ప్రోగ్రామింగ్ నేర్చుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

Written By: BOMMU SIVANJANEYULU

సాఫ్ట్‌వేర్ విభాగంలో రాణించాలనుకునే వారు తమ ఐటీ స్కిల్స్‌‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవల్సి ఉంటుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ప్రోగ్రామింగ్ కోర్సులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవటం ద్వారా ప్రొఫెషనల్‌గా మరింత రాటు తేలేందుకు ఆస్కారం ఉంటుంది.

ప్రోగ్రామింగ్ నేర్చుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంగ్లీష్ మీద పూర్తి పట్టున్న వారు ఆన్‌లైన్‌లో ప్రోగ్రామింగ్ నేర్పించేందుకు బెస్ట్ ప్రోగ్రామింగ్ వెబ్‌సైట్స్ సిద్ధంగా ఉన్నాయి. రోజుకు ముప్పై నిమిషాల సమయాన్ని కేటాయించటం ద్వారా వీటిని సులువుగా నేర్చుసుకోవచ్చు. ప్రోగ్రామ్ లెర్నింగ్ నిమిత్తం గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రోగామింగ్ హబ్, లెర్న్ టు కోడ్

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ అప్లికేషన్‌లో 1800 పై చిలుకు ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నయి. వీటిని 17 కంటే ఎక్కువు భాషల్లో నేర్చుకునే వీలుంటుంది. ప్రాక్టీస్ ఇంకా లెర్నింగ్ నిమిత్తం ఈ ప్రోగ్రామ్ ను ఉపయోగించుకోవచ్చు.

HTML, CSS, Javascript వంటి ప్రోగ్రామ్ లను ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేకుండా నేర్చుకోవచ్చు.

ఉడాసిటీ - లెర్న్ ప్రోగ్రామింగ్

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్‌లో అందుబాటులో ఉంచిన కోర్సులను ఫేస్‌బుక్, గూగుల్, క్లౌడ్‌‌ఎరా, మోంగో‌డీబీ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు చెందిన ఎక్స్‌పర్ట్స్ డిజైన్ చేయటం జరిగింది. ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన బేసిక్స్‌తో పాటు మోస్ట్ అడ్వాన్సుడ్ కోర్సులను ఇక్కడ నేర్చుకునే వీలుంటుంది. TML, CSS, Javascript, Python, Java ఇంకా ఇతర ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించిన కోడింగ్‌ను ఈ యాప్ ద్వారా నేర్చుకునే వీలుంటుంది.

సీ ప్రోగ్రామింగ్

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా బేసింగ్ ‘సీ' ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన నోట్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో క్యారీ చేసే వీలుంటుంది. ఈ యాప్‌లో 90కు పైగా ‘సీ' ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. సింపుల్ యూజర్ ఇంట‌ర్‌ఫేస్‌ను కలిగి ఉండే ఈ యాప్ ద్వారా కంటెంట్‌ను మరింత సులువుగా అర్థం చేసుకోవచ్చు. చాప్టర్ వైస్ ‘సీ' ట్యుటోరియల్స్ ఇక్కడ లభ్యమవుతయి. ఇదే సమయంలో ముఖ్యమైన ఎగ్జామ్ క్వచ్చిన్స్‌ను కూడా ఇక్కడ నుంచి పొందవచ్చు.

సొంత గూటిలో షియోమికి దిమ్మతిరిగే షాకిచ్చిన హానర్

లెర్న్ ఫైథాన్

యాప్ డౌన్‌లోడ్ లింక్

మోస్ట్ డిమాండింగ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్‌లో ఒకటైన Pythonను ఈ యాప్ మీకు మరింత సులువుగా నేర్పిస్తుంది. ఈ యాప్‌లో ఫైథాన్ బేసిక్స్‌తో పాటు డేటా టైప్స్, కంట్రోల్ స్ట్రక్షర్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యుల్స్, ఎక్సెప్షన్స్ ఇంకా ఫైల్స్ అందుబాటులో ఉంటాయి.

లెర్న్ ప్రోగ్రామింగ్

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ‘ఇంటరాక్టివ్ టెక్స్ట్‌బుక్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్' అనే థీసిస్‌కు సంబంధించి క్రియేట్ చేయటం జరిగింగి. HTML 5కు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ లభ్యమవుతాయి.

హెచ్‌టి‌ఎమ్ఎల్ 5తో పాటు 30కిపైగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను ఇక్కడ నేర్చుకోవచ్చు. మీ ఉద్యోగానికి సంబంధించిన శాంపిల్ ఇంటర్వ్యూ క్వచ్చిన్స్‌ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయబడి ఉంటాయి. యాప్ సెట్టింగ్స్‌ను ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Today the time is of being intelligent, and programming & coding is the best thing for computer geeks that can help them choose a bright career.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot