రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !

|

ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌కు కిల్లర్‌గా దూసుకొచ్చిన రాందేవ్ బాబా స్వదేశీ యాప్ పూర్తి స్తాయి లాంచింగ్ కు ముందే సమస్యలను ఎదుర్కుంటోంది. ఈ కింబో యాప్ చాలా ప్రమాదంతో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డిలీట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్‌ కంపెనీ కూడా తన ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను తొలగించింది.కేవలం గూగుల్‌ ప్లే స్టోర్‌ సెర్చ్‌లో మాత్రమే కాక, కింబో పేజీ యాప్‌లో కూడా ఇది ఓపెన్‌ కావడం లేదు. దానిలోకి లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, ఎర్రర్‌ చూపిస్తోంది.

 

పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?

గూగుల్‌, ఆపిల్‌లు..

గూగుల్‌, ఆపిల్‌లు..

ఎందుకు కింబో యాప్‌ను గూగుల్‌, ఆపిల్‌లు తమ సంబంధిత స్టోర్లలో డిలీట్‌ చేశాయో స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ డెవలపర్లు మాత్రం ఈ యాప్‌ చాలా ప్రమాదకరమని, బగ్స్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

స్వదేశీ యాప్‌, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్‌

స్వదేశీ యాప్‌, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్‌

కాగా ఒక ట్విటర్‌ యూజర్‌, కింబో యాప్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేశాడు. దానిలో స్వదేశీ యాప్‌, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్‌ కూడా వాడుతుందని, భారతీయుల కోసం రూపొందించిన ఈ స్వదేశీ యాప్‌లో పాకిస్తానీ నటి ఫోటో కనిపించడం ఏమిటని యూజర్లు ప్రశ్నిస్తున్నారు.

సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలు
 

సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలు

ఇక ఆధార్‌ సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలున్నాయని ద ఫ్రెంచ్‌ సెక్యురిటీ రీసెర్చర్‌ ఇలియట్‌ ఆండర్సన్‌ అన్నారు. ఈ యాప్‌ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్‌ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్‌ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు.

పతంజలి కమ్యూనికేషన్స్‌ కూడా

పతంజలి కమ్యూనికేషన్స్‌ కూడా

పతంజలి కమ్యూనికేషన్స్‌ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్‌ చేయడంతోనే కింబో యాప్‌ను డిలీట్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఈ యాప్‌ మొత్తం ఒక జోక్‌గా అభివర్ణించారు.

కింబోయాప్‌ పెద్ద జోక్‌..

కింబోయాప్‌ పెద్ద జోక్‌..

కింబో ఆండ్రాయిడ్‌ యాప్‌ అనేది భద్రతా విపత్తు. యూజర్ల మెసేజ్‌లన్నీ నేను యాక్సస్‌ చేయగలను. ఈ కింబోయాప్‌ పెద్ద జోక్‌. ఈ సమయంలో దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా ఉంటేనే మేలని ఇలియట్‌ ట్వీట్‌ చేశారు.

బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే..

బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే..

దీంతో పాటు ఇది బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే ఆరోపణలతో కూడా కింబోను ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది. కింబోయాప్‌ మరో అప్లికేషన్‌ కాపీ పేస్టని, వీటి స్క్రీన్‌షాట్లు, వివరాలు అన్నీ సమానంగా ఉన్నాయని ఇలియట్‌తో పాటు మరో ట్విటర్‌ యూజర్‌ కూడా ట్వీట్ చేశాడు.

Best Mobiles in India

English summary
Baba Ramdev's Kimbho app deleted from Play Store, was it because of Pak actress or because it's unsafe more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X