వాట్సప్ మోజులో మీరు మరిచిపోయిన బెస్ట్ యాప్స్ ఏంటో తెలుసా ?

ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్ తెలియని జీవి ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వాట్సప్ కు ఎడిక్ట్ అయిపోతున్నారు.

|

ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్ తెలియని జీవి ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వాట్సప్ కు ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే ఈ వాట్సప్ లో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. కేవలం చాటింగ్, షేరింగ్ మాత్రమే కాదు మరెన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇది బోర్ కొట్టేసిన వారికి కొత్తగా ఈ రేంజులో ఫీచర్లు ఉండే యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది వెతుకుతుంటారు. వాట్సప్ లాగే ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన యాప్స్ ఇంకా ఉన్నాయి. కానీ వాటిని యూజ‌ర్లు వాట్సప్ అంత ఎక్కువ‌గా వాడ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ అవి వాట్సప్‌కు గ‌ట్టి పోటీనిస్తూ యూజ‌ర్ల‌ను పెంచుకుంటూనే ఉన్నాయి. ఆ యాప్స్ ఏమిటో ఓ లుక్కేయండి.

వాట్సప్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 ఫీచర్లు ఇవే..వాట్సప్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 ఫీచర్లు ఇవే..

హైక్‌

హైక్‌

హైక్ (Hike) మెసెంజ‌ర్ యాప్ ఇండియాకు చెందిన‌దే. వాట్సప్‌లో ఉన్న ఫీచ‌ర్ల‌న్నీ ఇందులో కూడా ఉన్నాయి.స్టోరీస్‌, కెమెరా, లైవ్ ఫిల్ట‌ర్స్ అనే కొత్త ఫీచ‌ర్ల‌ను ఈ మ‌ధ్యే ఇందులో యాడ్ చేశారు.

లైన్‌

లైన్‌

లైన్ (Line) యాప్ కూడా వాట్సప్ లాంటి ఫీచ‌ర్ల‌నే యూజ‌ర్ల‌కు అందిస్తోంది. 21.4 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. టైం లైన్‌, కూప‌న్స్‌, వీడియో స్నాపింగ్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. దాదాపుగా 1 జీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న ఫైల్స్‌ను ఇందులో షేర్ చేసుకోవ‌చ్చు.

టెలిగ్రాం (Telegram)

టెలిగ్రాం (Telegram)

వాట్సప్‌కు గ‌ట్టి పోటిస్తున్న యాప్ టెలిగ్రాం అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో గ‌రిష్టంగా ఫైల్స్‌ను 1.5 జీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న‌ప్ప‌టికీ షేర్ చేసుకోవ‌చ్చు. వాట్సప్‌లో లేని చాలా వ‌ర‌కు ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. వాట్సప్ గ్రూప్‌ల‌లో ఒక గ్రూప్‌కు కేవ‌లం 256 మందిని మాత్ర‌మే యాడ్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో ఒక గ్రూప్‌కు గ‌రిష్టంగా 1000 మందిని యాడ్ చేయ‌వ‌చ్చు.

వైబ‌ర్ (Viber)

వైబ‌ర్ (Viber)

ఈ యాప్ జ‌పాన్‌కు చెందిన‌ది. వాట్సప్ లాంటి ఫీచ‌ర్లే దీంట్లోనూ ఉన్నాయి. ఈ యాప్ కూడా వాట్సప్‌కు గ‌ట్టి పోటీనే ఇస్తున్న‌ది.

వీచాట్ (WeChat)

వీచాట్ (WeChat)

ఇది చైనాకు చెందిన‌ది. వాట్సప్‌కు గ‌ట్టి పోటినిస్తున్న యాప్‌ల‌లో ఇది కూడా ఒక‌టి. ఇందులో 93.8 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు. వీడియో కాలింగ్‌, వాయిస్ కాలింగ్ ఫీచ‌ర్లు వాట్సప్‌కు పోటీగా ఇందులో క్లారిటీతో ల‌భిస్తుండ‌డం విశేషం.

స్కైప్ (Skype)

స్కైప్ (Skype)

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన‌ది ఈ యాప్‌. దీంట్లోనూ వాట్సప్ లాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. వాయిస్ కాలింగ్ ఇందులో చాలా క్లియ‌ర్‌గా ఉంటుంది.

గూగుల్ అలో (Google Allo)

గూగుల్ అలో (Google Allo)

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గ‌తేడాది ఈ యాప్‌ను విడుద‌ల చేసింది. దీన్ని పెద్ద సంఖ్య‌లో యూజ‌ర్లు వాడుతున్నారు. వాట్సాప్‌కు ఈ యాప్ గ‌ట్టి పోటీనిస్తోంది. ఇందులోనూ వాట్సాప్ లాంటి ఫీచ‌ర్లే ఉన్నాయి.

క‌కావో టాక్ (KakaoTalk)

క‌కావో టాక్ (KakaoTalk)

ఇది సౌత్ కొరియాకు చెందిన‌ది. ఈ యాప్ గురించి చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ ఈ యాప్ కూడా వాట్సప్‌కు పోటీనిస్తోంది. వాయిస్ కాలింగ్ ఇందులో ప్ర‌ధాన‌మైన ఫీచ‌ర్‌. 

 ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సప్ రెండూ ఫేస్‌బుక్‌వే అయిన‌ప్ప‌టికీ ఈ రెండు యాప్‌ల‌ను యూజ‌ర్లు వాడుతున్నారు.వాట్సప్‌లో ఉన్న ఫీచర్ల‌న్నీ మెసెంజ‌ర్‌లో కూడా ఉన్నాయి. 

Best Mobiles in India

English summary
Best 10 Alternatives to WhatsApp Messaging App; Encryption, Privacy Matters More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X