30 నిమిషాల్లో ఇన్సూరెన్స్‌ డబ్బులు మీ చేతికి

మొబైల్ యాప్స్ మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేస్తున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎడ్యుకేషన్, మెడికిల్, హాస్పటాలిటీ, టూరిజం ఇలా అన్ని రంగాల్లో మొబైల్ యాప్స్ అనేవి కీలకంగా మారిపోయాయి. డిజిటల్ సంస్కృతి వైపు ప్రపంచం పరుగులు పెడుతోన్న నేపథ్యంలో ప్రతి సంస్థ తమకంటూ ఓ ప్రత్యేకమైన యాప్‌ను అభివృద్థి చేసి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భీమా రంగంలో విప్లవాత్మక మార్పులు అవసరం...

ఈ యాప్‌లతో ఆయా సంస్థలకు సంబంధించిన సర్వీసులతో పాటు సమస్త సమాచారాన్ని పొందే వీలుంటుంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ఒక్క ఇన్సూరెన్స్ సెక్టార్ మినహా అన్ని రంగాలు డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ విధమైన వాతావరణం ప్రస్తుత మార్కెట్‌ను అలుముకున్న నేపథ్యంలో భీమా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు Bajaj Allianz General Insurance సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టుంది.

Bajaj Allianz డిజిటల్ బాట పట్టింది..

కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీ చేసే క్రమంలో Bajaj Allianz డిజిటల్ బాట పట్టింది. టెక్నాలజీ విభాగంలో అత్యాధునిక టూల్స్‌ను ఉపయోగించుకుని సరికొత్త ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Bajaj Allianz Insurance యాప్‌ను వినియోగించుకోవటం ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పాలసీకి సంబంధించిన లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. కొత్త పాలసీని కొనుగోలు చేయటం, రీన్యూ చేసుకోవటం, క్లెయిమ్ చేసుకోవటం వంటి సదుపాయాలను ఈ యాప్ చేరువ చేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన పాలసీలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

TRAVEL EZEE టూల్

ఒకవేళ మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తీసుకుని ఉన్నట్లయితే ఈ యాప్‌లోని TRAVEL EZEE టూల్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంటుంది. flight delay సమయంలో ఈ టూల్‌ను ఉపయోగించుకుని యూజర్ క్లెయిమ్ అప్లికేషన్‌ను ఫిల్ చేసిన నష్టపరిహారాన్ని పొందవచ్చు. క్లెయిమ్ అయిన అమౌంట్ నిమిషాల వ్యవధిలో యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. Bajaj Allianz వినియోగించుకుంటోన్న బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ క్లెయిమ్స్ విషయంలో ఏమాత్రం జాప్యం జరగకుండా చూస్తోంది.

మూడేమూడు స్టెప్‌లలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ పాలసీ...

Bajaj Allianz Insurance యాప్‌ను ఉపయోగించుకుని మూడేమూడు స్టెప్‌లలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది. యూజర్ తన బోర్డింగ్‌ పాస్, పాస్‌పోర్ట్ లేదా ఫ్లై‌ట్ టికెట్‌ను స్కాన్ చేయటం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ పాలసీని పొందవచ్చు. పేమెంట్ పూర్తి అయిన వెంటనే పాలసీ కాపీని యూజర్ మెయిల్ ఐడీకి పంపటం జరుగుతుంది.

మోటార్ ఆన్ ద స్పాట్ (మోటార్ ఓటీఎస్)

Bajaj Allianz Insurance యాప్‌‌లో ఏర్పాటు చేసిన 'Motor On The Spot' సర్వీస్ ద్వారా మీ మెటార్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను స్మార్ట్‌ఫోన్‌లోనే సెటిల్ చేసుకునే వీలుంటుంది. ఈ సర్వీస్ ద్వారా రూ.20,000 వరకు మోటర్ ఇన్సూరెన్స్‌‌ను క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. 7 రోజుల్లో జరిగే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను కేవలం 30 నిమిషాల్లో మోటార్ ఆన్ ద స్పాట్ సర్వీస్ సెటిల్ చేసేస్తుంది. యాక్సిడెంట్స్ సమయంలో యూజర్‌కు చెల్లించాల్సి వచ్చే ఇన్సూరెన్స్‌‌ను క్లెయిమ్‌ను డేటా అనాలిటిక్స్ టూల్ ఆధారంగా Bajaj Allianz అంచనా వేసుకుని 20 నిమిషాల వ్యవధిలో ఓ అంచనాకు వచ్చేస్తుంది. ఇవ్వాల్సిన క్లెయిమ్ అమౌంట్‌ను కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యేలా చూస్తుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం ప్రయివేటు కార్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే టూ-వీలర్స్‌కు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

BOING

BOING పేరుతో ఓ చాట్‌బోట్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను కూడా Bajaj Allianz ఆఫర్ చేస్తోంది. కస్టమైజిడ్ ఆర్కిటెక్చర్‌తో డిజైన్ కాబడిన ఈ 24/7 కస్టమర్ సర్వీస్ యూజర్ సందేహాలకు ఇన్‌స్టెంట్‌గా స్పందించటం జరుగుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ అలానే లెర్నింగ్ క్యాపబులిటీస్‌తో కూడిన NLP ఇంజిన్‌ను‌ BOING చాట్‌బోట్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించుకుంటుంది. ఈ చాట్‌బోట్ సర్వీస్ ప్రస్తుతానికి Bajaj Allianz వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో Facebook Messengerలో యాడ్ కాబోతోంది.

సులువుగా అర్థం చేసుకోగలిగే యూజర్ ఇంటర్‌‌ఫేస్‌..

సులువైన యూజర్ ఇంటర్‌‌ఫేస్‌తో వస్తోన్న ఈ చాట్‌బోట్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మోటార్ క్లెయిమ్ రిజిస్టర్ చేయవచ్చు, పాలసీ సాఫ్ట్ కాపీని పొందవచ్చు, పాలసీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు, క్లెయిమ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు, సమీపంలోని బ్రాంచ్ వివరాలను తెలుసుకోవచ్చు, సమీపంలోని నెట్ వర్క్ హాస్పటల్ వివరాలను తెలుసుకోవచ్చు, సమీపంలోని గ్యారేజ్ లేదా వర్క్ షాప్ వివరాలను తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bajaj Allianz General Insurance: Transforming industry with first-of-its kind digital initiatives. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot