించినా :
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు అత్యధికంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో స్పామ్‌ ఒకటి. సంబంధం లేని, అవసరం లేని మెసేజ్‌ లతో ఫోన్‌ ఇన్‌బాక్స్ నిండిపోతోంది. దీనిపై ప్రభుత్వాల స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. యాప్స్‌ లు కూడా కఠిన నిబంధనలతో స్పామ్‌ ను నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తోంది.

వాట్సాప్‌ కూడా స్పామ్‌ నియంత్రణ కోసం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. తెలియని నంబర్లకు అపరిమితంగా మెసేజ్‌ లు పంపుతుంటే మాత్రం మీ వాట్సాప్‌ బ్లాక్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వాట్సాప్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్‌ వీటిని స్పామ్‌గా గుర్తించి బ్లాక్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

మీరు పంపిన మెసేజ్‌లను ఆయా యూజర్లు రిపోర్టు చేసినా, మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపార అవసరాలు సహా వ్యక్తిగత అవసరాల కోసం పరిమితికి మించి మెసేజ్‌ లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఈ యాప్స్‌ వినియోగిస్తున్నారా? :
వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌ (Whatsapp Business) యాప్‌ లను మాత్రమే ఉపయోగించాలి. కొంత మంది అదనపు ఫీచర్‌ల కోసం GB వాట్సా్‌ప్, వాట్సాప్‌ ప్లస్‌ వంటి యాప్‌ల వినియోగం వల్ల కూడా వాట్సాప్‌ ప్రైమరీ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అధికారిక యాప్‌ లు మినహా ఇతర యాప్‌ల వల్ల మాల్వేర్‌ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంటుంది.

వాట్సాప్‌ ద్వారా ఇతర యూజర్లను వేధింపులు సహా ఇతర విధంగా ఇబ్బందులకు గురిచేసినా వాట్సాప్ ఖాతాను బ్లాక్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు చట్టపరంగానూ శిక్ష అనుభవించాల్సి రావచ్చు.

> అధికారిక వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ లను మాత్రమే ఉపయోగించాలి.
> వాట్సాప్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
> వాట్సాప్‌ ఏదైనా అకౌంట్‌ను బ్లాక్‌ చేసే ముందు అనేక హెచ్చరికలను జారీ చేస్తుంది. వీటిని గమనించాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
avoid these mistakes to prevent WhatsApp account blocked permanently
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X